Others

పరీక్షలు ధీమాగా రాయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్షిక పరీక్షలైనా, ప్రవేశ పరీక్షలైనా దగ్గరపడుతున్నాయంటే విద్యార్థుల్లో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే.
కళాశాలలో, తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు. అలాంటి విద్యార్థులలో మంచి మార్కులు తెచ్చుకోగలమని నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ఉపాధ్యాయులలో, అధ్యాపకులలో, తల్లిదండ్రులలో అలాంటి నమ్మకమే ఉంటుంది. కానీ ఫిబ్రవరి, మార్చి రాగానే పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ వారిలో కొందరిలో ప్రవర్తనలో మార్పు స్టార్ట్ అవుతుంది. ప్రీ ఫైనల్ పరీక్షలు రాసేటపుడు తెలిసిన అంశాలు కూడా సరిగా గుర్తు రావటం లేదు. వారిలో ఆందోళన మొదలవుతుంది. సబ్జెక్ట్‌లో ఎంతో ఫాస్ట్‌గా ఉన్నప్పటికీ పరీక్షల సమయంలో ఆ అంశాలు గుర్తుకు రావడమే ముఖ్యం. దీనికి కారణం పరీక్షలనగానే ఒత్తిడి పెరిగిపోతుంది. కనిపించిన ప్రతీవారు కూడా ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? ఇప్పుడు రాసే ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ కదా అని అడిగేసరికి అప్పటి వరకూ ఉన్న ధైర్యం కాస్తా సన్నగిల్లుతుంది. సరిగా చదవలేమేమో అనే కంగారు, అయ్యో నేను చదివినవి పరీక్షా పత్రంలో రాకపోతే ఎలాగా అని, చదివినవి ఆ సమయంలో గుర్తుకు రాకపోతే నా పరిస్థితి ఏమిటీ ఇలా అనవసర భయాలు వెంటాడుతుంటాయి. సంవత్సరంపాటు చదివినదంతా ఎగ్జామ్స్ సమయంలో రివిజన్ చేసుకొని, పై చదువులకు భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను రాయడం తేలికైన పనేం కాదు.
పరీక్షల ఒత్తిడి కలగడానికి ప్రధానమైన కారణాలు:
ప్రస్తుత విద్యావిధానం: పరీక్షల అనంతరం పై చదువులకు వెళ్లాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎంట్రెన్స్ పరీక్షలు రాయాల్సిందే.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ కోర్సుల్లోనైనా సీటు సంపాదించాలంటే తప్పనిసరిగా మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సిందే.
అందరూ విద్యార్థికి టార్గెట్ ఇచ్చేవారే. తల్లిదండ్రులూ, పాఠశాల యాజమాన్యాలు, బంధువులు ఇలా ప్రతీ ఒక్కరూ చదివే విద్యార్థికి టార్గెట్ ఇచ్చేవారే. ఆ టార్గెట్‌ను అందుకోవడానికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యార్థి నానా కష్టాలు పడుతుంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మరేమీ ఫర్వాలేదు, ఆందోళన పడవద్దు’ అని ధైర్యం చెప్పాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లలు సరిగా పరీక్ష రాస్తారో లేదో, ర్యాంకు వస్తుందో రాదోనని ఆందోళనలకు గురవుతుంటారు. తల్లిదండ్రుల ఆందోళనలతో విద్యార్థి మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.
అనవసర ఆలోచనలు: తన తోటి స్నేహితులంతా మార్కులు, ర్యాంకుల కోసం తీవ్రంగా పడుతున్న శ్రమ, ప్రొద్దున్న రాత్రి చదువుతున్న తీరును చూస్తూ వారి కంటే ఎక్కువ మార్కులు సాధించాలని, మార్కులు సాధించకపోతే జీవితం అంతా ఏమవుతుందోనన్న ఆలోచనలూ వెంట పడుతుంటాయి.
ఫెయిల్యూర్ భయం: గతంలో ఏదైనా సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు రావడం, ఆ సబ్జెక్ట్ చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడు రాసినా తక్కువ మార్కులే వస్తున్నాయి. ఇపుడు కూడా ఇలాగే మళ్లీ విఫలమవుతానేమోనని భయం.
సమయాభావం: చాలామంది విద్యా సంవత్సరమంతా ఎంజాయ్ చేసి పరీక్షలు దగ్గరపడినప్పుడు పుస్తకాలను ముందు పెట్టుకుని చదవడం ప్రారంభిస్తారు. ఈ కొద్ది రోజుల్లో ఇంత సిలబస్ పూర్తిచేయలేమోమనే ఆందోళన, ఒత్తిడి మొదలవుతాయి.
నెగెటివ్ ఆలోచనలు: పరీక్షలలో తెలిపిన ప్రశ్నలు వస్తాయో రావో, వచ్చినా పేపర్ వాల్యుయేషన్ చేసే వారు మార్కులు సరిగా వేస్తారో, వేయరో అనే నెగెటివ్ ఆలోచనలు.
ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం: మంచిగా చదివే విద్యార్థుల్లో సైతం ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల పరీక్షలు సమీపిస్తుండగానే భయం, ఒత్తిడి మొదలవుతాయి.
పై వాటిని అధిగమించడానికి ఈ క్రింది వాటిని ఫాలో అయితే పరీక్షలు రాయడం, మార్కులు సాధించడం తేలిక అవుతుంది.
ఉల్లాసం ఉత్సాహం: పరీక్షల సమయంలో విద్యార్థులు ఉల్లాసం, ఉత్సాహంగా ఉండాలి. మనసును హాయిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సమయం దొరికినప్పుడు మనసుకు సరిపడా విశ్రాంతిని ఇవ్వాలి.
సబ్జెక్ట్ మీద పట్టు: ప్రిపరేషన్ మార్కుల కోసం కాకుండా సబ్జెక్టు మీద పట్టు కోసం కృషి చేయడం అలవాటు చేసుకోవాలి. ఎంసెట్ లాంటి ప్రవేశపరీక్షలు రాయబోయేవారికి సబ్జెక్టు మీద అవగాహన ఎంతో అవసరం. పరీక్షలు ప్రారంభ సమయం దాకా సిలబస్‌ను అలాగే ఉంచకుండా ఎప్పటికప్పుడు క్షుణ్నంగా చదవాలి. సబ్జెక్ట్‌లో అనుమానాలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. పరీక్షలప్పుడు వచ్చే సందేహాలు ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తాయి. చదివిన పాఠాల్లో ముఖ్యమైన అంశాలను బులెట్ పాయింట్లుగా నోట్ చేసుకోవాలి. వాటిని తెలిసిన విషయాలతో లింక్ ఏర్పాటు చేసుకుంటే ఎప్పటికీ మర్చిపోయే అవకాశం ఉండదు.
రివిజన్: పరీక్షల సమయంలో ప్రతీ సబ్జెక్ట్‌కు తగు సమయం కేటాయించుకుని, ప్రణాళిక ప్రకారంగా రివిజన్ చేసుకోవాలి. నిర్వచనాలు, పట్టికలు, సూత్రాలు, రసాయనిక సమీకరణాలు, స్పెల్లింగులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ చదివి గుర్తుపెట్టుకోవాలి. రివిజన్ సమయంలో చదవడానికి సులభంగా ఒక పేపర్ పైన రాసుకుని చదువుకునే గది గోడపైన అంటించుకోవాలి.
గత ప్రశ్నపత్రాల జవాబులు ప్రాక్టీస్ చేయాలి: గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలకు నిర్ధిష్ట సమయంలో జవాబులు రాయటం మంచిది. దీనివల్ల పరీక్షపై ఉండే భయం తగ్గిపోయి ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయో అవగాహన ఏర్పడుతుంది. ఒకటే ప్రశ్నను తిప్పితిప్పి ఎన్ని రకాలుగా ఇస్తారో అవగాహన వస్తుంది.
నిర్దేశిత సమయంలో ప్రశ్నపత్ర జవాబులు పూర్తి చేయడం తెలుస్తుంది.
శారీరక వ్యాయామం: రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మీకు మీరే బాస్: మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయాలు, పరీక్షలో ఏం చేయాలి అనే దృఢ నిశ్చయంతో పరీక్షకు సన్నద్ధం కండి. పరీక్షలో మీరు తీసుకునే నిర్ణయానికి మీరే బాస్ అనే పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగానుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
వృషభం (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగానుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మిథునం (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధన లాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపంచేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగానుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
తుల (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ మేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధివుంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధిగమవుతాయి. ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
కుంభం (్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగానుండుటకు ప్రయత్నించాలి.
మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదావేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

-్

- అట్ల శ్రీనివాస్‌రెడ్డి.. 9703935321