Others

ఆహార్యానికి తగినట్లుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి అమ్మాయిలు వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా, సందర్భానుసారంగా హ్యాండ్‌బ్యాగుని ఎంచుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్లినా, కాలేజీకి వెళ్లినా, ఆఖరికి విహార యాత్ర అయినా సరే.. వెంట హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే.. ఇది అవసరం మాత్రమే కాదు.. అమ్మాయిల స్టైల్ స్టేట్‌మెంట్ కూడా.. హోబో, స్లింగ్, టోటే.. ఇలా ఏ బ్యాగు పేరు చెప్పినా రంగులు, ఆకృతులు మారతాయే కానీ ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. అందుకే.. నేటి యువత ఇప్పటి ఫ్యాషన్‌ను అనుసరించి హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకుంటోంది. ఏదో ఒకటని కాకుండా హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకునేటప్పుడు కంటికింపుగానే కాదు.. సౌకర్యంగానూ ఉండేట్లుగా చూసుకోవాలి. అంతేకాదు బ్యాగు కొనాలనుకున్నప్పుడు వేసుకునేవారి శరీరాకృతికి కాస్త భిన్నమైనదాన్ని ఎంచుకోవాలి. అప్పుడే కొత్తగా కనిపిస్తారు. ఉదాహరణకు హ్యాండ్‌బ్యాగ్ కొనేవారు సన్నగా, పొడవుగా ఉండే చిన్న బ్యాగు కొనుక్కోవాలి. ఇలాంటివారు సాయంత్రం వేళల్లో పార్టీలకు క్లచ్ పర్సుని ఎంచుకుంటే ఆ ఆనందమే వేరు.
* ఎత్తు తక్కువగా ఉన్నవారికి మరీ పెద్దగా ఉన్న ఓవర్‌సైజ్డ్ బ్యాగులు బాగుండవు. ఇవి వేసుకున్నవారిని మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. అలాగే పొడుగ్గా, వేలాడేవాటినీ ఎంచుకోకూడదు.
* బ్యాక్‌ప్యాక్‌లు అయితే శరీరాకృతిని కనిపించకుండా చేస్తాయి. అలాగని మరీ చిన్న బ్యాగులను కూడా ఎంచుకోకూడదు. వీలైతే ప్రింట్లు, చిన్న చిన్న డిజైన్లున్న వాటిని ఎంచుకోవచ్చు.
* కేవలం శరీరాకృతే కాదు.. సందర్భాన్ని బట్టి వాటిని వాడాల్సి ఉంటుంది. దుస్తులకు తగినట్లుగా మెరుపులున్నవాటినీ వాడొచ్చు. స్నేహితులతో వెళ్తుంటే.. స్లింగ్, షోల్డర్ తరహా బ్యాగుల్ని వేసుకోవచ్చు.
* టోటె, స్లింగ్.. ఇలా హ్యాండ్‌బ్యాగ్ ఏదయినా సరే.. సందర్భానికి తగినట్లు ఉండాలనుకుంటాం. విభిన్నమైన డిజైన్‌లో, ఆకర్షణీయమైన రంగులో ఉండేది ఎంచుకుంటాం. ఇప్పటికే చాలా రకాల హ్యాండ్‌బ్యాగులను వాడాం అనుకునేవారు కటౌట్ బ్యాగులను ఎంచుకోవచ్చు. బ్యాగు వెలుపలివైపు జాలీలా చిల్లులూ, గళ్లూ, ఇతరత్రా అలరించే ఆకృతుల్లో కత్తిరించిన డిజైన్లు కనిపిస్తాయి. దాన్ని కవర్ చేస్తూ లోపలివైపు బ్యాగు ఉంటుంది. దీనివల్ల బయటికి చూడటానికి బ్యాగు కొత్తగా కనిపిస్తుంది.
* పగలైనా, రాత్రి పార్టీలకైనా సరే.. స్టైలిష్‌గా కనిపించేలా చేయడానికి హోబోను ఎంచుకోవాలి. ఇందులో వస్తువులు కూడా ఎక్కువగానే పడతాయి.
* కాలేజీకి రోజూ తీసుకెళ్లడానికే కాదు ప్రయాణాల్లోనూ, ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు దీని ఎంచుకోవచ్చు. ఇవి ఉద్యోగినులకూ అనువుగానే ఉంటాయి.
* టోటె చూడటానికి కాస్త పెద్దగా కనిపిస్తుంది. ఎక్కువ వస్తువులు వెంట తీసుకెళ్లాలనుకున్నప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. విహారయాత్రలకూ ఇది చక్కని ఎంపిక. అవసరాన్ని బట్టి టాబ్లెట్, ల్యాప్‌టాప్‌ల వంటివాటిని కూడా పెట్టుకోవచ్చు.
* భుజాల మీదుగా వేసుకునేదాన్ని క్రాస్‌బాడీ అంటారు. దీని పట్టీలు లెదర్‌తోకానీ, లింక్ చైన్‌లాగానీ ఉంటాయి. ఇవి మన అవసరానికి తగినట్టుగా చిన్న, మధ్యస్థ పరిమాణాల్లో లభిస్తాయి. కాలేజీ అమ్మాయిలకు ఇది చక్కని ఎంపిక. ఉద్యోగాలకు వెళ్లేవారు ఇలాంటివాటిని ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటాయి.
* షోల్డర్ బ్యాగును యుటిలిటీ బ్యాగ్ అని కూడా అంటారు. ఇందులో సాధారణ వస్తువులే కాదు.. ఫోన్, ట్యాబ్లెట్ వంటివి ఇందులో చక్కగా పడతాయి.
* చేతితో పట్టుకునేందుకు అనువుగా ఉండేది క్లచ్. ఇది ఎక్కువగా పార్టీలకు నప్పుతుంది. ఎన్నో రంగులు, మరెన్నో హంగులతో ఇప్పుడు రకరకాల డిజైన్లలో ఈ పర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
* చెక్కపెట్టెలు మనకేం కొత్తకాదు.. కానీ వీటితో తయారుచేసిన హ్యాండ్‌బ్యాగుల గురించి విన్నారా? ఇవి ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని హల్‌చల్ చేస్తున్నాయి. చెక్కతో తయారుచేసిన క్లచ్‌లు.. ఆధునిక హంగులు అద్దుకుని కాలేజీ అమ్మాయిల చేతుల్లో ఒదిగిపోతున్నాయి.
* ఇప్పటి యువత తమ హ్యాండ్‌బ్యాగ్‌ను అభిరుచికి తగ్గట్లు చార్మ్స్‌తో తీర్చిదిద్దుకుంటోంది. హృదయం, పామ్‌పామ్‌బాల్స్, వివిధ రకాల జంతువులు, తాళాలు, బార్బీబొమ్మలు.. వంటివాటిని బ్యాగుకు అలంకరిస్తున్నారు. *