Others

చెట్టుతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగులు లోపలికి వేస్తూ
బయటికి విస్తరిస్తుంది,
ఆత్మీయత రవంత చూపినా
కలకాలం అల్లుకుపోతుంది!
మట్టిలో బంధించినా
గాలికి రెక్కలందిస్తుంది,
నిప్పులు తాగినా
చల్లదనం కురిపిస్తుంది,
చెడును గొంతులో దాచుకొని
మంచినే శ్వాసగా వదుల్తుంది!
ఎగిరే పక్షులకు,
సేదతీర్చే తల్లికొంగులా మారి,
నీడను పంచుతూ
నేలఋణం తీర్చుకుంటుంది!
ఓడిపోయిన ప్రతిసారీ,
గెలుపు చిగురు పోరాటం చేస్తూ,
రాలిపోయే జీవితాలకు
ఆశలను నింపే ఆదర్శవౌతుంది!

-పుట్టి గిరిధర్.. 9491493170