Others

ఒకసారి సరిపెట్టుకున్నాక.. ఎంత గోల చేసీ ఏంలాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా రక్తనాళాల్లో వెచ్చగా రుూదులాడేవాడు
తలపుల వాకిట్లో కాపలా కాసేవాడు
ప్రతి అడుగుకీ ముందుండేవాడు
అగడ్తలు దాటించేవాడు
శిఖరాగ్రాలు చేర్చేవాడు
నా మావటీవాడు వాడే
రథసారథి వాడే
వాడే నా చూడామణి
వాడే నా కంఠధ్వని
ఏమయ్యాడు?
నా ముష్టి
జీవన సమిష్టి
వాడే.
వాడే
నా వెన్నుదన్ను
నా మూడో కన్ను
నా జెండా
ఎజెండా వాడే
వాడే
ఏమయ్యాడు

-మల్లాప్రగడ రామారావు 9989863398