Others

సరియా మాతో.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వరాజ్ వారి దీపావళి చిత్రంలో సావిత్రి అభినయంతో అద్భుతంగా ప్రేక్షకులకు నచ్చే పాట -సరియా మాతో సమరాన గెలువ. ఎపి కోమల ఆలపించిన ఈ పాట ఆపాత మధుర గీతాలను ఆస్వాదించే వారికి తియ్యని వెనె్నలలా మనసును తాకుతుంది. వినేకొద్దీ ఇంపనిపిస్తుంది. సంగీతం ఘంటసాల అందించగా ఎస్ రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రతి దీపావళి పండుగకు క్రమం తప్పకుండా ప్రతి ఛానల్‌లో ప్రసారమయ్యే చిత్రంలో ప్రముఖ లలిత శాస్ర్తియ సంగీత గాయని ఎపి కోమల ‘సరియా మాతో సమరాన నిలువగలడా అంటూ ధీమాగా నరకుడిపై సవాల్ విసిరేలా గానం చేశారు. ఈ పాట అన్ని పాటలకు ధీటుగా ప్రాచుర్యం పొందడం విశేషం. గాన ప్రతిభగల వారికి దొరకాలేగానీ ఏ పాటైనా వారికి కరతలామలకమే అన్నట్టు సాగుతుంది. పాటలో భావ ప్రకటన కోమల కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. పాట పాడే తీరు వైవిధ్యంగా అలరిస్తుంది. అహంకారం, గర్వం, ఠీవి, హుందాతనం, నిర్లక్ష్యం, అతిశయం అంతే పాళ్లలో ప్రేమానురాగాలు కలిగిన పురాణ పాత్ర సత్యభామది. ఆ పదానికి పర్యాయపదంగా ప్రేక్షకుల గుర్తింపు పొందారు నటి జమున. కానీ ఈ పాటలో మహానటి సావిత్రి కోమలమైన పాటకు మరింత శోభను చేకూర్చింది. సముద్రాల సాహిత్యంలో కనుకొనలతో కోపాలు, యదుపతి మురిపాలు, నరకుడి వెరపు, ఆయనను తరమడంలో సత్యభామ తెగువకు ధనుజలోకం కంపించి పోవడం, ధనువునుగొని నరకుని మట్టుపెట్టిన భామగా బిరుదుని సాధిస్తానని సత్యభామ నోట పాడి రక్తికట్టించిన తీరు నాకెంతో ఇష్టం. అరుదైన గాయనీమణులు సహ గాయకులను సమానంగా ఆదరించిన అమరగాయకుడు ఘంటసాల నేతృత్వంలో ఆయననే కాక శ్రోతలను మెప్పించిన గాయనిగా నిలిచారు ఎపి కోమల. కేవలం ఒక్క పాటతోనే ఇంత గుర్తింపు లభిస్తుందా?! అనేంత ఆశ్చర్యం కలిగించే గీతం సరియా మాతో సమరాన నిలువగలడా పాట. ఈ పాటను దర్శకుడు, సంగీత దర్శకుడు కలసి అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు. పాట ఒక ఎత్తయితే ఆ పాటను దర్శకుడి బాణీకి ఒదిగిపోయి ఆలపించడం మరో ఎత్తు. ఈ రెండు సరిగమల సాము ఈ పాటలో వినవచ్చు. అదే ఈ గీతం ప్రత్యేకత.
-యంవి రమణకుమారి, హైదరాబాద్