Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాయమునుఁ గష్టపెట్టిన ఁ గలదుసుఖము
దాని నెంతయో సుఖపెట్టఁ దప్పదనతి
కాలమందునఁ గష్టాలు గాంచనేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనం మన శరీరాన్ని కష్టపెడితే మనం సుఖంగా జీవించగల్గుతాము. మనం మనశరీరాన్ని సుఖపెడితే అతి తక్కువకాలంలోనే శారీరకంగా ఎన్నో కష్టాలనుభవించవలసి వస్తుందని తెలసుకోరెందుకోకదా. శారీరిక శ్రమ ఆవశ్యకతను కర్మసాక్షివైన ఓసూర్యనారాయణ మూర్తీ నీవైనా తెలియుజేయుమయ్యా స్వామీ.
తే.గీ. మనసు నడిగిన వాస్తవ మదియుఁ జెప్పు
నదియె సాక్ష్యము వేరేల? యదియు నెపుడు
మనల మెచ్చెడి చందాన మనగ వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: మన మనస్సే మనకు వాస్తవాన్ని గూర్చి తెలియజేస్తుంది. మనస్సాక్షిని మించిన వేరే సాక్ష్యం దేనికి? మన మనసు మనల్ని మెచ్చే విధంగా మనం జీవించాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262