Others

కాళ్ళనొప్పులను తగ్గించే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై సంవత్సరాలు దాటిన స్ర్తిలలో కచ్చితంగా కాళ్ళనొప్పులు వస్తుంటాయి. కాళ్ళలో కలిగే నొప్పుల వల్ల మనం చాలా అసౌకర్యాలకు గురవుతుంటాం. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. కాళ్ళనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. నలభై సంవత్సరాలు పైబడగానే కాల్షియం లోపం కారణంగా కాళ్ళనొప్పులు వచ్చేస్తాయి. కాలివేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలోనైనా ఈ నొప్పి రావచ్చు. వృద్ధాప్యం, అసౌకర్యంగా ఉండే షూ, ఎక్కువ సమయం పాటు నడవడం లేదా నిలబడటం, మినరల్ లోపం, మధుమేహం.. వంటి ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులకు ఇంటి చిట్కాల ద్వారా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అవేంటో చూద్దాం..
* బెణుకులు, గాయాల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే అసౌకర్యాల నుండి వెనిగర్ ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్‌లో వేడినీటిని తీసుకని రెండు చెంచాల వెనిగర్‌ను అందులో కలపాలి. దీనితోపాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్‌ను కూడా కలపాలి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిముషాల పాటు కాళ్ళను నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళనొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
* నొప్పులను నయం చేసే గుణాలను కలిగి ఉండే ఎప్సం సాల్ట్ కాళ్ళ నొప్పలకు త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ వేడినీటిలో రెండు, మూడు చెంచాల ఎప్సం సాల్ట్‌ను కలపాలి. తరువాత దీనిలో పది నుండి పదిహేను నిముషాల పాటు కాళ్ళను ఉంచాలి. వెంటనే కాళ్ళ నొప్పులు తగ్గి రిలీఫ్ కలుగుతుంది. కాళ్ళను బయటకు తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను.. అంటే మాయిశ్చరైజర్‌ను కాళ్ళను పూయాలి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్ళను పొడిగా మారుస్తుంది.
* కాళ్ళలో కలిగే నొప్పి, వాపులను తగ్గించే శక్తివంతమైన పద్ధతిగా ఐస్ థెరపీని పేర్కొనవచ్చు. చిన్న చిన్న ఐస్ ముక్కలను ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి.. దానితో నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో వలయాకార రూపంలో మసాజ్ చేయాలి. నొప్పులు తగ్గుతాయి. ఇలా ఐస్ బ్యాగ్‌తో పది నిముషాల కంటే ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే అధిక సమయం చల్లదనాన్ని శరీరంపై ఉంచడం వల్ల చర్మం, నరాలు ప్రమాదానికి గురవుతాయి.
* తలనొప్పి, కీళ్ళనొప్పులు, అథ్లెట్‌లలో కలిగే కాళ్ళనొప్పులు, గోళ్ళలో కలిగే ఇనె్ఫక్షన్, కాళ్ళలో కలిగే నొప్పుల నుండి లవంగాల నూనె తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరిగి కండరాలు విశ్రాంతికి గురవుతాయి. మంచి ఫలితాల కోసం రోజులో రెండు, మూడు సార్లు లవంగాల నూనెను రుద్దుతూ ఉండాలి. *