Others

ఇది ఉంటే చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి మనసు కల్పించే భావోద్వేగాల్లో సంతోషం ఒకటి. ఈ సంతోషం ఎపుడు కల్గుతుంది అంటే మనసు తృప్తి చెందినపుడు మాత్రమే. తృప్తిగా ఉన్నప్పుడే సదా సంతోషంగా ఉండగలుగుతాడు మనిషి.
ఓసారి శ్రీకృష్ణదేవరాయల వారికి ఈలోకంలోఅందరికన్నా సుఖజీవి ఎవరు? అని సందేహం కలిగింది. ఆయన తన సభకు పండితులను, కవులను, పౌరులను అందరినీ పిలిపించి తన సందేహాన్ని వెలిబుచ్చి సమాధానం చెప్పమన్నాడట. అందరూ ఆలోచించారు. కొందరు మహారాజుకు విద్యాపాండిత్యములు ఉన్నవారు సంతోషంగా ఉంటారన్నారు. మరికొంతమంది సంపూర్ణరోగ్యవంతులు సుఖజీవులన్నారు.
కానీ ఈ సమాధానాలేవీ రాయలవారిని తృప్తిపరచలేదు. అపుడు తెనాలి రామకృష్ణుడు
‘‘ప్రభూ! ఈలోకంలో తృప్తికలిగినవాడేసుఖ ‘అతృప్తి రేవ దారిద్య్రమ్, తృప్తి రేవమహద్ధనమ్’ అన్న పెద్దల మాట ప్రత్యక్షరసత్యం అ ని చెప్పగానే సభాసదులకే కానీ సార్వభౌముడైన రాయలవారికి కూడా సంతృప్తి కలిగిందట.
సంతోషపుష్టమనసం, భృత్యా ఇవ మహర్థయః
రాజానముపతిష్ఠంతి, కింకత్వముపాగతాః అని యోగవాసిష్ఠం అంటోంది.
ఎవరి మనస్సు సంతృప్తి తో నిండుతుందో వారు సుఖసంతోషాలతో ఉంటారు. అటువంటి సుఖసంతోషాలు కలిగిన మనిషిని రాజును సేవకులు సేవించినట్లుగా సకలైశ్వర్యాలు సేవిస్తాయి.
నిజమే కదా! తనకు లభించిన దానితో తృప్తి పడే స్థితప్రజ్ఞత అలవడిన వానితో రాజులు, రారజులు కూడా సాటిరారు. ఎందుకంటే తమకు ఎంత సామ్రాజ్యం లభించినా, ఎన్ని ఐశ్వర్యాలు సమకూరినా, ఇంకా రాజ్యవిస్తరణాకాంక్ష, సంపదలపై వ్యామోహం తీరనట్లయితే రాజైనా నిత్య అసంతృప్తితో దుఃఖానే్న పొందుతాడు.
వ్యాప్తిన్ పొందక, వగవక
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్
తృప్తిన్ పొందని మనుజుడు
సప్త ద్వీపములనైన చక్కన్ బడునే? అంటాడు వామనావతారుడు బలి చక్రవర్తితో అన్నాడని మహాభారతం చెప్తుంది.
తనకు లభించింది కొంచమే అయినా, అదియే తనకు చాలా ఎక్కువ అని భావించి తృప్తి పొందనివాడికి ఎక్కడా శాంతి, సంతోషం అనేవి లభించవు. అసంతృప్తికి మూలం ఆశ. తృప్తికి మూలం స్థితప్రజ్ఞత అంటుంది మహాభారతం.
వయమిహ పరితుష్టా వల్కలైః త్వందుకూలైః
సమ ఇహ పరితోషా నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసిచ పరితుష్టే కొర్థవాన్ కో దరిద్రః
అంటాడు భర్తృహరి.
అంటే తృప్తిగలవారికి నారబట్టమైనా, పట్టువస్త్రాలైనా ఒకే సమభావం ఉంటుంది. ఎవరి ఆశ విస్తారంగా ఉంటుందో వారే నిజానికి దరిద్రుడు.సంతృప్తి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు అని వేనోళ్ల పురాణాలు, శాస్త్రాలే కాక సామాన్యులు కూడా అనడం వెనుక ఎంత అర్థముందో అనుభవించి తెలుసుకోవాలి. తృప్తిగలవారు తలకింద ఇటుక పెట్టుకుని హాయినా నిద్రిస్తాడు. అసలు నిద్రలోనే ఎవరు తృప్తులు ఎవరు అసంతృప్తులో తెలిసిపోతుంది అంటారు. అసంతృప్తులకెప్పుడూ నిద్ర పట్టదు. హాయిగా నిద్ర పట్టక అనారోగ్యమూ, ఆశతో తృప్తిలేక పగలు అవిశ్రాంతితో గడుపుతూ జీవితాన్ని అష్టకష్టాల పాలు చేస్తుంటారు.
అసంతృప్తులకెప్పుడూ జీవితం నరకప్రాయంగా ఉంటుందని శతకకారుడు అంటున్నాడు.
‘... తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు’’ అననే అన్నారు కదా. ఈలోకంలో ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, పరభాగ్యోపజీవి, నిత్య శంకితుడు అనే ఆరుగురు దుఃఖభాగులని చిన్నయసూరి అన్నారు.
అందుకని
సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు
సంతోషికెన్నడు జరుగుసుఖము
సంతోషిగా కుంట సంసార హేతువు
సంతసంబున ముక్తిసతియుదొరకు
పరితోషహీనత ప్రభ చెడిపోవును
జలధారననలంబు సమయునట్లు
పూట పూటకు జగంబున యదృచ్ఛాలాభ
తుష్టిని తేజంబుతోనపెరుగు’’
త్రిలోకాలాలోనూ సంతృప్తి కలవాడే గౌరవించబడుతాడు. అతనికెప్పుడూ సుఖమే లభిస్తుంది. అసంతృప్తి భవబంధాలలో చిక్కుకునేలా చేస్తే తృప్తి, ముక్తినిస్తుంది. అసంతృప్తి వలన తేజోహీనత, సంతృప్తి వలన తేజోవృద్ధి కలుగుతుంది అంటూ మహాభారతంలో వామనుని చెప్పిన మాటలను సదా స్మరించుకోవాల్సి ఉంది.

- డా. గొల్లాపిన్ని సీతారామశాస్ర్తీ 9440781236