Others

ఇవి అవసరమే సుమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఏ పని చేసినా తాము చేయదలుచుకున్న ప్రతీ పనిని ఎలాంటి అడ్డు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటాడు. ఇది చాలా సహజం. పనిని మొదలుపెట్టకుండానే ఎలాంటి విఘ్నాలు వస్తాయో అని ఆలోచించి మొదలు పెట్టబోయే పనిని అసలు శ్రీకారం చుట్టకుండా విఘ్నాలకు వెరిచి ఆపివేసే వారిని అధములని అంటారు. అట్లా కాకుండా ఎలాంటి చిక్కులు వస్తాయో అని ముందే ఊహించి ఆ చిక్కులను ఏవిధంగా దూరం చేసుకోవాలో కూడా ఆలోచించి వాటిని దూరం చేసుకొంటూ పనిని మొదలుపెట్టేవాడు ప్రయత్నశీలురని, మధ్యములనీ అంటారు. ఎందుకంటే అనుకొన్న పనిని ఆరంభించారు కానీ పూర్తవ్వలేదు కదా. ఒకవేళ పనిని పూర్తి చేస్తే వారే ఉత్తములు అవుతారు.
అలా ఉత్తములు అన్న ఖ్యాతి రావాలంటే ఊహించి దూరం చేసుకొన్న విఘ్నాలు కాకుండా అనుకోని విపత్తులు కలుగాతాయేమో అనుకొన్నవారు మొదట వాటిని కూడా అధిగమించే శక్తినివ్వమని భగవంతుడిని కోరుకుంటారు. అట్లా కోరుకునే దేవుని పేరే విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వరుడు అనేక విఘ్నాలు దూరం చేసి అనుకొన్న పనిని పూర్తి చేయించగల సమర్థుడు. అందుకే ఏ కార్యంగానీ ఏ ఇతర దైవకార్యాలు చేయతలపెట్టినా కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరునే్న పూజిస్తారు. తాము చేయాలనుకొన్న పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసేటట్లు చేయమని విఘ్నేశ్వరుని కోరుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
అయినా కూడ విఘ్నాలు కలిగితే అపుడు వాటికి భయపడకుండా ఆ విఘ్నమూ మంచి చేయడానికే కలిగిందన్న ఆలోచనను తెచ్చుకుంటే ముందుకు వెళ్తే అనుకొన్న పనిని పూర్తి చేయవచ్చు.
ఉదాహరణకు చూడండి.
రామునికి దశరథుడు పట్టం కడుదామనుకొన్నాడు. కానీ విఘ్నాలు రావడం వల్ల రాముడు వనవాసానికి వెళ్లాడు. అయ్యో ఎలాంటి విఘ్నం వచ్చింది వనవాసానికి వెళ్లటమా అని దుఃఖభారంతో రాముడు మునిగిపోయి ఉంటే ఎంత అనర్థం జరిగి ఉండేది.
వనవాసం వెళ్లడం వల్ల అక్కడి ఋషులకు, మునులకు, సంయమివరులకు రాముని అభయం లభించింది. పైగా14వేల మంది రాక్షసులు ఆ సాధుపుంగవులను, అమాయకులై వనాల వెంట తిరిగే మానవులను ఇబ్బంది పెట్టేవారుకదా. వారిని రాముడే సంహరించివేశాడు. పైగా కబంధునికి శాపవిమోచనం కలిగింది. వానరులల్లో ఉన్న వాలి వలన భయపడి చెట్టూ పుట్ట తిరిగే సుగ్రీవుడు రామునితో చెలిమి చేసి భయాన్ని పోగొట్టుకోవడమే కాక అధర్మపరుడైన వాలిని దూరం చేసి రాజ్యాన్ని కూడా సంపాదించుకున్నాడు. సుగ్రీవుని రక్షణలో వానరులంతా హాయిగా సుఖంగా జీవించారు. పైగా రామునికి కూడా వానరులు సాయం అందించారు. రావణుడు ఎత్తుకుపోయిన సీతమ్మను వెతికి పెట్టారు.
రావణాసురుని వానితో పాటు ఉండే అనేకమంది రాక్షసులను రాముడు వానరులతో కలసి మట్టుపెట్టాడు. రాక్షసరాజ్యమైనా అక్కడా ధర్మం రాజ్యంగా పరివర్తన కలిగేటట్టు చేశాడు. మంధర లాంటివాళ్లకు అన్నదమ్ములు రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు అందరూ సమానమైన మైత్రి కలిగి ఉండేవారని, వారి మధ్య స్నేహబంధం తో పాటు భాతృప్రేమ కూడా ఉందనే విషయాన్ని తేటతెల్లం చేశాడు. ఇలా ఎన్నో విషయాలు రాముని వనవాసం వల్ల వెల్లడి అయ్యాయి. కనుక అయ్యో పట్ట్భాషేకానికి బదులు వనవాసం వచ్చిందే అని కుమిలిపోయి ఉంటే ఇవన్నీ తెలిసేవా? జరిగేవా? కనుక ఏది జరిగినా అది మన మంచికే అనుకొని ముందుకు వెళ్లడానికి విఘ్నేశ్వరుని పూజించి తగిన శక్తిని సంపాదించుకుని అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయాలి.

- శ్రీనివాస్ పర్వతాల