Others

బరువు తగ్గించే ఆహారాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు పెరగడం కంటే బరువు తగ్గడం చాలా కష్టమనేది చాలామంది అభిప్రాయం. కానీ బరువు తగ్గడం కూడా సులభమంటారు కొందరు. అందుకు కొన్ని విధానాలు నిరూపించబడ్డాయి కూడా. త్వరగా బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన మంచి ఆహారాలను తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం మన చుట్టూ ఉన్న, ప్రతిరోజూ చూస్తున్న ఆహారాలే బరువును చాలా సులభంగా తగ్గిస్తాయట. ఇవి ఎప్పటికీ మిమ్మల్ని బరువు పెరగనియ్యవట. ప్రోటీన్లు, లీన్ కార్బోహైడ్రేట్స్, న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను డైలీ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది. మరి అలాంటి ఆహారాలేంటో చూద్దాం..
* రాస్బెర్రీస్‌లో అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. 100 గ్రాముల రాస్బెర్రీస్‌లో 72 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ 100 గ్రాముల రాస్బెర్రీస్‌ను డైట్ చార్ట్‌లో చేర్చుకోవడం వల్ల అదనపు బరువును తగ్గించుకోవచ్చు.
* క్యాబేజీ కూడా చాలా వేగంగా బరువును తగ్గిస్తుంది. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వ్యాధినిరోధకతను అందించే బూస్టర్ ఫుడ్.
* గ్రీన్ వెజిటబుల్స్‌లో బెస్ట్ వెజిటబుల్ బ్రొకోలీ. ఉడికించిన బ్రొకోలీని ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటబుల్‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.
* చెర్రీస్‌లో అధికంగా విటమిన్స్, లోప్రొటీన్స్ ఉంటాయి. చెర్రీస్‌ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం లెవెల్స్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు చాలా త్వరగా బరువు తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
* ప్రాన్స్ చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలనుకునేవారు రొయ్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.
* త్వరగా బరువు తగ్గాలనుకునేవారు స్వీట్ కంటే హాట్ సాస్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
* కీరదోసకాయ అన్ని రకాల సలాడ్లలో కనపడుతూ ఉంటుంది. బరువు తగ్గే ప్లాన్‌లో ఉన్నప్పుడు కీరదోసను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమ పరిష్కార మార్గం. ఇందులో అధిక మొత్తంలో నీరు ఉండి త్వరగా కడుపు నిండటానికి సహాయపడుతుంది. డైలీ డైట్‌లో దీన్ని చేర్చుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.
* గుడ్డులోని తెల్లని పదార్థం ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారు ఎగ్ వైట్‌ను డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది. గుడ్డును ఉడికించి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం మంచిది.
* సిట్రస్ ఫ్రూట్ అయిన గ్రేప్ ఫ్రూట్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. ఇది శరీరంలోని వేడి బయటకు తరిమేసి కూల్‌గా ఉంచుతుంది. ఆకలిగా అనిపించినప్పుడు ద్రాక్షలను తీసుకోవడం త్వరగా కడుపునిండినట్లు అనిపిస్తుంది. పైగా వీటిలో కొవ్వును కరిగించే ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి.
* చెర్రీ టొమాటోలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి బరువును త్వరగా తగ్గిస్తాయి. *