Others

సంపద్విశేషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుననకు, మణికి భాగవతులు ఒక పోలిక చెప్తూ ఉంటారు. మణి అంటే సంపద అని అర్థంచేస్తుకుందాం కొంతసేపు. అదేమన మణి ఉన్నవారు, మణిలేనివారు రెండు రకములు వారు ఉన్నారనుకోండి. అట్లానే భగవంతుడు ఉన్నాడనువారు కొందరుంటారు. మరికొందరు భగవంతుడు లేడు అని చెప్తుంటారు. వీరిద్దరూ కూడా లోకములో ఉంటారనుకోండి.
మణి అంటే సంపద ఈ సంపద ఉన్నవారికి అందరూ నమస్కరిస్తూ ఉంటారు. అందరూ గౌరవిస్తూ ఉంటారు. అట్లానే భగవంతుని భక్తులను కూడా గౌరవిస్తూ ఉంటారు. సంపద ఉన్నవారు భగవంతుడిని నమ్ముకున్నవారు కానట్లయితే వారి దగ్గర మణిని అమ్ముకుంటూ లాభవచ్చిందని సంతోషపడుతుంటారు.
అదే భగవంతుడిని నమ్ముకున్నవాళ్లయితే వాళ్ల దగ్గర ఉన్న మణి అంటే సంపద భగవంతుడున్నాడన్న నమ్మకమే వారి సంపదయై ఉంటుంది కనుక వారు ఈ సంపదను నలుగురికీ చూపిస్తూ , ఈ సంపద యొక్క విశేషాలను నలుగురికీ చెబుతూ సంతోషపడిపోతుంటారు.
వీరిద్దరిలో భగవంతుడిని మనసా వాచా నమ్ముతూ, చేసే పనులన్నీ ఈశ్వరార్పణం చేసైనా, లేక మంచిమనసుతో నలుగురికీ ఉపయోగపడాలన్న తత్త్వంతో ఈర్ష్యాసూయలకు దూరంగా పనులుచేస్తూ ఉంటే వారిని భగవంతుడు మెచ్చుతాడు.
ఇలా ఎందుకు చెబుతున్నానంటే భగవంతుడిని ఉన్నాడని నమ్మేవాళ్లల్లో కొంతమంది ఆర్భాటాలకు, ఆడంబరాలకు వెళ్లి అసలైన భగవంతుడిని గూర్చి కాక వారిని నలుగురూ మెచ్చుకుంటున్నారా లేదా అనే విషయాసక్తిలోపడి భగవంతుని తత్త్వానికి దూరమైపోతుంటారు. ఇట్లాంటి భక్తి డాంబీకులను భగవంతుడే ఓరోజు దారికితెస్తాడు ఇది వేరు విషయం అనుకోండి.
భగవంతుడు లేడు అంటూనే అన్నీ మంచిపనులు చేస్తూ సత్వగుణులై తోటిప్రాణికి సేవచేయడమే మనిషి లక్షణం గా ప్రవర్తించేవాళ్లూ ఉంటారు. అటువంటివారిని భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు.
కనుక మనిషి ఉండవలసింది భక్తితోపాటు మనిషితనం ఉండాలి. ఈరెండూ లేకపోతే ఆ మనిషిని మనుష్యుల సమూహంలో చేర్చరు. అందుకే నిజమైన సత్సాంగత్యం చేయాలి. సత్పురుషుల చెంత ఉండాలి. అన్నీ మంచిపనులు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. అపుడే వారని సజ్జనులుగా కీర్తించుతారు.

-శోభశ్రీ