Others

ప్రయత్నాన్ని నెరవేర్చిన భగీరథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల చరాచర జీవులకు నీరే ఆధారం. నీరు కనుక లేకున్నట్లయితే సృష్టిలో ఏ జీవి కూడా మనుగడ సాగించలేవు. సృష్టిలో ఒక వంతు భూమి, మూడొంతుల నీరు ఉంది. అయినప్పటికీ మూడుంతుల నీరు మనుష్యులు త్రాగడానికి అనువుగా ఉండదు. రాను రాను మనుషులు పెరిగిపోయి భూభాగం సరిపోయే పరిస్థితి కానరావడంలేదు. నీటి యొక్క అవసరం ఎక్కువైపోయింది. అయితే ఈ నీరు గంగానది భూమికి ఎలా వచ్చిందో చూద్దాం..!
త్రేతాయుగంలో భరతఖండాన్ని పరిపాలించిన షట్చక్రవర్తులైన హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు వీంతా గొప్ప రాజులు. వారి ధర్మపాలనలో పంచభూతాలు సైతం ప్రకృతి విపత్తులు కలిగించలేదు. వీరిలో ఒకరైన సగరుడు రాజ్యశ్రేయస్సుకోరి అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఆ యాగం పరిపూర్ణం కావడం కోసం ఒక ఉత్తమమైన గుర్రాన్ని దానికి బంగారు రేకు కట్టి విడిచిపెట్టి దాని వెంట భటులను పంపిస్తాడు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ గుర్రం అదృశ్యమవుతుంది. ఆ గుర్రం కనిపించకపోవడంతో భటులు వెనుదిరిగి వెళ్లి రాజుకు విషయాన్ని చెబుతారు. అపుడు సగరుడు 60వేలమంది సుపుత్రులను పిలిచి ఎలాగైనా ఆ అశ్వాన్ని వెతికి తీసుకొని రమ్మనగా వారు భూలోకంతోపాటు స్వర్గాది లోకాలను వెదుక్కుంటూ చివరకు పాతాళలోకానికి వెళ్ళగా అక్కడ ఆ గుర్రం కపిల ముని ఋషి ఆశ్రమంలో ఉండడాన్ని చూసి కపిల మునిని నువ్వే గుర్రాన్ని తీసుకొచ్చావని తపస్సులో వున్నటువంటి కపిల మునిని అనడంతో, కోపంతో ఆ ముని వీరిని భస్మం చేస్తాడు.
ఎంతకాలానికి వీరంతా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సగరుడు తన మనవడు (పౌత్రుడు) అయినటువంటి అంశుమంతుణ్ణి పిలిచి మీ చిన్నానయనలందరూ కూడా యజ్ఞపశువును తీసుకొస్తామని వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. కాబట్టి ఈ వంశానికి వారసుడైన నీవు వారి జాడ తెలుసుకొని యజ్ఞపశువును వెంట తీసుకురమ్మని చెప్పగా- అంశుమంతుడు లోకాలన్నింటిని వెతుక్కుంటూ వెళ్లి చివరికి కపిల ముని ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఆ గుర్రాన్ని కనుగొని కపిల మునిని ప్రార్థించగా, దీనిని తీసుకెళ్లు కానీ నీ చిన్నాన్నలు మూర్ఖులుగా ప్రవర్తించి దుష్ఫలితాన్ని అనుభవించారు అంటాడు. తన చిన్నాన్నల ఆత్మలు ఎలా తృప్తి చెందుతాయని కపిలమునిని వేడుకొనగా- వారి చితాభస్మంనుండి పవిత్రమైన గంగ ప్రవహింపజేసినట్లయితే వారి ఆత్మలు సంతృప్తి చెంది, సద్గతులు కల్గుతాయని చెబుతాడు.
యాగాశ్వాన్ని వెంటబెట్టుకొని వెళ్లిన అంశుమంతుడు సగరునికి జరిగినదంతా చెప్పాడు. ఎలాగోలా యాగం దిగ్విజయం చేసిన సగరుడు అంశుమంతుడికి రాజ్యాన్ని కట్టబెట్టి గంగను భూమి మీదకు తెచ్చేందుకు తపస్సు చేశాడు. కానీ ఆయనవల్ల కాకపోవడంతో అక్కడే కాలం చేశాడు. ఆ తరువాత గంగను తీసుకువచ్చే ప్రయత్నంలో సగరుని వారసులైన అంశుమంతుడు, అంశుమంతుని పుత్రుడు దిలీపుడు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆ తరువాత దీలీపుని కుమారుడు గంగకోసం బ్రహ్మ దర్శనానికై కఠోర తపస్సు చేశాడు. అంతట బ్రహ్మ దర్శనమివ్వగా- నా తాత, ముత్తాతలకు జల తర్పణం చేయాలంటే గంగను భువిమీదకు తీసుకురావాలి, నాకు ఆ వరాన్ని ప్రసాదించమనగా బ్రహ్మదేవుడు ఈ వరం చాలా కష్టమేనని, కానీ నీవు శివుణ్ణి ప్రార్థించమంటాడు.
ఆ తరువాత భగీరథుడు కేవలం ఒక కాలి బొటనవ్రేలును మాత్రమే నేలపై ఉంచి ఏడాదిపాటు ఘోర తపస్సు చేయగా, శివుడు భగీరథుని తపస్సుకు మెచ్చి గంగను తన శిరస్సున నిలుపుకోవాలనుకున్నాడు. అయితే గంగ శివునే్న తన ప్రవాహంతో ముంచెత్తి పాతాళానికి తీసుకెళ్ళాలనుకుంటుంది. అది గమినంచి శివుడు గంగను తన జటాజూటమందు బంధిస్తాడు. అంతట భగీరథుడు గంగాదేవి కన్పించక మరలా తపస్సు చేయగా శివుడు గంగాదేవిని బ్రహ్మ నిర్మితమైన బిందు సరస్సునందు వదిలివేస్తాడు. అక్కడినుండి గంగ ఏడు పాయలుగా ప్రవహిస్తుంది. హ్లాదిని, పావని, నళిని అనే మూడు గంగలు తూర్పు దిక్కుకు, సుచుక్షువు,సీత, మహానది, సింధువు అనే మరో మూడు గంగలు పడమర దిక్కుకు ప్రవహించగా, ఏడవదైనటుంటి గంగ భగీరథుడు రథంపై ముందువెళ్తుండగా గంగ అతని వెంట పయనించింది. గంగ శివుని శిరస్సునుండి భూమిమీద పడుతున్నపుడు భీకర శబ్దాలు ఏర్పడినాయి. దేవతలందరూ గంగావతరణాన్ని వీక్షించారు. ఆకాశంలో దేవతలు, ఋషులు అంతటి పావన జలంలో స్నానాలాచరించారు. ప్రజలు కూడా ఆ జలంలో స్నానం చేసి తమ పాపాలను కడిగేసుకున్నారు.
గంగ వేగంగా ప్రవహిస్తూ జుహ్ను మహాముని యాగం చేస్తుండగా ఆ ప్రవాహంతో యాగశాల మునిగిపోతుంది. దానితో ఆ ముని కోపించి ఆ గంగాజలాన్ని త్రాగేస్తాడు. అంతట దేవతలు, ఋషులు జుహ్ను మునిని ప్రార్థించగా గంగను ఆయన కుమార్తెగా నియమించగా, సంతోషించి తన చెవులనుండి గంగను బయటికి వదులుతాడు. అందుకే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చిందని చరిత్ర తెలియజేస్తుంది.
గంగానది ముల్లోకాలను పావనం చేయటంవల్ల త్రిపథగామిని అని, భగీరథుని ప్రయత్నంవల్ల భాగీరథి అని, విష్ణుపాదోద్భవి కాబట్టి మందాకినిగా పిలవబడుతుంది. అంతట భగీరథుడు గంగా సమేతుడై ఆ బూడిద రాశులుగా వున్న తన తాత ముత్తాతలను ముంచెత్తగా వారి యొక్క సర్వపాపాలు హరించబడి నిష్పాపులయ్యారు.

-శ్రీనివాస్ పర్వతాల