Others

మీ ఆదాయంలో ‘ఆదా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలో చాలామంది చాలా విషయాల్లో ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. కానీ డబ్బు విషయానికొచ్చేసరికి మాత్రం ప్లానింగ్ ఉండదు. దాంతో ఎంత సంపాదించినా డబ్బు ఆదా చేయలేకపోతున్నామని బాధపడతారు. అలాకాకుండా డబ్బు విషయంలో స్మార్ట్‌గా వ్యవహరించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. సంపాదనలో ఎంత మొత్తాన్ని ఆదా చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. మీరు ఏర్పరచుకున్న ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి ఈ ప్రణాళిక అవసరం. ఇందువల్ల ఖర్చు చేసే పద్ధతిలో మార్పు వస్తుంది. డబ్బు మిగల్చడం సులభమవుతుంది. మనీ మేనేజ్‌మెంటులో గుర్తుంచుకోవాల్సిన మరో అంశం క్రెడిట్ కార్డుల గురించి.. లెక్కకు మించిన ఖర్చు చేయడం వల్ల అప్పు తడిసి మోపెడవుతుంది. అందుకే ప్లాస్టిక్ మనీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డుతో ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలంటే చెకింగ్ లేదా మనీ మార్కెట్ అకౌంట్‌లో అందుకు సరిపడా డబ్బునే ఉంచుకోవాలి. అప్పుడు వ్యయాన్ని మీకు మీరే నిరోధించుకోగలుగుతారు.
టాక్స్ రిటర్న్స్ కట్టాల్సి వచ్చేంతవరకు మనలో చాలామంది టాక్స్ పేమెంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. చివరి నిముషంలో హడావుడి పడుతుంటారు. చివరి తేదీ వరకు ఆగకుండా ఈలోపే ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లను కలిసి పన్ను భారం పడకుండా ఉన్న స్కీములను తెలుసుకోవాలి. దొరికే కాస్త సమయాన్ని పన్నుల గురించి ఆలోచించమంటారా? అని అనొద్దు. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం వల్ల టాక్స్ ఫైల్ చేసే సమయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంటే.. ఇన్స్యూరెన్స్, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్టేట్‌మెంటులను, బ్యాంకు స్టేట్‌మెంటులను, టాక్స్ రిటర్న్‌ల పేపర్లన్నింటినీ ఒకచోట జాగ్రత్త పరచుకుని లావాదేవీలను నడపాలి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల పత్రాలను ఎక్కడపడితే అక్కడ ఓపెన్ చేయకూడదు. అన్నింటినీ ఒకేచోట భద్రపరచుకుని అవసరమైన సమయంలో పరిశీలించి కడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందువల్ల పన్నుల భారం నుంచి బయట పడవచ్చు.
చివరగా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఒక వస్తువును కొనేటప్పుడు అవి మీకెంతవరకు ఉపయోగమో ఆలోచించుకోవాలి. ఊరికే కొని ఇంట్లో పడేసే కన్నా ఆ డబ్బును ఇంకో ఖర్చుకు దాచి ఉంచడం మంచిది. అట్టహాసాలకు వెళ్లి చేతులు కాల్చుకోవద్దు. డబ్బులు పొదుపు చేస్తున్నప్పుడు అందుకు సంబంధించిన అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను సంప్రదించి ‘ ఆదా’ పద్ధతులను అవలంబించాలి. నమ్మకమైన చోట డబ్బును దాచుకోవాలి. చీటీల పేరుతో మోసపోవద్దు. దినసరి ఖర్చులు తగ్గించుకోవాలి. డబ్బులు అధికంగా ఖర్చు చేయక జాగ్రత్తగా వ్యవహరించడానికి రోజువారీ లెక్కలను ఒక పుస్తకంలో రాసుకోవాలి. నెలాఖరులో లెక్కలు చూసి వచ్చే నెలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- కంసుడు