Others

విశ్వ కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మహావిశ్వంకన్నా ఈ భూగ్రహం ఎంత చిన్నది? ఒక మహా పర్వతం కన్నా ఒక ఇసుక రేణువు ఎంత చిన్నదో అంతకన్నా కూడా చిన్నదే! ఇంత చిన్న గ్రహంమీద మనుగడ సాగిస్తున్న మనిషే అనంతంగా అవిశ్రాంతంగా సాగిపోయే జగన్నాటకంలో ప్రధాన పాత్రధారని ఎవరు చెప్పినా ఎంత గట్టిగా చెప్పినా నమ్మబుద్ధికాదు కాని నమ్మక తప్పదు. అది సృష్టికి మూలమైన సత్యం!
మానవజాతి మనుగడ కొనసాగటానికి గాలి నీరు ఎంత అవసరమో సృష్టి కార్యానికి అర్థం పరమార్థం చేకూరటానికి మానవ జాతి మనుగడ కొనసాగటమంతే అవసరం!
నిన్నా మొన్నటివరకూ ఓ మహాగ్ని గుండంలా రగిలిపోతూ సెగలు గ్రక్కుతూండిన ఈ భూమండలం మీద ఈనాడు వెల్లివిరుస్తున్న అందం ఆనందం సృష్టి కార్యానికి అర్థం పరమార్థం వున్నాయని చెప్పకనే చెబుతున్నాయి గనుక ఆ రెండు మానవజాతి మనుగడతోనే ముడి వున్నాయి. సృష్టి కార్యం కొనసాగినంతకాలం మానవజాతి మనుగడ కొనసాగుతుందని విశ్వసించవచ్చు. సృష్టికార్యానికి ఆరంభమే కాని అంతం వుండదు. మరణం మనిషికే కాని మానవ జాతికుండదు!
కాలక్రమంలో ఈ భూగ్రహం విచ్ఛిన్నమై దుమ్ముగా ధూళిగా మారి విశ్వాంతరాళంలో కలిసిపోయినా మానవజాతి నశించిపోదు! మరో గ్రహంమీద మనుగడ కొనసాగిస్తుంది. సుదూర భవిష్యత్తులో మానవజాతి విశ్వమంతటా విసరిస్తుంది! మానవ ప్రస్తానం ఆనందప్రదంగా అనంత ప్రశాంతంగా అనంతంగా సాగిపోతుంది!
అనంత కరుణామయుడు అఖండ జ్ఞాన సంపన్నుడు అయిన దైవం సృజించిన ఈ ప్రపంచం ఎల్లకాలం దుఃఖమయంగా ఉండబోదని, రేపైనా ఆనందమయవౌతుందన్న విశ్వాసంతో తత్వ విచారణ సాగిస్తే విశ్వ పరిణామానికి అంతిమ లక్ష్యం విశ్వమానవ కల్యాణమేనన్న సత్యం స్పష్టంగా బోధపడుతుంది. వందల కోట్ల సంవత్సరాలుగా వర్థిలుతున్న ఈ మహాద్భుత సృష్టి వృక్షానికి కేవలం భౌతిక శక్తులే మూలాలై వుండి వుంటే ఈనాడు భూమీద గల ధూళి, నీరు, నిప్పు, రాళ్లు రప్పలు మాత్రమే వుండి ఉండేవి! కనీసం ఒక చెట్టు చేమ కాని వుండి వుండేవి కావు! ఈనాడు ఈ భూతలమంతా అనేకానేక జీవరాశులతో కళకళలాడుతోంది కనుక సృష్టి వృక్షానికి భౌతిక శక్తుల మూలాలతో బాటుగా చైతన్య శక్తుల మూలాలు కూడా వున్నాయని సుస్పష్టవౌతోంది! ఆ ద్వివిధ శక్తులకు మూలమైన మహత్తర శక్తికి మనిషి పెట్టిన పేరే ‘దైవం’. కనుక సృష్టి వృక్షానికి బీజం దైవమేనన్నది కంటికి కనిపించని నిజం!
సృష్టికి ప్రతిసృష్టిని అవలీలగా చేయగలుగుతున్న మానవజాతికన్నా ఉన్నతమైన ఉత్తమమైన జీవగతి సమస్త విశ్వంలోను ‘నభూతో నభవిష్యతి’ కనుక సృష్టి వృక్ష ఫలాలు మానవులేనన్నది కంటికి కనిపిస్తున్న నిజం! చెట్లు చేమల పుట్టుకకు కారణాలైన విత్తనాలు వాటికి కాసే పండ్లు ఫలాలలోని విత్తనాలు ఒకే లక్షణాలు కలిగి వుంటాయన్నది ఆబాలగోపాలం ఎరిగిన నిజం కనుక సృష్టి వృక్షానికి బీజమైన దేవుడి తత్వము ఆ వృయ ఫలాలైన మానవుల మనస్తత్వము నిస్సందేహంగా ఒక్కటే అయి వుంటుంది!
బుద్ధెరిగిన మరుక్షణం నుంచి మనిషి మనసు ఆనందానుభూతికోసం అనుక్షణం తపించిపోతూనే వుంటుంది కాబట్టి దైవం కూడా ఖచ్చితంగా ఆనంద సుధారస పిపాసై వుంటాడు.
సమస్త సుగుణాల సారమైన నిర్మలానంద సుధారసాన్ని నిరంతరం ఆస్వాదించాలన్న శుభ సంకల్పంతో నిరాకార దైవం అనిర్వచనీయానందనుభూతిని పొందగలిగేలా పొందికగా రూపుదిద్దుకుంటున్న మనిషి ఆకారంలో సాకారవౌతున్నది నగ్నసత్యం! దైవం తన ఆనందంకోసరమే సృజించుకొన్న ఈ ప్రపంచం రేపైనా మాపైనా ఆనందధామంగా రూపుదిద్దుకోవటం తథ్యం!
కాకపోతే ఈ ప్రపంచం ఆనందంగా కాక దుఃఖమయంగా వుండడం వెనుక ఓ బలమైన కారణం వుంది. దేవుడి నైజమైన ధర్మం ప్రతిరూపమైన ప్రకృతికి క్రమవికాసం నియమమైంది. ఆ నియమానుసారంగా కోట్లాది సంవత్సరాలుగా ప్రకృతి పరిణామం క్రమబద్ధంగా సాగుతోంది. జీవ పరిణామక్రమంలో పశుప్రాయుడైన ఆదిమానవుడిగా వున్న జాతి క్రమక్రమంగా దయాదాక్షిణ్యాలు, నీతి నియమాలు, శుచి, శుభ్రతలు, వావివరుసలు తదితర మానవ గుణాలను అలవరచుకుంది. పరిపూర్ణ మానవుడి దశకు ఎదిగి తదనంతరం దుఃఖమయమైన ప్రపంచాన్ని ఆనందమయ ప్రపంచంగా తీర్చిదిద్దుకుంది. మానవ జాతి మహర్దశకు చేరుకునే శుభసమయం ఆసన్నవౌతుంది. మానవ జీవిత మాధుర్యాన్ని కూలదోసే దారిద్య్రం, అనారోగ్యం, అజ్ఞాన మూలాలే. మానవ మేధస్సు వికసించిన తొలినాళ్ళలో ఈ దుష్టత్రయాన్ని శాశ్వతంగా నిర్మూలనం చేసే కార్యక్రమం ఆరంభమైంది. ఈనాటికీ శాస్ర్తియ జ్ఞాన చంద్రికల చల్లని శాంతిలో వేగాన్ని పుంజుకుంటోంది. సమాజ పురోగతికి సమాంతరంగా విలసిల్లే మానవ పరిణామగతి శీఘ్రతరం అవుతుంది. మానవ శరీరాకృతి తరతరానికి అందంగా మారుతోంది. ప్రవృత్తి కూడా సున్నితంగా తయారవుతోంది. సృజనశక్తి మృదుతరమైంది. మానవ జీవన మాధుర్యం తరతరానికి మధురతరవౌతోంది. భూమీద మనుగడ సాగించేవారందరూ పరిపూర్ణ మనుషులైతే సమాజంలో అన్యాయాలకు, అధర్మాలకు చోటు వుంటుందా? ప్రపంచ వ్యాప్తంగా విద్యావంతులందరూ సర్వస్వతంత్రంగా నిష్పక్షపాతంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తూ నిర్మలమైన భక్తిని శాస్ర్తియమైన విజ్ఞాన దృష్టిని పెంపొందించుకుంటే మూఢ భక్తికి విశ్వాసాలకు దూరంగా బ్రతకలగలడు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా మనుగడ సాగిస్తే విశ్వశాంతి మానవకల్యాణం లాంటి సుందర స్వప్నాలు త్వరలోనే సాకారవౌతాయి.

-డాక్టర్ ఎం.రామమూర్తి