Others

వేసవిలో వ్యాయామం ఆపేయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వేడిలో వ్యాయామం ఆపేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. వడదెబ్బ తగులుతుందని, వేడిలో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటూ ఉంటారు. కానీ వేసవిలో వ్యాయామం ఆపేయాల్సిన పనిలేదు కానీ ఈ సీజన్‌లో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే..
* శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది.
* శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది.
* అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే.. మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది.
* శరీరం మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చుని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీనే్న హీట్ సింకోప్ అండ్ ఎక్సర్‌సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్ అంటారు.
* చాలామంది అంటున్నట్లు వాతావరణంలో వేడి పెరుగుతున్న ఇలాంటి సమయంలో వ్యాయామం మానక్కరలేదు కానీ ఎదురయ్యే అనర్థాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలను పాటించాలి.
* ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్‌పోజ్ కాకూడదు. వ్యాయామాలు చేయాలనుకునేవాళ్లు వాతావరణం చల్లగా ఉండే వేకువజాములో చేయాలి.
* వ్యాయామం చేసేటప్పుడు చెమటను పీల్చుకునే కాటన్ దుస్తులను ధరించాలి.
* వ్యాయామానికి వెళ్లేటప్పుడు తగినంత నీళ్లు తాగాలి. ఒంట్లోని ఖనిజలవణాలు (ఎలక్ట్రోలైట్స్) ఎప్పటికప్పుడు భర్తీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* వ్యాయామం చేసే ముందు ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లగా ఉన్న సమయానికి వాయిదా వేసుకోవాలి.
* ఒకవేళ వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లు తిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి డాక్టరును సంప్రదించాలి.
* వ్యాయామానికి ముందు, తరువాత నీళ్లను తాగాలి.
* సీజనల్ పండ్లను అంటే పుచ్చకాయ, దోసకాయ, కీర, పలుచటి మజ్జిగ తరచూ తాగడం వల్ల ఎండ బారిన పడకుండా ఉండవచ్చు. *