Others

వృధాగా ఖర్చుపెట్టొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం మన జీవనశైలి ఇప్పటిలా కాకుండా మరోలా ఉండేది. ఇంటి యజమాని సంపాదించే కొద్దిపాటి జీతంతోనే ఇంటిల్లిపాది సుఖంగానూ, సౌకర్యంగానూ జీవిస్తుండేవాళ్ళు.
ఆ సంపాదనలోనే కొంతలో కొంతయినా పిల్లల చదువుల కోసమని- ఆడపిల్లల పెళ్లిళ్ళకోసమని, ముందుచూపుతో నాలుగు రాళ్ళను వెనకేసుకునేవాళ్ళు..
మరి ఇప్పుడో- ఇప్పటి కాలంలో ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తున్నా ఖర్చులకు చాలడంలేదు. వారి అవసరాలు, కోరికలు పెరిగిపోతున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీపడుతూ బ్రతుకుతున్నారు. ఆడంబరాలకు, ఆర్భాటాలకు కొదవలేదు. అడ్డూ అదుపూ లేకుండా లగ్జరీగా బ్రతకాలని చూస్తున్నారు. సంపాదిస్తున్నదంతా వెనకా ముందు చూడకుండా వచ్చింది వచ్చినట్లే ఖర్చుపెట్టేస్తుంటారు.
మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి అప్పులు చేసి మరీ ఖర్చుపెడుతుంటారు. ఇంట్లో తమ అవసరాల నిమిత్తం పెట్టుకున్న ఓ చిన్న కారుతో తృప్తిపడక- మళ్లీ లక్షలు పెట్టి పెద్ద కారును కొనాల్సిందే. ఫలాననావారి దగ్గర ఫలానా కారుందని, తాము కూడా వారికి తీసిపోకుండా ఉండాలనే ఉబలాటంతో కొన్ని లక్షలను వెచ్చిస్తుంటారు.
ఇక ఇళ్ళల్లో పుట్టిన రోజులనీ, పెళ్లిరోజులనీ, మరింకేదో పండగ- పబ్బమని- ఖరీదైన బట్టలను, కేకులను కొంటూ, విందు వినోదాలకోసమంటూ దుబారాగా ఖర్చుపెట్టేస్తూ తమ స్టేటస్‌ను ప్రదర్శిస్తుంటారు.
ఇక ఏ షాపింగ్ మాల్‌కో- ఏ సూపర్ మార్కెట్‌కో వెళ్లారంటే ఒళ్ళూ పై తెలియదు కొందరికి. కన్పించిన వాటినన్నింటిని కొనేస్తుంటారు. అవసరమున్నా లేకపోయినా, సబ్బులు, క్రీములు, పెర్‌ఫ్యూమ్‌లు, సాఫ్ట్ డ్రింకుల, జ్యూస్‌లు- రకరకాల బిస్కెట్లు (తిన్నంత తిని పారవేయడానికి)- ఇలా అక్కరకు రాని ఎన్నో వస్తువులను తెచ్చి ఇంట్లో అలంకారప్రాయంగా పెట్టేస్తుంటారు. లేదా చెత్తబుట్టపాలు చేస్తారు. చివరికి బిల్లు చూస్తే చాంతాడతవుతుంది.
ఖర్చుపెట్టడానికి కూడా ఒక అదుపు ఉండాలి. కోరికలకు కళ్ళెం వెయ్యాలి. పెద్దలు ఒక సామెత చెప్పారు. ‘అప్పులోళ్ళు ఛస్తేనేం పత్రాలు మునిగిపోతేనేం’ అంటూ.
అంటే మనకు అప్పు యిచ్చిన వాళ్ళు దిగులుతో చనిపోయినా ఫర్వాలేదు. వ్రాసుకున్న పత్రాలకు కాలం చెల్లిపోయినా లెక్కలేదు అని అర్థం. వారి సరదాలు మాత్రం మానరు.
ముందుచూపు లేక యిలా కన్నూ మిన్నూ కానరాకుండా దుబారా ఖర్చు చేసిన తరువాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొక తప్పదు. నలుగురిలో అవమానాలను పొందుతూ చతికిలబడక తప్పదు. ఆ దుస్థితి రాకుండా జాగ్రత్తపడాలి.
ప్రతి ఒక్కరికి ‘ఫైనాన్షియల్ డిసిప్లిన్’ అంటే ఆర్థికపరమైన విషయాలలో క్రమశిక్షణ ఉండాలి.
అది ఒక్కసారి అదుపు తప్పి మన చేతులలో నుండి దాటిపోతే మనగతి అధోగతే.
మరోరకం విచిత్ర స్వభావులు వుంటారు. తమ దగ్గర ధనం మూలుగుతున్నా ఖర్చు పెట్టరు. సుఖమయమైన జీవితాన్ని గడపరు. రోగం వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్లరు. దానధర్మాలు చెయ్యరు. కడుపుకు మంచి తిండి కూడా తినరు. కారు మెయిన్‌టెయిన్ చేసే స్థోమత వున్నా కారును కొనరు. ఏ డొక్కు వాహనాన్నో ఉపయోగిస్తుంటారు.
ఇలా వ్యవహరించడం కూడా మంచిది కాదు. సిరిసంపదలున్నప్పుడు అనుభవించాలి. పిసినారితనం మంచిదికాదు. అటు దుబారా ఖర్చు కూడా మంచిది కాదు.

-పి.షహనాజ్ 9346263070