Others

మహోన్నత మంగళమూర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహస్ర శీర్షం దేవం, విశ్వాక్షం విశ్వశమ్భువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పద. ............. అంటూ మొదలై
ఋతుగం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణపింగలం, ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమోనమః అంటూ చెప్పే మంత్రాలే మంత్రపుష్పం. దీనిని వైష్ణవ దేవాలయాల్లో ప్రముఖంగా చెప్తుంటారు. భగవదర్చన పూర్తియైన తర్వాత చివరి ప్రార్థనగా ఈ మంత్రపుష్పాన్ని నీరాజనమును సమర్పిస్తారు. ఆత్మ నివేదనగా సాష్టాంగ నమస్కారం సమర్పిస్తారు. ఇది భగవంతుని ఆరాధనలో చివరి మెట్టు. మంత్ర పుష్పమంతా సృష్టి రహస్యంతో ఆధ్యాత్మిక రహస్యాలతో కూడి ఉంటుంది.
సమస్త సృష్టికి అతీతమై, మోక్షపదమైన అక్షర స్థితిలో నాశనములేని పరతత్త్వము ఆ శ్రీమన్నారాయణుడే! ఆయన సహస్ర శిరస్సులతో విశ్వమంతా కిరణరూపములైన తన నేత్రములతో సమస్త జీవుల ఆత్మలను శాంతింపజేసి పరమమోక్ష స్వరూపమైన శ్రీమన్నారాయణునిగా భాసిల్లుతున్నాడు. సర్వదేవతలకు నారాయణుడే ప్రభువై జ్ఞాన రూపుడుగా వెలుగుతున్నాడు. నారాయణుడే సమస్త సృష్టియందు వ్యాపించి విశ్వాత్మగా ఆవిర్భవించి, సమస్త జీవరాసుల ఆత్మలకు అంశభూతుడైనాడు. సమస్త విశ్వమునకు ఆధారభూతుడై ఆహార స్వరూపుడై జీవులను పోషించి పెంచి ప్రాణ స్వరూపుడై రక్షించుకున్నాడు. ఈ ప్రాణ స్వరూపమే పరమాత్మ.మన ఆత్మలోని ఆత్మజ్యోతి నారాయణుడే, మనలోని అంతరాత్మ నారాయణుడే ఈ బ్రహ్మాండమును సృష్టించిన బ్రహ్మదేవుడు నారాయణుడే. పరమ తత్త్వమైన అక్షర పరబ్రహ్మ కూడా ఆ నారాయణ పరతత్త్వమే విశ్వమునకు పరమముగా వెలిగే పరమాత్ముడు కూడా నారాయణుడే! పరమాత్మను ధ్యానించెడి వారి ఆత్మ కూడా ఆ నారాయణుడే. సమస్త సృష్టిలో కంటికి కనిపించేది చెవికి వినబడేది మన లోపల బైట వ్యాపించి సమస్త జీవులలోనున్న అంతరాత్మ కూడా ఆ శ్రీమన్నారాయణుడే! అంతములేని అనంతుడుగా, శాశ్వితుడుగా, జనన మరణములు లేక ప్రళయంలో నశించని వాడై శుద్ధ జ్ఞాన స్వరూపంతో వేదమంత్రములకు మంత్రకర్తయైన మహాకవి నారాయణుడే. పాల సముద్రంలో శేషశయనుడై, అనంతుడిగా యోగ నిద్రావస్థలోనుండి సమస్త సృష్టిని అంతర్ దృష్టితో చూస్తూ రక్షించేది ఈ మహోన్నత మంగళమూర్తియే. అనంతకోటి జీవరాసులకు గమ్యం ఆయనే. కావున ‘విశ్వశమ్భువమ్’అని, ఓంకార రూపంలో ప్రళయకాలంలో కూడా సమస్త లోకాన్ని సహస్ర సూర్యుల తేజస్సుతో వెలుగిస్తున్నాడు. నాభికి పైన యున్న మన హృదయ కమలం మధ్యలో ఆత్మరూపంగా ఈ నారాయణ పరంజ్యోతి యున్నది. హృదయం తామర పూవు మొగ్గవలె మన హృదయ కోశంలో వ్రేలాడుతుంది. దాని మధ్య అగ్ని వలె వెలిగే పరంజ్యోతి, జ్ఞానదీపాలుగా లోకమంతటా వ్యాపిస్తుంది. జీవుని హృదయ నాళములకు మూలముగా తామరపూవు మొగ్గవంటి హృదయ కుహరంలో శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో శయనించి ఉన్నాడు. ఆ పరంజ్యోతికి విశ్వరూపుడైన శ్రీమన్నారాయణునకు నమస్సులు అందింద్దాం.
*