Others

‘మనుచరిత్ర ప్రబంధ దర్శన’ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా నిందించినా ముగ్గురు భార్యలకూ ముగ్గురు బిడ్డలని కని, మూడు రాజ్యాలు సంపాదించి వారికి ఇచ్చి గార్హస్థ్య ధర్మం పూర్తిగావించాడు. తర్వాత వానప్రస్థం కోసం అడవికి వెళ్లబోతే లేడి రూపంలో వచ్చిన వనదేవత కోరిక దయార్త్ర హృదయతతో, ఆర్త్రత్రాణ పరాయణతతో తన కులధర్మం నెరవేర్చాడు. దానివల్లనే స్వారోచిష మనువు పుట్టాడు. ఈ క్రమంలో పెద్దన గొప్ప ఔచిత్యం పాటించాడు (పుట 353-357).
- స్వరోచి వంటి భారతీయ చక్రవర్తుల పరిపాలన ఆకళింపు చేసుకుంటే శ్రీశ్రీ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని వుండేవాడు కాదు. కేవలం అది పాశ్చాత్య రాజులను చూసి కలిగిన అభిప్రాయం. పెద్దన సామాజిక స్పృహ ఆ పరిపాలన చెప్పటంలో ఉంది. (పుట 264).
15.పెద్దనకి దక్కవలసిన గౌరవం దక్కలేదు. సకల జనాభిహిత మహదాశయం గుర్తింపబడలేదని జొ.రా.శ 478 పుటలో తేల్చి చెప్పారు.
****
* ఈ వాదనలతో నీకు ఏకీభావం వుందా?
- పుస్తకం చదవబోయేవారికి జొ.రా.శ వాదనలనూ, వారి పరిశ్రమనీ సంగ్రహంగా పరిచయం చేయటమే నా ఈ వ్యాసానికి నేను విధించుకున్న పరిమితి.
* ఆధునిక దృష్టితో విమర్శ గురించి నీ ఆలోచనలు ఏమిటి?
- వాటి గురించి నిదానంగా మరోమారు రాసుకుంటాను. ప్రస్తుతానికి కొద్దిగా చెపుతాను.
- ‘ఆధునిక వచన రచన ప్రక్రియలు’ అన్న ఈ వ్యాసంలో సాంకేతికంగా అచ్చు యంత్రమూ, పత్రికలూ ప్రధానమైన విభజన రేఖ అని రాసాను. వాటితోబాటు పాశ్చాత్య సంపర్కంలో కథ, నవల, ఏకాంకిక, వ్యాసం అనే ప్రక్రియలలో మనం మన భావాలు చెప్పటం ఆరంభించాం. ఇందులో వ్యాసం అనేది ఆధునిక విమర్శకి దారితీసింది.
- ఇతిహాసాలు, ప్రబంధాలు, పురాణాలు వంటి అచ్చుపూర్వక గ్రంథాల గురించి మనం ఆలోచించటానికి ఒక వేదిక సమకూరింది.
* అంతకు పూర్వం వీటిపై విమర్శ లేదా?
- ‘్భరతీయ సాహిత్య మీమాంస (దీనే్న అలంకార శాస్త్రం అని కూడా అంటారు) ప్రధానంగా సాహిత్య సిద్ధాంతమే. కానీ, సాహిత్య విమర్శ కాదని ఇంతకుముందే అనుకున్నాం. ఒక గ్రంథాన్ని తీసుకొని అందులోని వస్తువునూ, శిల్పాన్నీ సమగ్రంగా విశే్లషించి, ఆ గ్రంథానికి విలువ కట్టే సంప్రదాయం మనకు లేదు.
అక్కడక్కడా కవిత్వ విశే్లషణ కనిపించినా అది పద్యాల ఆధారంగా జరిగిందేగానీ మొత్తం కావ్యాల ఆధారంగా జరగలేదు. కాని, కావ్య స్నేహితులు ఏవి? కావ్యాలు ఎన్ని రకాలు? కావ్య ప్రయోజనం ఏమిటి? నాయకులు, నాయికలు ఎన్ని రకాలు? కావ్యనిర్మాణం ఎలా ఉండాలి? భావోద్రేకాలు ఎన్ని? వాటిని ఎలా ప్రేరేపింపజేయాలి? ధ్వని అంటే ఏమిటి? వక్రోక్తిని ఎలా గుర్తించాలి? కావ్యాలలో ఉత్తమమైంది ఎలాంటిది?- ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని భారతీయ సాహిత్య మీమాంస గత ఇరవై శతాబ్దాలుగా లోతుగా చర్చించింది’’.
ఇది వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారి విమర్శా శిల్పంలో రాసినది.
వారు ఇంకా ఇలా రాస్తారు.
‘‘కవి సామాన్య మానవుడే కాదనీ, దైవాంశ సంభూతుడనీ, దేవుడు పలకటానికి కవి ఒక మాధ్యమం లాంటివాడనీ అలంకార శాస్త్ర సంప్రదాయం చెబుతుంది. సరస్వతీదేవి, వినాయకుడు, శ్రీరాముడు మొదలైన దేవతలతో తనకు ప్రత్యక్ష సంబంధం కలిగిందని చెప్పుకున్న కవులు మనకు అసంఖ్యాకంగా వున్నారు. ఈ కవులు తమ కావ్యాలకూ, నాటకాలకూ గ్రహించిన వస్తువులు కూడా దైవికమైనవి, ఆధ్యాత్మికమైనవి. సహృదయుడు, కవి ఇస్తున్న కావ్యాన్ని శుభ్రమైన మనస్సుతో వినయంగా గ్రహించవలసినవాడు మాత్రమే.
దాన్ని గురించి తర్కించే అధికారం అతనికి లేదు. కాబట్టి ఈ చట్రంలో కావ్యానికి విలువ కట్టటం అన్న సూత్రానికి అవకాశమే లేకుండా పోయింది. రచనకు సంబంధించి అన్ని కార్యక్రమాలూ దైవికమూ, ఆధ్యాత్మికమూ అయినపుడు వాటికి విలువకట్టడం ధార్మిక వ్యతిరేకం అవుతుంది. అందుచేత అలాంటి బాధ్యతను ఎవరూ స్వీకరించలేదు. కావ్యంలోని వస్తువును తర్కించవలసిన అవసరమే ఉండేది కాదు. ఎందుచేతనంటే వస్తువును కవులు వేదోపనిషత్తులనుండీ, పురాణాలనుంచీ మాత్రమే గ్రహించేవారు. దానికి తమ అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులో అలంకారం చేసేవారు. కాబట్టి అలంకార శాస్త్రం విడి పద్యాలని తీసుకొని వాటిలోని అలంకారాలనూ, ధ్వనినీ, వక్రోక్తినీ, శే్లషణనూ, చమత్కారాన్నీ వివరించే కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టింది.
మొత్తం కావ్యాన్ని ఒక ‘యూనిట్’గా గ్రహించి, విమర్శంచలేదు’’.
ఈ రెంటివల్లా నేను గ్రహించినది: వచన ప్రక్రియలు ఆరంభమైనాకనే గ్రంథ విమర్శ ఆరంభమయింది. దీనిలో అలంకారశాస్త్రం, నాట్యశాస్త్రం వంటి పూర్వ సాహిత్య సిద్ధాంతాలను ఆధారం చేసుకుని గ్రంథాలపై వ్యాసాలు రాయటాన్ని ప్రాచీన విమర్శగా వ్యవహరించారు. పాశ్చాత్య విమర్శలో వచ్చిన గ్రంథాల ఆధారంగా మన ప్రాచీన గ్రంథాలను తూనిక చేయటం ఆధునిక విమర్శగా, చేసేవారిని ఆధునిక విమర్శకులుగా, వారి దృష్టిని ఆధునికంగా వ్యవహరిస్తున్నారు. అచ్చు.. తదనంతర సాహిత్యంలో వచన ప్రక్రియలకు ఈ విమర్శ చేసినపుడు దానిని మొత్తంగా ఆధునిక దృష్టి అంటున్నారు. ఇది పునఃపరిశీలన చేయాలని నేను అనుకుంటున్నాను.
* ప్రస్తుత గ్రంథం ఆధునిక విమర్శ అనాలా? లేక ప్రాచీన విమర్శ అనాలా?
-నేను దీనిని ఆధునిక విమర్శగానే గుర్తిస్తాను. ప్రాచీన ప్రమాణాలైన ధ్వని, వక్రోక్తి, అలంకారాలను ఈ గ్రంథంలో రామకృష్ణశర్మగారు వినియోగించుకున్నారు. అంతమాత్రాన ఇది ప్రాచీన విమర్శ అనలేను. అలాగే సమాజం పట్ల సంస్కృతిపట్ల వారి అభిప్రాయాలు భిన్నమైనవే కాని ప్రాచీనమైనవికావు.
* చివరగా నువ్వు చెప్పేది?
- ఈ గ్రంథం వినూత్నమైనది. ఒక ప్రాచీన ప్రబంధంపై కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఖండన మండనలనూ, ప్రశంసాభిశంసలనూ ఒక చోటికి చేర్చి కూలంకషంగా చర్చించింది. నేనింతవరకూ వస్తుపరంగా ఇలాంటి గ్రంథం చూడలేదు. శర్మగారి అభిప్రాయాలతో ఏకీభవించినా మానినా ఈ గ్రంథం పరిశీలనార్హమని నేను అనుకుంటున్నాను.

- వివిన మూర్తి