Others
అదైత్వ ప్రకాశకులు స్వామి విద్యారణ్యులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ధర్మమెప్పుడు అపభ్రంశం చెందినా అవ్యక్తమైన భగవానుడే స్వయంగా తన్ను తాను సృజియించుకుని స్థానభ్రంశం చెందిన ధర్మాన్ని తిరిగి మార్గంలో పెడుతుంటారు. ఇది సృష్టి జరిగినప్పటి నుంచి జరుగుతున్నదే. ఈవిషయానే్న స్వయంగా అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తరూపంలో లీలామానుషవిగ్రహునిగా ద్వాపరయుగంలో పుట్టి సామాన్యులకు, అసామన్యులకు కూడా అర్థమయ్యేవిధంగా అర్జునుడి దుఃఖాన్ని నెపంగా పెట్టుకుని గీతోపదేశం చేశారు. అందులో కూడా యధాయధాహిధర్మస్య అంటూ అధర్మం ఎప్పుడు పెచ్చుమీరినా నేను అవతరించి అధర్మాన్ని నాశనమొనర్చి ధర్మాన్ని పునఃస్థాపిస్తానని చెప్పాడు.
ఆ క్రమంలో ఈశ్వరుడు విద్యారణ్యులుగా అవతరించారు. ఆ పరమేశ్వరుడే విద్యారణ్యులు కనుకనే బహుముఖీయమైన ప్రజ్ఞను కనబర్చి విదేశీముష్కరులనుంచి దేశాన్ని కాపాడి హిందూ మతాన్ని పునరుద్దరించారు. హిందూ అనేది మతం కాదు అది ఒక ధర్మం అని చాటి చెప్పారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేటట్టు చేయగల విజయనగర సామ్రాజ్య నిర్మాణంలో పునాదిరాయిగా నిలిచారు. మనలో మనకు విద్వేషాలు ఉండకూడదని కుల మతాలు ముఖ్యంగాదని మానవుల్లో ముఖ్యంగా ఉండాల్సింది మానవత్వమే నని ఎలుగెత్తి చాటారు. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో కూడా రాద్ధాంతాలను చేసేవారు బయలుదేరారు. శంకరులు చేసిన అద్వైత సిద్ధాంతం తరువాతి కాలంలో రెండుపాయలుగా చీలికలైంది. దానికి వాచస్పతి మిశ్రుడు, ప్రకాశత్మయతి అనేవారు భామతి ప్రస్థానము, వివరణ ప్రస్థానము అనేవాటికి మూలపురుషులుగా నిలిచారు.
విద్యారణ్యులు పోనుపోను సంశయాత్ములు పెక్కురు బయలుదేరుతారని ఆలోచించి ‘వివరణ ప్రమేయ సంగ్రహము’ ను రచించారు. స్వతంత్రముగా అనేక అద్వైత వేదాంత గ్రంథములను రచించి నూతన ప్రకాశమును కలిగించారు. వీరు పూర్వాద్వైతులతో అనేక విషయాల్లోవిభేదిస్తూ వచ్చి ‘అధ్యాసమాయ, అవిద్య, జీవ, ఈశ్వర , మోక్షములను గూర్చిన స్వతంత్ర నిరూపణలు చేశారు.
పూర్వాచార్యులు చైతన్యము అనే దానిని మూడు విధాలుగా చెప్పగా విద్యారణ్యులు దానిని కూటస్థచైతన్యమని, బ్రహ్మచైతన్యమని, జీవ చైతన్యమని, ఈశ్వరచైతన్యమని నాలుగువిధాలుగా చెప్పి ‘సాక్షి’ కూడా చెప్పారు.
అప్పటిదాకా శంకరులతో సహా జ్ఞానమే మోక్షహేతువని కర్మజ్ఞానములు రెండూ మోక్షహేతువులని చెప్పినా విద్యారణ్యులు మాత్రం కేవల జ్ఞానమే మోక్షహేతువు కాజాలదని స్వచ్ఛ బ్రహ్మోపాసన అంటే ‘అహం బ్రహ్మాస్మి’ అను దివ్యానుభూతి పొందటమే మోక్షహేతువని ఆధారాలతో గట్టిగా చెప్పారు.
శంకరుల భాష్యము వల్ల జనుల్లో భయం, దుఃఖం, తారతమ్యాలు నిర్మూలించబడ్డాయి. ఆత్మస్వాతంత్య్రం పూరించబడింది. కానీ కొన్నాళ్లతరువాత స్వామిభృత్యభావం, దాస్యభావం ఏర్పడి తారతమ్యభావాలు వ్యాప్తిచెందాయి. అపుడే జాతిముక్కలుగా విడివడింది. దేశం పరాధీనమై ధర్మం సంక్షోభస్థితిలోపడిపోయింది.
అపుడే జాతికి సూర్యోదయంలాగా విద్యారణ్యులు ఉదయించారు. ధర్మాన్ని నిలబెట్టేందుకు వెలుగుపుంజమై తేజరిల్లారు. స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి దేశాన్ని ధర్మాన్ని పునరుద్ధరించి ప్రతి మానవుడు పరమాత్మయే. కానీ ఆ భావం ప్రతిమానవునిలో కలగాలి. అహం బ్రహ్మస్మి అనే దివ్యానుభూతిని పొందే దిశగా ప్రతిమానవుడు పురోగమించాలి. దానికి ధర్మమే మార్గంగా సత్యమే ఆయుధంగా చేసుకోవాలని ఉద్బోధించారు. నేడు విద్యారణ్యులు ధర్మోద్ధారకునిగా కీర్తించబడుతున్నారు.