Others

మనుచరిత్ర ప్రబంధ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారదర్శక విమర్శ
*
కథాపరిచయం
మనుచరిత్ర కథ అంతో ఇంతో అందరికీ తెలిసిందే అయినా మళ్లీ నేను వేరే పద్ధతిలో చెప్తాను. తెలిసినవాళ్లు కూడా విసుక్కోకుండా వినండి.
వెనుకటికి ముగ్గురు పడుచులు ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు.1. మనోరమ, 2. విభావసి, 3. కళావతి అని వాళ్ల పేర్లు. వాళ్లు ముగ్గురూ కలసి పూలు కోసుకోవటానికని ఒకసారి కలధౌత శిఖరి (వెండికొండ) మీదికి వెళ్లారు. అక్కడ ఒక ముని బిలంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒళ్లంతా బక్కచిక్కి తలంతా జుట్టు పెరిగి, పండిపోయి, ముఖం అంతా కప్పేసి, కళ్లూ చెవులూ నోరూ ఉన్నట్లు గుర్తించటానికి వీల్లేని బూచిలా ఉన్నాడు. మనోరమ ఇంకా బాల్య చాపల్యం వదలక ఆయన దగ్గరకు వెళ్లి మీసాలూ గడ్డమూ మధ్య పాయలు తీసి ఇదిగో నోరు అనీ, అలాగే పాయలు తీస్తూ కళ్లూ చెవులూ పరికిస్తుంటే ఆ స్పర్శకి ముని ధ్యానం చెడింది. అలా చెడగొట్టినందుకు మనోరమని చాలా కోప్పడ్డాడు.
‘వయసులో ఉన్న దానివి నీకు తగినవాడిని తడిమి కోడిగం ఆడవచ్చునుగాని ముదివగ్గుని నన్ను తాకితే నీకేమి ఒరుగుతుందే’ అన్నాడు. అంతటితో ఊరుకొంటే బాగానే ఉండేది. ‘ముసలినైన నన్ను ఉసురుపెట్టావు గనుక ఆ ఉసురు పడటానికి నువ్వోరాక్షసుడి బారిన పడతావు’ అని శపించటమే కాకుండా నాగబెత్తం పుచ్చుకొని పాపం ఆ పిల్లని గొడ్డుని బాదినట్లు బాదాడు. అది చూసిన స్నేహితురాళ్లిద్దరూ, ‘అదేమిటయ్యా తపస్సు చేసుకొనే నీకింత కోపం ఏమిటి? బ్రాహ్మణుడివి అయి పోయావు గానీ లేకుంటే ఈపాటికి నీపిండి(డం) పెట్టక పోయామా’ అన్నారు.
దాంతో రెచ్చిపోయిన ఆ ముని వాళ్లని ‘రాజయక్ష్మ రోగం పొందండి’ అని శపించాడు. వాళ్లకి ఆ రోగంఅప్పటి కప్పుడే పట్టేసుకుంది. అంటే, మనోరమని రాక్షసుడు పట్టుకోవటం తప్పదన్నమాటే. తనైతే పరుగెత్తుకు పారిపోతూ రాక్షసుడికి దొరక్కుండా తప్పించుకొంటూ తిరగ్గలదు. పాపంవాళ్లలా తిరగలేరు. కనుక ఆ రాక్షసుడెవరో వచ్చేదాకా ఇక్కడ తను కూర్చోకూడదని గ్రహించి, మనోరమ వాళ్లని అలా వదలిపోక తప్పలేదు. ఇప్పుడు ఆమెకి కూడా సంబంధం ఉన్న మరోకథ. అది మనోరమ తండ్రి అయిన ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజు వృత్తాంతం.
నలనాభుడు అనే ఓ గంధర్వరాజు ఉన్నాడు. ఆయన కొడుకే ఇందీవరాక్షుడు. వానికి చదువులందు వ్యామోహం ఎక్కువ. పెళ్లికి కట్నంగా మామగారైన మరుదశవుడు అనే ఆయన నుంచి ‘అస్తహ్రృదయం’ అనే విద్య పుచ్చుకొన్నాడు. ఆ విద్యని తన ముద్దుల కూతురైన మనోరమకీ ఉపదేశించాడు. ఆ విద్యాతృష్ణ వదలక బ్రహ్మ మిత్రుడు అనే మునిని చేరుకొని ఆయన శిష్యులకి బోధిస్తున్న ఆయుర్వేదాన్ని అర్థించాడు. ఆయన ధనమదాంధులకు ఆ విద్య ఈయనంటే, తనకు వచ్చిన శాంబరీ విద్యవల్ల కంటికి కనిపించకుండా ఆయన శిష్యుల్లో ఒకడిగా కలిసిపోయి పట్టుపట్టి ఎనిమిది నెలల్లో ఆ విద్య సాధించాడు.
అంతటితో తనదారిన తిరిగిపోతే ఎంత బాగుండేది! ‘చూసావా బాపడా నువు కాదన్నా నేను నేర్చేసుకొన్నా’ అని గేలిచేసాడు.

ఇంకాఉంది

జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ 9440037258