Others

గదికి సరికొత్త కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలగడ లేకుండా నిద్రపట్టదు చాలామందికి.. కానీ తలగడ ఉందా, లేదా.. అంతేకానీ అది ఎంత శుభ్రంగా ఉంది అనేది చాలామంది పట్టించుకోరు. కానీ తలగడ వల్ల జుట్టుకి, చర్మానికి చాలా సమస్యలు వస్తాయి. దుమ్ము, కాలుష్యం, అన్ హెల్తీ డైట్, చర్మ సంరక్షణలో లోపాలు వంటివి చర్మానికి, జుట్టుకి చాలా ఎక్కువగా హాని కలిగిస్తాయి. అయితే మీకు తెలుసా.. ఫేవరేట్ పిల్లో కూడా.. జుట్టుకి, చర్మానికి హాని చేస్తుంది. కాటన్ పిల్లో కవర్ వాడటం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.
ఇంటీరియర్స్ ఖరీదు.. ఒకసారి కొన్ని వస్తువులు కొన్నాక.. ఇక మాటిమాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజూ ఇల్లు ఒకేలా ఉంటే బోర్‌గా ఉంటుంది. మరి కాస్త మార్పు తేవాలంటే బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్.. ఇలాంటివి మార్చుతూ ఉండాలి. పడకగది నీట్‌గా ఉండాలంటే పిల్లో కవర్స్ కొత్త కొత్త డిజైన్లతో రంగులతో ఉండేలా తీసుకుంటే అవి ఎప్పుడూ మార్చేస్తూ ఉంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. వీటిలో మంచి రంగులను ఎంపిక చేసుకోవాలి. పిల్లో కవర్స్‌ను రెగ్యులర్‌గా మార్చకపోతే, మరో చర్మ సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లో కవర్స్‌లో చాలా త్వరగా జర్మ్స్ చేరుతాయి. కాబట్టి పిల్లో కవర్స్‌ని కనీసం వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. అంతేకాదు.. ముఖాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
కాటన్ పిల్లో కవర్ రఫ్‌గా ఉండటం వల్ల చర్మానికి చాలా హానికరంగా మారుతుంది. చర్మంలో ఉండే కొల్లాజెన్ చర్మంలో తగ్గిపోయి.. ఎలాస్టిసిటీని తగ్గిస్తుంది. దీనివల్ల ముడుతలు చాలా త్వరగా ఏర్పడుతాయి. చర్మం దిండుపై ఒరిపిడికి గురై పిల్లో రఫ్‌గా ఉండటం వల్ల.. చర్మంపై ర్యాషెస్ వస్తాయి. సున్నితమైన చర్మతత్త్వం కలిగి ఉన్నవాళ్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. పిల్లో కవర్స్ సాఫ్ట్‌గా ఉండేలా జాగ్రత్తపడాలి. పిల్లో కవర్స్ రంగు, డిజైన్, ఫ్యాబ్రిక్ పరిగణలోకి తీసుకోవాలి. గది థీమ్‌ను బట్టి బెడ్‌రూమ్ దుప్పట్లు, పిల్లో కవర్స్ ఎంపిక చేయాలి. గది అందం పెంచడంలో కుషన్ కవర్స్ బాగా ఉపకరిస్తాయి. డ్రాయింగ్ రూమ్, లివింగ్‌రూమ్‌లో కుషన్స్, కవర్స్ అమర్చుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్స్ మోడల్స్ లైవ్‌లీ ప్రింట్స్ వేసిన కవర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ఆకట్టుకునే పిల్లో కవర్స్, బెడ్‌షీట్స్ కుషన్ కవర్స్ ఎంపిక చేయడం మంచిది. ఇంటికి గ్రాండ్ లుక్ వస్తుంది.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి 80085 77834