Others

మహిళలు లేకుండా ఒకరోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచమంతా మహిళా దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతూంటే మార్చి 9న మెక్సికోలో మాత్రం మహిళలు ఎవరూ మహిళా దినోత్సవ సంబరాలలో పాల్గొనకపోగా, వారు ఎక్కడా కనిపించలేదు. మహిళలు బడుల్లో, కాలేజీల్లో కనిపించలేదు, షాపింగ్ మాల్స్‌లో జాడలేరు. ఆ దేశంలో ఆ రోజు మహిళలు మాయమయ్యారు. ఆ రోజు మహిళలంతా ఏమయ్యారనేది నేడు చర్చించాల్సిన అవసరం వుంది. వాళ్ళంతా ఆ రోజు ఏమయ్యారంటే? హింస, అత్యాచారాలకు గురవుతున్న మహిళల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే వుంది కానీ తగ్గడంలేదు. ఏటా ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వాళ్ల జాడే తెలియడంలేదు. చారిత్రాత్మకంగా, మెక్సికోలో మహిళలపై హింస ఎప్పుడూ ఎక్కువగా వుంటుంది. కానీ గత రెండు సంవత్సరాలలో ఈ నేరాల సంఖ్య పెరిగింది. మెక్సికో సెక్రటరీ జనరల్ ఆఫ్ నేషనల్ పబ్లిక్ సెక్యూరిటీ ప్రకారం, 2019 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 2,833 మంది మహిళలు మరణించారు. ఈ సంఖ్యలో 25.6 శాతం మంది మాత్రమే ద్వేషపూరిత నేరాలుగా, మిగిలినవి హత్యలుగా నమోదు చేయబడ్డాయి. దీన్ని బట్టి స్ర్తిల మనుగడకు అత్యంత ప్రమాదకరంగా మారిన దేశాల్లో మెక్సికో కూడా ఒక దేశంగా చెప్పవచ్చు. ఆడవారిమీద రోజురోజుకూ పెరిగిపోతున్న హింసకు వ్యతిరేకంగా తమ నిరసనను వినూత్నంగా తెలియజేయడం కోసం మెక్సికన్ మహిళలు, మార్చి తొమ్మిన ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని, విధులకు హాజరుకాకూడదని నిర్ణయించుకుని స్కూళ్లకు వెళ్లొద్దని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. షాపులకు సెలవు ఇమ్మన్నారు. ఆరోజంతా మహిళలు ఎక్కడా కనిపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఆకాశంలో సగంలేని సమాజం ఎలా వుంటుందో ప్రపంచానికి చూపించారు. స్ర్తివాదులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తల నుంచి సామాన్యులవరకూ అందరినోటా ఇపుడు ఈ నిరసన పెద్ద చర్చనీయాశమైంది. సాధారణంగా సభలు, సమావేశాలు నిర్వహించడం, దీక్షలో కూర్చోవడం ద్వారా నిరసనలు తెలియజేస్తుంటారు. కానీ ఇలా రోజంతా కనిపించకుండా ఉండాలనే నిరసన వినూత్నంగా వుంది. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన ఉద్యోగినులు విధులకు హాజరుకాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఇంట్లో వుండే గృహిణులు ఇంటి పనులేమీ చేయకుండా దీనికి తమ మద్దతును తెలియజేశారు. మూడు లక్షల ఇరవై వేలకుపైగా సభ్యులున్న ‘ఏ డే వితౌట్ ఉమెన్’ అనే ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా రోజుంతా మహిళలెవరూ కనిపించకుండా ఉండాలనే విషయంమీద చర్చ జరిపి ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. గతంలో ఇదే గ్రూప్ సభ్యులు మహిళల అదృశ్యానికి వ్యతిరేకంగా రహదారులపై తమ ఎర్రని పాదరక్షలను ఉంచి నిరసన తెలియజేశారు. అయితే ఈ ఉద్యమం ఎలా మొదలైందంటే, మార్చి 8, 2017న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధానాలను నిరసిస్తూ మహిళలు ఆ రోజు పనిచేయవద్దని 2017 ‘ఉమెన్స్ మార్చ్’ మరియు ‘ప్రత్యేక అంతర్జాతీయ మహిళా సమ్మె ఉద్యమం’ అనే రెండు వేర్వేరు గ్రూపులు మొదటిసారిగా ‘ఏ డే వితౌట్ ఎ ఉమెన్’ (స్ర్తి లేకుండా ఒక రోజు) అనే పేరుతో మహిళలు సమ్మె చేయడం జరిగింది.
ఈ ఉద్యమ నేపథ్యం గమనిస్తే ఉదయమానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అవి ఏమంటే, పరిమితికి మించి ప్రైవేటీకరణ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవా విధానాలు, అన్ని రంగాలు కార్పొరేటీకరణ జరగడంవల్ల ధరల నియంత్రణపై ప్రభుత్వాలు పట్టుకోల్పోడం, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం జరిగింది. ఆయా కారణాలవల్ల సమాజంలో అసమానతలు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. స్ర్తిలపై ద్వేషం పెంచున్నవారు, అభివృద్ధి చెందినవారిపై ద్వేషం అసూయ పెంచుకున్నవారు దాడులకు తెగబడుతున్నారు. జాతి వివక్ష, లింగ వివక్షత పెరగడంవల్ల అన్యాయంగా డబ్బుకోసం, లైంగిక అవసరాలకోసం మహిళలపైన, చిన్నారులపై దాడులకు పాల్పడటం గమనించవచ్చు. వీటిని నియంత్రించడం కోసం, మహిళల అవసరం ప్రజలకు తెలియజేయడం కోసం ఒక రోజు మహిళలందరూ షాపింగ్ చేయకూడదని, వంట చేయకూడదని, ఉద్యోగం చేయకూడదని, ఆ రోజు తమ నిరసన తెలపాలని నిర్ణయించి ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి అనేక దేశాల్లో అవగాహన కల్పించడమే గాక అదే స్ఫూర్తితో మరి కొన్ని దేశాల్లో ఈ ఉద్యమాన్ని తీసుకురాగలిగారు. అయితే భారతదేశంలో ఇప్పటికీ మహిళా భద్రత కోసం నిర్భయ, దిశ లాంటి చట్టాలు తెచ్చినా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. మన దేశంలో డిగ్నిటీ మార్చ్ పేరుతో మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధిపుల గూర్చి గొంతు వినిపిస్తున్నప్పటికీ, అవి అభిప్రాయాలను తెలిపేందుకే దోహదపడ్డాయిగాని సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడలేదు. కాబట్ట నేడు భారతీయ మహిళలు ‘ఏ డే వితౌట్ ఉమెన్’ లాంటి మహిళా ఉద్యమాల స్ఫూర్తితో తమపై జరుగుతున్న దాడులకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం నేడు ఆసన్నమైంది.

- వాసిలి సురేష్‌కుమార్