Others

మంచి చెడు మిశ్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషిలో మంచి చెడు అనే రెండు లక్షణాలుంటాయ. అయతే మంచిని మాత్రమే చేస్తూ ఉండేవాళ్లను మంచివాళ్లు అంటుంటాం. కానీ ఒక్కో సారి వారు చెడు పనులుకూడా చేస్తారు. అటువంటపుడు అయ్యో ఎంతో మంచివాడు ఇలాంటి పని ఎలా చేశాడు. దుర్జనులతో సాంగత్యం చేశాడేమో అందుకే ఈ దుర్గుణాలు వచ్చాయ అంటారు. కానీ ప్రతి మనిషి తనకున్న వివేకాన్ని బట్టి కంటితో చూసిన విషయాలు, చెవులతో విన్న విషయాలను మనసుతో కానీ బుద్ధితో కానీ బాగా ఆలోచించి ఏదిమంచి చేయాలో దాన్ని చేయగలిగితే అది మంచిదే అవుతుంది. కానీ ప్రతి మనిషి అంత శక్తివంతుడు కాకపోవచ్చు. ఎదురుగా ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు దానిపట్ల ఆకర్షణ కలిగి వ్యామోహం చెందవచ్చు. అందుకే ఎపుడూ చెడు వాళ్లతో కాకుండా సజ్జనులతోనే స్నేహం చేయమనడంలో అంతరార్థం.
‘‘్భగవంతుని సృష్టి అంతా మంచి చెడుల మిశ్రమం ఉండి ఏది మంచిదా కాదా అన్న సందిగ్ధావస్థలో పడవేసే విషయాలే కనపడు తుంటాయ. ప్రతి వ్యక్తి మనసులోమంచి, దాని ప్రతికూల శక్తి చెడు కూడా నిక్షేపమై ఉంటాయి. చూసిన, విన్న విషయాలను ఆచరణలో పెట్టేటపుడు మంచి చేస్తే అంటే మంచి మనసు ఉన్నట్టు లేదా మనసులో దైవీగుణాలున్నట్టు. లేకపోతే దానికి వ్యతిరేకమైనవే ఉన్నట్టు దానివలనమనుషులు ఆచరించే పనులను బట్టి వాటిని చూసే మనుషులు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏ పనియైనా ఆచరణలో పెట్టేటపుడు ముందుగా పూర్వజన్మ సంస్కారము, పరిసరాల ప్రభావము, జన్యుసంస్కారము, ఇతర సంపర్క సాంగత్య ప్రభావము ఇవన్నీ పని చేసే వ్యక్తిపై ప్రభావాన్ని చూపెడుతాయ.
అయితే మంచి చెడుల మధ్య భేదము చాలా దృఢముగా గోచరించినవారికి ఈ డోలాయమాన స్థితి కలుగదు. భగవంతుడు సృష్టిలో వెలుగుతోబాటు దానివెంట నడిచే నీడను కూడా సృష్టించాడు. వెలుగువలన కలిగే లోకకళ్యాణం దాని వెంట నడిచే నీడవలన మరింత ప్రస్ఫుటమై వెలుగును మరింత శోభనిస్తుంది.
వెలుగు బలహీనపడినపుడు దానినీడ బలపడుతుంది. అలాగే మనిషిలోని దైవశక్తి పెరిగినకొలదీ ప్రతికూలచెడు శక్తి బలహీనమవుతుంది. ఇది అందరికీ తెలిసిన సాధారణ విషయం. ప్రతికూల శక్తిని వంచాలి అంటే మనుషుల్లో మంచిని పెంచాలి. సజ్జనత్వం పెరగాలి. మానవత్వం రాణించాలి. రాక్షసత్వం తగ్గుతుంది. కానీ నశించిపోదు. ఎందుకంటే మంచి చెడు అనేవి గుణాలు. గుణ సహితుడు మానవుడు. కనుక ప్రతికూల శక్తులను అణచలేము కానీ తొక్కి పెట్టగలము. అయతే ఎంత సేపు తొక్కిపెట్టగలం. ఏ కొద్దీ ఆకర్షణ కలిగితే వెంటనే చెడు బలం పుంజుకుంటుంది.
ఇట్లా జరగకుండా ఉండాలంటే మనిషి కర్మసిదాధంతాన్ని ఆఛరించాలి. చేసే కర్మలకు బాధ్యత వహించకుండా భగవంతునకు అర్పిస్తూ అంతా ఈశ్వరార్పణం చేస్తూ చేయాలి. అపుడు ఈ బలహీన క్షణాలు కానీ,చెడు గుణాల ప్రకోపం కానీ ఉండవు. అంతా దివ్యత్వమే ఉంటుంది. దైవీగుణాల ప్రభావమే ఉంటుంది.

- ఆర్. పురందర్