Others
మనుచరిత్ర ప్రబంధ దర్శనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పారదర్శక విమర్శ
*
వెంటనే ఆ గురువుకి కోపం వచ్చేసింది. ‘మాంసం తింటూ నెత్తురు త్రాగే రాక్షసుడివైపో’ అని శపించేసాడు. అప్పుడు ఇందీవరాక్షుడు కాళ్లావేళ్లా పడితే శాంతించి, ‘నీ కూతురినే నువు మ్రింగబోయి నప్పుడు ఒక ధన్యుని బాణాగ్నికి నీ రాక్షసత్వం తగులబడిపోయి ఎప్పటిలా శుభరూపం వస్తుందిలే పో’ అన్నాడు. జరుగబోయే కథ అంతటికీ ఇది కీలకం అయిన వృత్తాంతం.
ఇప్పుడా ఇందీవరాక్ష రాక్షసుడే,తన కూతురైన మనోరమని బూచి తబిసి శాపం ప్రకారం పట్టుకోవాలని తరుముకు వస్తున్నాడు. ప్రాణభయంతో మూడునాళ్ళ నుండీ వాడికి దొరక్కుండా మనోరమ దూరంగా పారిపోయి తప్పించుకొంటూ ఉంది. అప్పటికి అలసిపోయి ఆ వెండికొండ ప్రాంత అరణ్యాలకి చేరుకొని రక్షించమని కేకలు వెయ్యటం మొదలు పెట్టింది.
ఆ అరణ్యాలలో వేటకై వచ్చి, చక్కని వేట వేడుక తీర్చుకొని విందుగుడిచి విశ్రమించిన స్వరోచి అచ్చర బిడ్డడికి వినిపించాయి ఆ కేకలు. (స్వరోచి జన్మ వృత్తాంతం తరవాత చూద్దాం) అతడు వెంటనే వెళ్లి మనోరమకి ధైర్యం చెప్పి ఆమె వృత్తాంతం అడిగి తెలుసుకొని దాన్తో పాటు ఆమె ఉపదేశించిన అస్తహ్రృదయ విద్యను శుచియై గ్రహించాడు. అంతలో గర్జిస్తూ అక్కడికి చేరుకొన్న రాక్షసుడితో తలపడి, పోరాడి, ఆగ్నేయాస్త్రంవేసి కొట్టాడు. అది తగిలేటప్పటికా రాక్షస రూపం తగులబడిపోయి ఇందీవరాక్ష గంధర్వుడ య్యాడు. అంటే అప్పటితో ఆ మనోరమకు బూచి తబిసి పెట్టిన శాపమూ, ఇందీవరాక్షుడికి బ్రహ్మమిత్రుడు పెట్టిన శాపమూ రెండూ ఒక్క స్వరోచి వల్లే తీరిపోయాయి. అంటే, స్వరోచి గొప్ప మహిమాన్వితుడన్నమాట.
అప్పుడా ఇందీవరాక్ష గంధర్వరాజు స్వరోచితో చుట్టరికం కలిపాడు. ‘నేను మీ అమ్మకి తోడబుట్టిన వాణ్ని. నీకు మేనమామని’ అన్నాడు. నా కూతురే ఈ మనోరమ. నీకు వరసే. పెళ్లి చేస్తానన్నాడు. అన్ని కట్నాలతో పాటు నేను నేర్చిన ఆయుర్వేదమూ నీ వరణంగా పుచ్చుకోమన్నాడు. అలా అని తీసుకువెళ్లి మందర పర్వతం మీది గాంధర్వ నగరంలో వాళ్లకి పెళ్లి జరిపించాడు చాలా గొప్పగా. ఆ పెళ్లి అయిన దంపతుల తొలి నాటి రాత్రే మనోరమ కళ్లనీళ్లు పెట్టుకొని ‘నా స్నేహితురాళ్లక్కడ రోగంతో తీసుకుంటూంటే నాకిక్కడ ఏమి సుఖం?’ అంది. ‘అయితే వాళ్లెక్కడున్నారో చూపించు. నా ఆయుర్వేద విద్యతో వాళ్లని బాగుచేస్తాను’ అన్నాడు స్వరోచి. అట్లాగే చేసాడు వెండికొండకి వెళ్లి.వాళ్లూ వాళ్ల వృత్తాంతాలు చెప్పి కృతజ్ఞతతో తమ విద్యలతోపాటు తమనీ సమర్పించుకొన్నారు.
అందులో విభావసి, మందారుడనే పేరుగల విద్యాధరుడి కూతురు. అంతే మనుచరిత్ర లో ఆమె వృత్తాంతం. కాగా, ఆమెకి భూమీద ఉండే అన్ని జంతువులు, పక్షుల భాషణాలు గ్రహించే విద్యవచ్చును. ఆ విద్యతోపాటు ఆమెనూ స్వీకరించాడు స్వరోచి.
మరొక స్నేహితురాలు కళావతి. ఆమె వృత్తాంతం ఒక్కటే ఒక ప్రబంధంగా వ్రాయదగినంత కమనీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె జన్మవృత్తాంతం మరో శకుంతల జన్మకథే. పారుడు అనే బ్రహ్మర్షి ఉన్నాడు. బ్రహ్మచర్యంలో సకల విద్యలూ నేర్చి, ఒక చక్కని చోటు చూసుకొని విష్ణ్ధ్యున పరాయణుడై, పంచాగ్ని మధ్యంలో కాలి బొటన వ్రేలిమీద నిలబడి చేతులెత్తి నమస్కరిస్తూ సూర్యునిదిక్కు మొగమై ఘోరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సుకి ఇంద్రుడు భయపడిపోయి ‘పుంజికస్థల’ అనే అప్సరసని ఆ మహర్షి తపోభంగం చేసి రమ్మని పంపాడు. ఆమె వచ్చి తన తనూవిలాసంతో ఆ పారర్షిని మరులుగొల్పి, ఆయనవల్ల ఒక కూతుర్ని కని ఆ వనంలోనే వదిలివేసి పోయింది.
ఇంకాఉంది