Others

104 వయసులోనూ అదే హుషారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారాలను అందజేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే అవార్డులు అందుకున్నవారిలో 104 సంవత్సరాల మన్ కౌర్ అందరి దృష్టినీ ఆకర్షించింది దేశంలోనే అత్యంత వయోవృద్ధ అథ్లెట్ అవార్డుకు ఎంపికైంది మన్ కౌర్. రామనాథ్ కోవింద్ చేతుల గుండా అవార్డు తీసుకోవడానికి స్టేజీపై మన్‌కౌర్ పేరు పిలవగానే.. అందరూ ఆశ్చర్యపోయేలా ఆమె ఎంతో హుషారుగా చకచకా నడుస్తూ రాష్టప్రతి వద్దకు వచ్చి పురస్కారాన్ని అందుకుంది. వంద సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆమె ఎంతో చురుగ్గా అవార్డు తీసుకునేందుకు రావడం చూసిన రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీలు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. అథ్లెట్‌గా విశేష ప్రతిభ కనబరిచిన మన్ కౌర్‌కు నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డును అందుకున్న తరువాత కూడా ఆమె క్రీడా విభాగంలో తనకు ఈ పురస్కారం వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ మన్ కౌర్ పరుగు తీస్తున్నట్టుగా స్టేజీ నుంచి కిందకు దిగి వెళ్లారు. ఇదంతా చూస్తున్న జనాలు కూడా ఆమె ఈ వయస్సులో కూడా అంత హుషారుగా, చలాకీగా నడుస్తున్నందుకు ఆమెను చప్పట్లతో అభినందించారు.
మన్ కౌర్ ‘మిరాకిల్ మామ్ ఫ్రమ్ చండీగఢ్’గా పేరును సంపాదించుకుంది. 93 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆమె అథ్లెట్‌గా మారారు. అప్పటి నుండి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 20కి పైగా పతకాలను గెలుచుకున్నారు. 104 సంవత్సరాల వయస్సులో కూడా మన్ కౌర్ చాలా హుషారుగా, చలాకీగా ఉంటారు. ఈమెను చూసిన ఆనంద్ మహీంద్రా ఇటీవల ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. ‘ప్రపంచ దేశాలకు అతి పెద్ద ఆరోగ్య ముప్పుగా కరోనా(కొవిడ్-19) వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్‌ను ఒక మహిళ అధిగమించగలదు. ఆమె ఎవరో కాదు గత వారం మహిళా దినోత్సవం సందర్భంగా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారత మహిళా అత్యున్నత పురస్కారం ‘నారీ శక్తి పురస్కార్’ అందుకున్న మన్ కౌర్ అనే 104 సంవత్సరాల వృద్ధ మహిళ. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. కానీ మన్ కౌర్‌కు మాత్రం ఆ భయం లేదని నా అభిప్రాయం. ఆమె ఆ వైరస్ ఎదుర్కొని, దాన్ని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది’ అని ట్వీటు చేశారు. మహీంద్రా ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికే నెట్టింట్లో వైరల్ అయ్యింది. ‘మీ ట్వీట్ ఎంతో స్ఫూర్తిదాయకం.. ఈమె ఎంతో అసాధారణమైన వ్యక్తి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
*