Others
మనుచరిత్ర ప్రబంధ దర్శనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పారదర్శక విమర్శ
*
ఆ విషయం మొదట్లో ముని కూడా పట్టించుకోలేదు. పాపం పాలూ నీళ్లూ లేక ఆ పసిపాప ఏడుస్తూ, చంద్రుడు వచ్చినప్పుడల్లా ఆ చంద్రకళల్లో ఉన్న అమృతం త్రాగి బ్రతికింది. అంతలో పారర్షికి దయ వచ్చి తన పాపని ఆశ్రమానికి తీసుకొనివెళ్లి పెంచాడు. చంద్రకళలు పానం చేసి బ్రతికింది గనుక ఆమెకు కళావతి అని పేరుపెట్టాడు. ఆమె కూడా ఎదిగివస్తూ తండ్రిసేవ చేస్తూ వనవంతరాలయింది.
వయసు వచ్చిన కళావతి సొగసు చూసి, దేవాపి అనే గంధర్వుడు బంధు పరివారంతో ఆశ్రమానికి వచ్చి, పారర్షితో కళావతిని తనకిచ్చి పెళ్లి చెయ్యమని అడిగాడు. వాడి వాలకం జుగుప్స కలిగింపగా పారర్షి వాళ్లను తిట్టి తరిమి కొట్టాడు. దేవాపి కూడా పగచాటికి పోయి మళ్లీ ఓ అర్థరాత్రివేళ చాటుగా ఆశ్రమంలోకి ప్రవేశించి నిద్రలో ఉన్న పారర్షి తల నరికివేసి పారిపోయాడు. ఆశ్రమ వాసులైన మునిజనం చనిపోయే ముని కేకలు విని దీపాలు పట్టుకు వచ్చేసరికి ఏముంది! అంతా నెత్తురు. అందులో తలతెగి పడి ఉన్న ముని. పాపం కళావతి దిక్కులేని దయ్యింది. తెల్లవారి ముని దేహానికి దహనక్రియలు జరిగాక, దిక్కులేని తన బ్రతుకు నిరర్థకం అని విచారించి నిరాశతో ఆత్మహత్యకు (ఉరిపోసుకు చావటానికి) సిద్ధమైంది ఒకనాడు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఆ దారిన పోతూ ఉన్న గౌరీదేవి అదిచూసి నేలకు దిగివచ్చి ఆ సాహసం మాన్పించింది. ‘ఈ సుకుమార సుందర దేహాన్ని నాశనం చేసుకోకు. అతిలోకుడైన స్వరోచి నీకు భర్త కాగలడు. నీవతనితో సాటిలేని సుఖభోగాలు అనుభవిస్తావు. నామాట నమ్ము’ అని వరం ఇచ్చిందే కాకుండా సకలాభీష్టాలూ తీర్పగల పద్మినీ విద్యనూ ప్రసాదించి వెళ్లింది. అని తన వృత్తాంతం సవిస్తరంగా వినిపించి, నీవే ఆ స్వరోచివనుకుంటానంటే, స్వరోచి కళావతినీ ఆమె విద్యతో పాటు స్వీకరించాడు.
స్వరోచి తన మువ్వురు పెళ్లాలతోనూ సుఖభోగాలు అనుభవిస్తుంటే ఓ చక్రవాకి ‘ఒక భార్యకు ఒక భర్త’ సూత్రం పాటిస్తే అనురాగం పరస్పరంగా పెంపొందుతుందని వినిపించి పోయింది. మళ్లీ కొన్నాళ్లకి ఒక లేడి ‘ఇహపర సాధన విషయం చూసుకోకపోతే ఉద్ధరించేవాళ్లెవరూ ఉండరు’ అని వివరించి పోయింది. అంతట స్వరోచి మువ్వురు పెళ్లాలవల్లా మువ్వురు కుమారులను గని, పెద్దజేసి, వారికి రాజ్యాలు సంపాదించి పెట్టి, పట్ట్భాషేకాలు చేసి, తాను వనం చేరుకొన్నాడు. అక్కడ మళ్లీ వనదేవత వచ్చి ‘మనువు గాదగిన పిల్లవానిని నీనుండి పొందమన్నారు దేవతలంతా’ అంటే స్వరోచి కాదనక స్వారోచిషుని ప్రసాదించి తాను పుణ్యలోకాలకి వెళ్లి ధన్యుడయ్యాడు.
శాపాలు పోగొట్టేంత గొప్పవాడా స్వరోచి. పార్వతీదేవి అతిలోకుడని ప్రశంస చేయ దగ్గవాడు. కడకు దేవతల అవసరం తీర్పగలిగినంత యోగ్యత స్వరోచిలో ఎక్కడి నుంచి వచ్చిందీ అని. అంటే ఆయన జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. అతడు వరూధిని అనే అచ్చరలేమ కొడుకు.
వరూధిని దివినుంచి వచ్చి హిమాలయం మీద మకాంపెట్టి వీణ వాయించుకొంటూ పాడుకుంటూండగా అటువచ్చిన ఒక బ్రాహ్మణుని తేజస్సుకి పరవశం అయిపోయింది. ఆ బ్రాహ్మణుడి పేరు ప్రవరాఖ్యుడు. ఆర్యావర్తంలో వరణానది గట్టునున్న అరుణాస్పదపురం వాళ్లది. ఆదర్శ గృహస్థుడాయన.
ఇంకాఉంది