Others
ప్రేమే దైవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రేమ అనే రెండక్షరాలు ప్రపంచ రథ చక్రాలు. దైవ సంకల్పం వల్లే ఈజగత్తు చక్రంలా గిరగిరాలాడుతూ సృష్టి సంహార విలాసాల క్రీడాకేంద్రంగా విరాజమానం అయింది. ఈ సృష్టి కి మూలకారణం అయిన ఆ భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు. ప్రేమే దైవం అయినందువల్ల భూలోకం ప్రేమకు పెన్నిధి. మనం ఈలోకంలో ఆయన ప్రతిరూపాలుగా జీవకోటి అవతరించింది.
ప్రేమ అన్న పదానికి చాలా అర్థాలున్నాయి. ఇష్టం, అనురాగం, ఆకర్షణ, అభిమానం, ఆదరణ, స్నేహం ఇవన్నీ పర్యాయపదాలు. పూదండలో దారంలగా వీటి అన్నింటి సమాహారమే ప్రేమకు ఆధారం. ఒక అద్భుతమైన వరం అని, గొప్ప అనుభూతి అని ఆరని జ్యోతి అని చెప్పవచ్చు. రెండుహృదయాలను కలిపే సేతుబంధం ప్రేమ. సాధారణంగా స్ర్తి పురుషుల నడుమ సహజాకర్షణ ను మాత్రమే మనం ప్రేమ అని అనుకుంటున్నాం. అపరిమితమైన ప్రేమకు పరిమితమైన అర్థంలో వాడుకుంటున్నాం.
జీవజాతులన్నీ తమతమ జాతులు పునరుత్పత్తికి ప్రేమతో ఒకరితోకరు కలుసుకుంటూ ఉంటారు. కొన్నాళ్లకు విడిపోతూంటారు. కానీ వివేక విచక్షణాలున్న మనిషి మాత్రం కలసి కలకాలం మనటానకి అనువైన ఒక అనుసంధానప్రక్రియకు వివాహం అని నామకరణం చేసింది. ఈ పవిత్ర బంధానికి కట్టుబడటం వల్ల సమాజానికి లోకానికి మేలు కలుగుతుంది. పెళ్లి అనే రెండక్షరాలు ప్రేమ చక్షువులతో సమానంగా ఆదరణ పొందినపుడే నూరేళ్ల పంట పండించుకోవచ్చు. స్నేహం, అనురాగం, ఆత్మీయత మూడంచెల సామాజిక కర్మ వ్యవస్థ వివాహంగా చెలామణి అవుతోంది. కల్యాణం పరమ గమ్యం లోక కల్యాణం అంటుంది ఆప్తవాక్యం. కల్య అంటే సంతోషం. అణయతి అంటే కలగటం, వెరసి కల్యాణం. పామర భాషలోని పెండలి అనే పదానికి పారిభాషిక అంతరార్థం మంగళకరమైన కళ్యాణం. దేవతల కళ్యాణమే మానవ కళ్యాణానికి మూలాధారం. పార్వతీ కళ్యాణం, సీతాకళ్యాణం, రుక్మీణీ కళ్యాణ ప్రకృతి ప్రధానమైన ఆదర్శదాంపత్యాలకు ఉదాహరణలు. లోకోత్తరుల అవతారాలు, జీవితాలు, లోకేశ్వరుడి సంకల్పం మేనని లోకస్తుమైన మనం ఆ ఆదర్శాలను జీవితానికి అనువాదం కావలసినదే అనేది సారాంశం.
ప్రేమ పెళ్లిలో అంతర్భాగం అని పెళ్లి ప్రేమకు అనుబంధం అని తెలుసుకొంటే ప్రేమ వైఫల్యాలు, ఉన్మాదాలు, ప్రేమ పేరిట దారుణాలు జరగవు. ప్రేమే దైవం. పెళ్లి దైవ నిర్ణయం. ఈ విశ్వాసం పైన ఆధారపడ్డ సంప్రదాయిక వివాహ వ్యవస్థను సుస్థిరంగా సుభద్రంగా పరంపరానుగణంగా కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గార్హస్థ్య ముఖ్యమైన ఒక ఆశ్రమ ధర్మం. ఆ ధర్మాన్ని స్నేహంగా, ప్రేమతోఅవగాహన లో ఆనందంగా ఆచరిస్తే సమాజం నిత్యకళ్యాం పచ్చతోరణంగా అవుతుంది. జగత్ కళ్యాణం జరుగుతుంది.