Others

సౌజన్యంతోనే ఉన్నత మూర్తిమత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్రత్వేనో న్నమన్తః పరగుణ కథనైః
స్వాన్గుణాన్ఖ్యాపయంతః
స్వార్థాన్యం పాదయంతో వితత పృథు
తరారంభయత్నాః పరార్థే.....
క్షాన్యైవాక్షేప రూక్షాక్షర ముఖర
ముఖాన్దుర్జనాన్ దుఃఖయంతః
సంతస్సా శ్చర్య చర్యా జగతి బహుమతాః
కస్వ నాభ్యర్చనీయాః
సామాన్యుల దృష్టికి సజ్జనుల ప్రవర్తన ఆశ్చర్యంగా తోస్తుంది. తమలో ఏ కొంచెం విశేష ప్రతిభ ఉన్నా, ఇతరులకంటే తమకు కొంచెం సంపద అధికంగా ఉండినా, మిడిసి పడుతూ అహంకరించటం లోక సహజం. కానీ, సజ్జనులు అణకువతో ఒదిగి ఉండటం వననే ఔన్నత్యాన్ని పొందుతారు. అలాగే ఇతరులలోని సుగుణాలను గుర్తించి వారిని ప్రశంసించడం ద్వారా తమ ఔదార్యాన్ని చాటుకుంటూ, తమ గుణోన్నతిని ప్రకటించుకుంటూ ఉంటారట. పరోపకారం ద్వారానే తమ కార్యాలనూ సాధించుకుంటూ ఉంటారట. తమను కఠినంగా నిందించేవారిని సైతం క్షమించటం ద్వారా వారే దుఃఖపడేటట్లు చేస్తారట. భర్తృహరి చెప్పినట్లు ఈ సౌజన్య మూర్తుల తత్త్వం విడ్డూరంగానే ఉంది కదా.
ఈ శ్లోకాన్ని కొంచెం పరిశీలనాత్మకంగా చూసినపుడు మహనీయుల సౌజన్య, సౌశీల్యం, ఔదార్యం మనకు బాగా అర్థమవుతాయి. వారి మొదటి లక్షణం నమ్రత. అవసరమున్నా, లేకున్నా, తమను గురించి తామే ఎక్కువగా పొగడుకుంటూ , డాంబికాన్నీ ప్రదర్శించేవారూ, తమలో లేని శక్తినిఉన్నట్టుగా చాటింపు వేసుకుంటూ, ఉత్తర కుమారుని లాగా ప్రగల్భాలు పలికేవారు. శక్తి, నైపుణ్యం ఉన్నా అవసరానికి ఉపయోగించుకోగల నేర్పులేనివా ఇలా రకరకాల సామాన్య ప్రవృత్తులు గలవారు సమాజంలో ఎక్కువగా కనబడుతుంటారు. కానీ, అవసరమైనపుడు మాత్రమే తమ శక్తియుక్తులను బయటపెడుతూ ఇతర సమయాల్లో నిండు కుండలాగా నిశ్చలంగా ఉంటూ అణకువగా ప్రవర్తించడం చేతనే ఉన్నతి పొందడం మహనీయులకు మాత్రమే పట్టుబడే ఒక నేర్పు.
సజ్జనుల రెండవ లక్షణం
పరగుణ కథనైః స్వాన్గుణాన్ఖ్యాపయంతః - ఇతరుల లోని సుగుణ సంపత్తిని ప్రశంసించడం ద్వారానే తమ గుణోన్నతిని ప్రకటించడం. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్నట్లు గుణవంతుడే ఎదుటివారిలోని గుణాలను గుర్తింపగలుగుతాడు. మంచివాళ్లను చూసి అసూయ చెందటం, వారిని విమర్శించడం , గేలి చేయడం, వీలైనప్పుడల్లా సూటిపోటీ మాటలతో వారి మనసులను కష్టపెట్టడం ఇది లోకం తీరు. కానీ, ఎదుటివారిలోని సుగుణాలను గుర్తించి , ప్రశంసించి ప్రోత్సహించాలంటే అందుకు క్షమ, శాంతి, దయలతో కూడిన మంచి హృదయం కావాలి. పరులలోని మంచిని గుర్తించి ప్రశంసించడం ద్వారా తమ సహృదయాన్ని వెల్లడించటం, ఆ పొగడ్త కూడా నిష్పాక్షికంగా, నిస్వార్థంగా, నిండుమనసుతో చేయడం అనేది ధీమంతుల రెండవ గుణం.
స్వార్థాన్నంపాదయంతో వితత పృథు తరారంభ యత్నాః పరార్థే ఇతుల కార్య సాధన కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేయడం ద్వారానే తమ పనులను పూర్తి చేసుకోవడం అనేది సజ్జనుల మూడవ లక్షణంగా చెప్పబడింది.
‘తమ కార్యంబు పరిత్యజించియుపరేచ్ఛాప్రాపకుల్ సజ్జనుల్’అంటుంది నీతి శతకం. తమ స్వార్థాన్ని ప్రక్కకు పెట్టి పరోపకారం కోసమే జీవించగలగడం, మహానుభావులకే సాధ్యం. తమ కుటుంబ క్షేమాన్ని గురించి జీవించిన వారిని లోకం ఎన్నడూ మరువదు. మహనీయుల నాల్గవ లక్షణం-
‘క్షాన్వైవాక్షేప రూక్షాక్షర ముఖ ర ముఖాన్ దుర్జనాన్ దుఃఖయంతః’ తమను అనవసరంగా దూషించే దుర్జనులకు ఉపేక్షించడం ద్వారానే బాధించడం, అకారణంగా తమ మనస్సులు బాధపడేటట్లుగా కటువుగా నిందించేవారిని శియించే దక్షత కలిగి ఉంటే సహించగలగడం సులభం కాదు. ఎందుకంటే మాటకు మాట దెబ్బ అన్నది లోకం తీరు.
శక్తికలిగి ఉండీ క్షమించేవాడు, పేదరికంలోమగ్గుతూ కూడా తనకు చేతనైనంత దానం చేయగల ఔదార్యం కలవాడు, ఈలోకంలో పుణ్యపురుషులు.
తనను నిందించిన వాడిని తిరిగి నిందించడం వలన కలహమేర్పడుతుంది. కలహం వలన మన మనస్సు వికలమవుతుంది. కలహప్రియులైనవారికి అది ఆనందాన్నిస్తుంది. దానితో వాళ్లు మళ్లీ మళ్లీ మనతో వాగ్వాదానికి దిగుతారు. సమయం వృథా అవుతుంది. మన మనస్సుకు కష్టం నివారించాలంటే దుర్మార్గులను ఉపేక్షించాలి.
అది మన చేతకాని తనమని లోకం అనుకున్నా ఫర్వాలేదు. నిదానంగా మన గొప్పదనం బయటపడుతుంది.‘ క్షమియించువారిగని చాలమి పెట్టుదురైననున్ తలంపననూన క్షమయు కడు మెరయుతొడవుత్తమ రూపము కోరువారుతాల్తురు దానిన్’ అంటుంది భారతం. తడవొర్వక, యొడలోర్వక, కడు వేగం బడచిపడిన కార్యం బగునే?, తడవొర్చిన యొడలోర్చిన, చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతీ
కనుక అణకువ, ఔదార్యం, పరోపకారబుద్ధి, క్షమాగుణం, అనే నాలుగు గుణాలు సౌజన్యానికి నాలుగు ప్రతిబింబాలు. కీర్తికారణాలు కూడా.

- గొల్లాపిన్ని సీతారామశాస్ర్తీ