Others

మహిళా శక్తి అచంచలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా సాధికారత.. నడుస్తున్న చరిత్రలో సందర్భసహిత నినాదం. మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి. అందుకు అవిశ్రాంత కృషితో అడుగులు వేయాలి. మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నమిది. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు మానసికంగా, భౌతికంగా సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అప్పుడే సమాజం కూడా పటిష్టవౌతుంది. ఆడపిల్ల జాతి గౌరవానికి ప్రతీక. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇటీవల మనం వింటున్న భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరం. ఆమెను మనమందరం రక్షించుకుందామన్న సంకల్పం మన మనస్సుల్లో మెదలాలి. మెరియాల్సి ఉంది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందన్న మాట నిజమయ్యే తరుణం ఇకనైనా ఆసన్నం కావాలని అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నారు.
మన సమాజంలో ఎన్నో అసమానతలు. ఇది మహిళారంగానికీ వర్తిస్తోంది. లింగ వివక్ష కారణంతో ఆమె ఛీత్కారాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పనిచేసేచోట, ఉద్యోగ వ్యవస్థలో ఇది మామూలుగా జరుగుతున్నదే. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఈ వివక్షపై ఎన్నో సంఘటనలు, అత్యాచారాలు, అవమానాలు.. చివరికి హత్యాచారాలు ఎక్కడోచోట ఉండటం మనం ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో వింటూనే వున్నాం.. కంటూనే ఉన్నాం. వాస్తవానికి ఇవి రూపుమాపేలా వ్యవస్థీకృత మార్పులు రావాల్సి ఉంది. పదునైన చట్టాలు అమలుతోపాటు మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, అడుగుజాడల్లో మార్పురావాలని అనుకోవడం అభిలషణీయం. లక్ష్యసాధనలో మహిళలు ముందుంటున్నారని అంతర్జాతీయ నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి. మహిళల్లో అంతర్లీనమైన సృజనాత్మకతను వెలికితీసే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. ఈ దిశగానే ప్రభుత్వాలు, పాలకులు చొరవ చూపినప్పుడే ఫలవంతవౌతుంది. ఉదాహరణకు మహిళలను ప్రోత్సహించడానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించాల్సి ఉంది. పథకాలెన్ని ఉన్నా, ఫలితాల సాధనకు లోతైన విశే్లషణ, పరిశోధన జరిగినప్పుడే అర్థవంతవౌతుంది.
సమకాలీన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో గృహహింస సింహభాగం ఆక్రమిస్తోంది. రోజూ పత్రికల్లో, టీవీల్లో ఎక్కడోచోట ఈ దుష్క్రత్యాలపై వార్తలు వస్తూనే ఉన్నాయి. లింగ వివక్ష, ఆర్థిక అసమానతలుసహా అనేక అంశాలు ముడిపడి ఉన్నందున ఈ తీవ్ర సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలన్నది ఆ సంఘాల ఆకాంక్ష. తొలుత ఈ గృహహింసపై కుటుంబపరంగానే ఆదిలోనే చరమగీతం పలకాలని మహిళా నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రం, కేంద్రం స్థాయిలో ఈ తరహా సమస్యలపై దృష్టిపెట్టాలన్నది పలువురి ఆలోచనగా ఉంది. పోరాటం సలిపే మహిళలు, ఔత్సాహికులతో చర్చావేదికలను ఏర్పాటుచేసేలా కృషిజరగాలి. అప్పుడే గృహహింస కట్టడికి కొంతైనా అవకాశమేర్పడుతుంది.
సమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానంలాంటిది. మన చట్టసభల్లో పురుషులకు దీటుగా ప్రాతినిధ్యం కొరవడటం ప్రతిబంధకవౌతోంది. వారి భాగస్వామ్యం, వాయిస్ పెరిగితేనే ఫలవంత చర్చకు దారితీస్తుంది. మహిళలకు రాజకీయాధికారం వస్తే సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా మరింత ఎదుగుతుంది. చట్టసభల్లో ప్రతిచోటా వారికున్న రిజర్వేషన్లు పెంపుదల, ఆచరణాత్మక చూపటం పాలకులు, ప్రభుత్వాల సంకల్పమైతే మహిళాభ్యుదయం ద్విగుణీకృతవౌతుంది. అలాగే ఆర్థికంగా సమాన వాటాను దక్కించుకునేందుకు మహిళాలోకం ప్రయత్నించాలి. వీటన్నింటికితోడు మహిళలు వారికున్న హక్కులపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాల్సి ఉంది. చట్టాలపరంగా చూస్తే ఇటీవల నిర్భయ, దిశ చట్టాల అమలు ఇకనైనా పదునెక్కాలని మహిళామణులు గట్టిగా నినదించటం, సమాజంలోని విజ్ఞులందరూ నిర్భయ, దిశ ఉదంతాలను ముక్తకంఠంతో ఖండించడం ప్రత్యేకించదగ్గ పరిణామం. ఇప్పుడే వెలుగులోకి వచ్చిన దిశ చట్టం అమలుపై పలువురు ఎదురుచూడటాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఈ చట్టాలతోపాటు అసలు మహిళలపై జరిగే అకృత్యాలు, నేరాలపై ఉన్న చట్టాలు, సెక్షన్లపై ఇప్పుడిప్పుడే పత్రికలు, ప్రసారమాధ్యమాల ద్వారా ఎంతో తెలుసుకోగలుగుతున్నారు. అవసరమైనచోట, అవసరమైన సందర్భంలో తమ శక్తియుక్తులను మహిళలు ప్రదర్శించాలి. తమ గౌరవాన్ని కాపాడుకోవడంతోపాటు తెగింపుప్రదర్శన ఎల్లప్పుడూ వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. సమాజంలో ఎదురవుతున్న అకృత్యాలు, ఆగడాలను ధైర్యంగా మహిళలు ఎదుర్కొనటాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఇవి ఇంకా ఇంకా పెరగాల్సి ఉంది. స్వీయ రక్షణతోపాటు మహిళలు తమకిష్టమైన విద్య, పరిశోధన ఇత్యాది రంగాల్లో రాణించి మేధోశక్తిని చాటాలన్నది అందరి మాట.
ప్రభుత్వపరంగా మహిళల రక్షణకు, వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల్లో ఎంతో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ పురోగతి కన్పిస్తోంది. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఉదాహరణకు.. అందరూ మహిళలే నడిపే రైళ్లు, పనిచేసే రైల్వేస్టేషన్లకు శ్రీకారం చుట్టడం గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. లేచింది మహిళాలోకం అన్న చందంగా ఈ కార్యక్రమాలు రూపొందడం శుభసూచికమే. ఇక ఉద్యమాల్లో సైతం వారి భాగస్వామ్యం ఎంతో పెరగడమూ పేర్కొనదగినదే. అలాగే కోర్టులపరంగానూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడమూ మంచి పరిణామమే. గతానికి భిన్నంగా సైన్యంలో మహిళా కమాండర్ల నియామకానికి సుప్రీంకోర్టు జెండా ఊపడం వారి అభివృద్ధి దిశగా పయనించేందుకు మార్గమేర్పడింది. సైన్యంలో మహిళా అధికారులకు కమాండర్లుగా అవకాశమిచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తద్వారా సైన్యంలో కొనసాగుతున్న లింగ వివక్షకు అత్యున్నత న్యాయస్థానం తెర దించింది.
రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్రాలు, పాలకులు, సమాజం అంతా కలిసికట్టుగా వ్యవహరించి మహిళల అభ్యున్నతికి పాటుపడాలి. గౌరవప్రదమైన గుర్తింపు సమానావకాశాలు ప్రాతిపదికన చర్యలుండాలని అందరి అభిలాష. వివక్షను రూపుమాపేందుకు వినూత్న చర్యలు మరిన్ని తీసుకోవాలని మహిళాలోకం ఆశిస్తోంది. జాతి నిర్మాణంలో వారిని భాగస్వాముల్నిచేస్తే అభివృద్ధి ఉభయతారకవౌతుంది.

- చెన్నుపాటి రామారావు, 9959021483