Others
బంగారం కొంటున్నారా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పండుగరోజుల్లో రవ్వంత బంగారం అయినా కొనుక్కోవాలనుకుంటారు మహిళలు. బంగారం కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం డబ్బు నష్టపోవడం ఖాయం అంటూ కొన్ని సలహాలను ఇస్తున్నారు నిపుణులు.
* 916 క్యారెట్ బంగారంలో 99 శాతం స్వచ్ఛత ఉంటుంది. అలా ఉన్న వాటిపై హాల్‌మార్క్ గుర్తు ఉంటుంది. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిస్) నిర్ణయిస్తుంది. బంగారంలో వందశాతం స్వచ్ఛత ఉంటే మాత్రం దానికి 916 నాణ్యతతో పాటు హాల్‌మార్క్ ముద్రకు అర్హత పొందుతుంది. కాబట్టి ఎంత చిన్న వస్తువు అయినా సరే.. ఈ విషయాన్ని గమనించుకోవాలి.
* బంగారం బిల్లు కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్‌వాయిస్ కాగితం మీదే బిల్లు వేయించాలి. కంప్యూటర్ బిల్లు అయితే ఇబ్బంది ఉండదు. ఇక అర గ్రాము బంగారం కొన్నా సరే.. దానికి వచ్చే బిల్లును తప్పనిసరిగా దాచుకోవాలి. భవిష్యత్తులో బంగారం మార్చేటప్పుడు ఎప్పుడైనా, అమ్మేటప్పుడైనా అది చాలా ఉపయోగపడుతుంది.
* రాళ్ల నగలు కొనేముందు.. వేటిని ఎంత బరువులో ఎంచుకుంటున్నారనేది ముందే నిర్ధారించుకోవాలి. అలాగే వాటితో కలిపే నగ ధరను నిర్ణయించారా లేదా విడిగా అనేది తెలుసుకోవాలి.
* స్వచ్ఛమైన బంగారం అని చెప్పి దుకాణదారు మోసం చేస్తే.. వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. డబ్బును తిరిగి పొందవచ్చు. ఇందుకు బిల్లు ఉండడం తప్పనిసరి.
* ఒకవేళ బంగారాన్ని నాణేలు, కడ్డీల రూపంలో కొంటున్నట్లయితే.. దుకాణాల కన్నా బ్యాంకులను ఎంచుకుంటే.. నాణ్యత విషయంలో భయపడాల్సిన అవసరం ఉండదు.