Others

పరీక్షా సమయాల్లో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తినే సమయంలో కూడా పరీక్షల గురించి ఆలోచించరాదు. సరిగా తినకపోవడంవల్ల కలిగే నీరసం కారణంగా చదవాలనిపించదు. అలా అని ఎక్కువగా ఉన్నా కూడా ప్రమాదమే. మితహారం చాలా మంచిది. పప్పుదినుసులు, పాలు, గుడ్లు, ఆకుకూరలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. మసాలా, నూనె పదార్థాలు తీసుకోవద్దు. అరటిపండుతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. స్వీట్లు, శీతల పానీయాలు, పానీపూరి, చాక్లెట్లకు దూరంగా ఉండాలి. అల్పాహారంగా ఇడ్లీ, దోశె, అటుకులు మంచిది. మధ్యాహ్నం అన్నంలో పప్పు, కూరగాయల సలాడ్ తీసుకుంటే మంచిది. రాత్రి అన్నం బదులుగా చపాతి, జొన్నరొట్టె, మసాలా లేని, నూనె తక్కువగా ఉండే కూరలను తినాలి. ఈ సమయంలో సమతుల ఆహారం చాలా అవసరం. టీ, కాఫీల జోలికి వెళ్లకపోవడం మంచిది. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఆహారం జ్ఞాపశక్తిపై ప్రభావం చూపిస్తుందన్న విషయం మరవద్దు. ప్రతిరోజూ ఖచ్చితంగా విటమిన్ ‘డి’కోసం సూర్యకిరణాలు తాకేలా ప్లాన్ చేసుకోవాలి. డి విటమిన్ మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంవల్ల వారిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. పరీక్షలంటే ఆందోళన కలిగిస్తే సరిగ్గా భోజనం చేసే పరిస్థితి కూడా ఉండదు. ఆత్మవిశ్వాసమే బలం. దీనికి మించిన టానిక్ లేదు. ఒత్తిడిని జయించడం కూడా మన చేతుల్లోనే ఉంది. పరీక్షల సమయంలో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని తీరుస్తుండాలి. విద్యార్థులు కొన్నిసార్లు వేళకి భోంచేయరు. అటువంటి సమయంలో ఇష్టమైన వంటలు చేసిపెట్టాలి. పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. కావలసినంత శుభ్రమైన నీరు తాగమని చెప్పాలి. ఆరోగ్యమే మహాభాగ్యం.

-కె.రామ్మోహన్‌రావు