Others

అది మహాక్రతువు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరానికి తూకంవేసే కాలం అదే... చలి కాలానికీ, ఎండా కాలానికీ మధ్య సంధికాలం అదే పరీక్షాకాలం వచ్చేసింది. మార్చి మొదటివారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు. అవి అయిపోగానే పదో తరగతి పరీక్షలూ ఆ తర్వాత వచ్చే డిగ్రీ, పీజీ మరియు పోటీపరీక్షలు ఇలా వారు చదివిన చదువులను పరీక్షలతో కొలుస్తున్నాము. ఒత్తిడిని జయించడం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మోటివేట్‌లు, కౌన్సిలింగ్‌లు వెరిసి విద్యార్థుల్లో ఒత్తిడిని జయించి, పరీక్షలు విజయవంతంగా రాయవలసి ఉంది. అంతేకాదు వీటికితోడు ప్రధాన పాత్ర పోషించే మరో అంశం ఏమిటంటే? ఏడాదంతా తరగతుల్లో విని, చదివి, వీటిని మళ్ళీ ఏకాగ్రతతో పునఃశ్చరణ చేసుకుని వార్షిక పరీక్షలలో బాగా రాసి మంచి మార్కులు సాధించుకోవాలనే తపనకు తోడు.. పాలకులు, అధికారులు పరీక్ష నిర్వాహణ (సౌకర్యా)లు వారికి మంచి వాతావరణం కల్పిస్తేనే ఒత్తిడికి లోనుకాకుండా ఉత్సాహంగా పరీక్షలు రాస్తారు. గతేడాది కొన్ని పరీక్షా కేంద్రాలలో వౌలిక సదుపాయా(వనరు)ల ఏర్పాటులో చాలా లోపంవల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలు పునరావృత్తం కాకుండా గుర్తించి పరిష్కరిస్తేనే మంచి ఫలితాలు సాధించబడుతాయి. కొన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, పరీక్షలు రాయడానికి, కూర్చోవడానికి బల్ల(డెస్కు)ల సౌకర్యాలు లేవు. నేలమీదనే, ఆరుబయటనే కూర్చోబెట్టి పరీక్షలు రాసిన సంఘటనలు కోకొల్లలు చూశాము. భూతాపం కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ఈ ఏడాది మార్చి రెండవవారం నుండే ఎండలు పెరుగుతుంటాయంటున్నారు. ఇలా ముందస్తు ఎండల ప్రతాపం 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో మార్చినెల మండిపోనుందని భారత వాతావరణశాఖ (ఐం.ఎం.డి.) హెచ్చరికలను కూడా పాలకులు పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ఏర్పాటుచేయాల్సి ఉందని గమనించండి. ఐదేళ్ళకు ఒకమారు జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి, ఎన్నికల సిబ్బంది, ఓటర్లు అరకొర సౌకర్యాలతో ఓటును వేయాల్సి వస్తుంది. అవి దేశ, రాష్ట్ర పాలకులకు జన్మనిచ్చేవైతే, ఇవి ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్‌ను నిర్ణయించు(నిర్ధారించు)కునే అతి కీలకమైన ఘట్టం పరీక్షలు. అవి నిర్వహించేది పరీక్షా కేంద్రాల్లోనే కాబట్టి, సుమారు 15-20 ఏండ్లు అకుంఠిత దీక్షతో రాత్రింబవళ్లు లెక్కచేయక కళ్ళలో ఒత్తులు పెట్టుకొని చదివి తమ భవిష్యత్‌కు బాటలుపరుచుకొనే పరీక్ష కేంద్రాలకు ఎలాంటి కొరతలేకుండా సకల సౌకర్యాలను ఏర్పాటుచేయాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉందని మరవకండి.
పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మదింపు నుండి ఫలితాల ప్రకటన వరకు నిర్వాహకులు, అధికారులు ఓ మహాక్రతువు (యజ్ఞం)లా భావించాలి. గతంలోనే అనేక తప్పులుదొర్లి విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి. పరీక్షల మదింపు కేంద్రాలవద్ద ప్రశ్నాపత్రాలను మదించే (దిద్దే) విషయ నిపుణులకు సరైన సౌకర్యాలతోపాటు శాస్ర్తియంగా వారికి ఇవ్వవలసినంత మేరకే ప్రశ్నపత్రాలను ఇవ్వాలి. ఇబ్బడిముబ్బడిగా ఎక్కువగా ఇవ్వరాదు. తగు సమయంలో నిష్టతో ప్రశ్నపత్రాలను ముద్రించాలి, క్రాస్‌చెకింగ్ జరగాలి. ఇది విద్యార్థుల భవిష్యత్ జీవితాలకు సంబంధించిన అంశమని మరువరాదు.
ఈ పరీక్షలు ఒక విద్యార్థులకు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులకు, సమాజానికి దేశ, రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే రేపటి తరానికి జరుగుతున్నాయన్న విషయాన్ని మరువరాదు. ప్రపంచంలో ఏ మూలన ఏవి జరిగినా ఇట్టే కనిపెట్టే శాస్త్ర సాంకేతికత ఉన్న ఆధునిక కాలంలో ఉన్న మనం విద్యార్థుల పరీక్ష కేంద్రాలకు అరకొర సౌకర్యాలను అధిగమించలేమా! ప్రశ్నపత్రాల, మదింపు అవకతవకలు జరగకుండా ఆపలేమా! ఈ విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం చేయకూడదు. వెంటనే ప్రభుత్వాలు గూగుల్ మ్యాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాలను గుర్తించి జిల్లా, రాష్ట్రాలస్థాయిలో అధికారిక కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేసుకొని పర్యవేక్షణ, సౌకర్యాల కల్పన చేయాల్సి ఉంది. ప్రధానంగా విద్యార్థులపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావాన్ని చూపే తాగునీటి వసతి, మరుగుదొడ్లు, రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, బల్బులు, కూర్చోవడానికి కుర్చీలు, బల్లలతో పాటు సరైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లను కల్పించాలి. అలాంటప్పుడే విద్యార్థులు ప్రశాంతంగా ఒత్తిడి అధిగమించి పరీక్షలను వ్రాయగలుగుతారు. ప్రెజర్ రిలీజ్ వాల్వ్ లేకపోయినా, వెయిట్ పెట్టే గొట్టం పూడుకపోయినా ప్రెజర్‌కుక్కర్ పేలిపోతుంది. ఒత్తిడి కూడా అలాంటిదే... ఒత్తిడికి ఎప్పటికప్పటికీ వదిలించుకుంటేనే సృజనాత్మకంగా ఆలోచించగల్గి పరీక్షలను జయించగలరు. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఏ పని అయినాసరే ‘నేను చేయగలను’అనే ఆత్మవిశ్వాసం (నమ్మకం)తో మొదలుపెడితే తప్పకుండా చేయగలరు. అవి పరీక్షలైనా అంతే..! బాగా రాయగలం అనుకుంటే రాసేస్తారంతే..!
విద్యార్థులకు ఇంకోమాట.. మార్కులే ప్రతిభకు కొలమానాలు కాదు? ఈ మార్కుల వేటలో పోటీ ధోరణులను తట్టుకోలేక మధ్య దిగువ, తరగతుల విద్యార్థులు ఫలితాల అనంతరం ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు మారాలి. మార్కులే జీవితంకాదు సుమా! ఇంకా మీరు జీవితంలో అనేక విజయాలు పొందాల్సి ఉంది. మీ బంగారు భవిష్యత్తుకై ఇష్టమైన రంగంలో శ్రమిస్తే గొప్పవాళ్ళుగా ఎదగవచ్చు. గొప్పవాళ్ల చరిత్రను చూస్తే... సచిన్ ఎన్నోసార్లు పరీక్షలు తప్పినా నిరాశ చెందకుండా తనకిష్టమైన క్రికెట్‌ను ఎంచుకుని రారాజుగా వెలుగొందారు. ఐన్‌స్టీన్ చిన్నప్పుడు మాటలు రాకపోయినా సృజనాత్మకంగా ఆలోచించి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇలా చాలామంది గొప్పవాళ్ళ చరిత్రల్లోకి వెళితే జీవితం ఎంతో విలువైందని తెలిసిపోతుంది. పరీక్ష బాగా రాయలేదని కుంగిపోకుండా... మార్కులు ప్రతిభకు కొలమానం అసలేకాదని గమనించాలి. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ నిస్పృహలకు లోనుకావద్దు. ‘‘ఆత్మవిశ్వాసంకన్నా గొప్ప ఆస్తిలేదు’’ అన్నది ఒక్కటే జీవితం... సంపూర్ణంగా జీవించాలి చదువులు మనిషికి విలువనద్దాలి. సమగ్రంగా ఉన్నతీకరించాలి, అభ్యుదయం వైపు నడవాలి. అదే అంతిమ లక్ష్యం..

- మేకిరి దామోదర్, 9573666650