Others

సర్వ మానవ సమానత్వం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాతి వివక్షత అనేది ఆంగ్లేయులు వ్యాపింపచేసిన అంటువ్యాధి’అంటారు ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. 18వ శతాబ్దంలో ప్రారంభమయిన పారిశ్రామిక విప్లవం పేద, ధనిక వర్గాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది. మానవ జీవితాలలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది. వనరుల కొరత కారణంగా ఆంగ్లేయులు వ్యాపారం పేరుతో ఆఫ్రికా, ఆసియాలలోని పలు దేశాలకువచ్చి విభజించు, పాలించు అను సిద్ధాంతంతో ఆయా దేశాలను తమ వలస రాజ్యాలుగా మార్చుకొన్నారు. శే్వత జాతీయులు అందరికంటే తామే గొప్పవారమని, తాము ఇతర దేశాల ప్రజలను సంస్కరించడానికే వచ్చామని భావించారు. వారియొక్క అధికార బలంతో అహంభావాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా వున్న నల్లజాతీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చారు. వారియొక్క హక్కులను కాలరాసారు. 1960 మార్చి 21న దక్షిణాఫ్రికాలోని ప్రజలు తమ హక్కులకోసం శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జరుపగా 69 మంది మరణించారు. వారి స్మారకార్థం ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మార్చి 21న ‘అంతర్జాతీయ జాతి వివక్షతా వ్యతిరేక దినోత్సవంగా’ జరుపుతుంది. జాతిపిత మహాత్మాగాంధీ సైతం దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతను ఎదుర్కొన్నారు. ఆంగ్లేయులు తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, ఇతర దేశాలలో మాత్రం నియంతృత్వాన్ని ప్రదర్శించి ప్రజలను నానాఇబ్బందులకు గురిచేస్తారు. అమెరికాలో మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, ఆఫ్రికాలో నెల్సన్‌మండేలా వంటి మహనీయులు నల్లజాతీయుల హక్కులకోసం పోరాడారు. 1948లో ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసినప్పటికీ ఈ హక్కులు సమాజంలో ధనిక, ఆధిపత్యవర్గాలకే లభిస్తున్నాయి. ఈ ప్రకటన ఆధారంగా ఆయా దేశాల సర్వమానవ సమానత్వంకోసం పటిష్టమైన రాజ్యాంగాలను రూపొందించాయి. అయితే వాటి అమలుతీరులో లోపాల వలన పేదవారికి సమానత్వం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది.

- య.రాంప్రదీప్, 9492712836