Others

దటీజ్ ఆలియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ మల్హోత్రా, ఆలియా ప్రేమాయణంపై -మీడియా కథనాలు కొత్తేం కాదు. అందుకు అనుగుణంగానే ఆలియా వ్యవహార శైలీ ఉంటుంది కనుక -ఇందులో వింతేంలేదు. కథలు, కథనాలు అల్లుకునే సినీ మీడియాకు ఈసారీ ఆలియా మరో షాక్ ఇచ్చింది. ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ -తన ప్రియుడి మీదున్న ప్రేమను ఒక్కమాటలో చెప్పింది. ‘ఒక ద్వీపంలో మీరు గడపాల్సి వస్తే -కంపానియన్‌గా ఎవరిని ఎంచుకుంటారు. రొమాన్స్ చేయాల్సి వస్తే ఎవరిని ఇష్టపడతారు?లాంటి కొంటె ప్రశ్నిల్ని వ్యాఖ్యాత సంధించినపుడు -ఆలియా తడుముకోకుండా సిద్దూ పేరు జపించింది. వ్యాఖ్యాత ఇచ్చిన ఆప్షన్స్‌లో రణవీర్‌సింగ్, రణబీర్ కఫూర్, షాహిద్, వరుణ్‌ధావన్ లాంటి క్రేజీ కుర్ర హీరోలున్నా.. ఆలియా నోటివెంట మాత్రం ‘సిద్దూతోనే హ్యాపీ’ అంటూ బోల్డ్ సమాధానం వచ్చిందట. ఏదైమైనా సిద్దూతో గాఢంగా ప్రేమలో ఉన్నట్టు ఆలియా పరోక్షంగా ఒప్పేసుకుందని మీడియా ఆనందపడిపోతోంది. ఇదే ఇంటర్వ్యూలో ‘్ఫస్ట్‌నైట్’లాంటి తుంటరి ప్రశ్నకు కొంటె సమాధానమిచ్చి -ఆలియా తన చాతుర్యాన్ని ప్రదర్శించింది. అయితే, ఈ ఫస్ట్‌నైట్ ఆన్సర్ సిద్దూ గురించి కాదు, తన ఫ్యామిలీ గురించేనని విశే్లషణ ఇచ్చి ఆశ్చర్యంలో పడేసిందట. నీకు ఎవరంటే ఇష్టం? ఎవరంటే కోపం? ఎవరితో ఎంజాయ్ చేస్తాను? ఎవరితో డేటింగ్‌లో ఉన్నాను? ఇలాంటి ప్రశ్నలకు ఎవరైనా డైరెక్ట్‌గా సమాధానమిస్తారా యేంటి? అంటూనే -బాలీవుడ్ హీరో సిద్దార్థ మల్హోత్రాతో పీకుల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పిన ఆలియా -్ఫస్ట్‌నైట్ విషయంలో చెప్పిన ఆన్సర్ భలే ఉందని అంటున్నారు. విషయం ఏంటంటే -తాజాగా ఆలియా తన సిస్టర్ షహీన్‌తో కలిసి తల్లిదండ్రులకు కాస్తదూరంగా కొత్త కాపురం పెట్టాలని అనుకుంటోందట. ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లోకి త్వరలోనే అక్కాచెల్లెళ్లు ఆలియా, షహీన్‌లు అడుగుపెట్టబోతున్నారని వినికిడి. ‘ద ఫస్ట్ నైట్ ఇన్ ద న్యూ హౌస్ విల్ బి డెడికేటెడ్ టు మై పేరెంట్స్’ అని ఆలియా ఈ మధ్య ట్వీటు చేయడమే కాదు, ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని కొంటెగా చెప్పి ఆశ్చర్యంలో పడేసింది. ‘కొత్త ఇంట్లో తొలి రాత్రిని తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా’ అన్నది ఆమె మాట. గృహ ప్రవేశం రోజు రాత్రి అమ్మా నాన్నలతోపాటు కుటుంబ సభ్యులందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని చెబుతోంది. ‘నా జీవితంలో ఫస్ట్‌నైట్ అంటే కొత్తగా కట్టుకున్న ఇంట్లో తొలిరాత్రి జరుపుకునే ముఖ్యమైన వేడుక. అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటురాకుండా చూస్తా’ అంటోంది. ‘్ఫస్ట్‌నైట్’ ప్రస్తావన రాగానే ఏదేదో ఊహించేసుకున్న వాళ్లంతా ఆలియా సమాధానానికి, ట్వీటుకు బిత్తరపోయి -అమ్మ గడుసుపిల్లా అంటున్నారు. -

శ్రీను