Others

ఆ ‘రస’గుల్లాలు తింటే ఒళ్లు గుల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రసగుల్లాలంటే బెంగాలీ రసగుల్లాలే- నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయ్’’ అంటూ రెడీమేడ్ రసగుల్లా డబ్బాలూ, సీసాలూ కొనుక్కునే తీపి ప్రియులారా! బహుపరాక్! ఈ రసగుల్లాలు దొంగ ‘పాలు’ అంటే కృత్రిమంగా తయారుచేసిన క్షీరములతో నిషేధించిన రసాయనాల సాయంతో చేస్తున్నారుట.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల సరిహద్దుల్లో వున్న ఒక మురికివాడలో రసగుల్లా ‘కాలనీ’ వుంది. అక్కడ ఆరు అక్రమ మిఠాయి తయారీ పాకశాలలున్నాయి. ఆ ప్రాంతాన్ని ‘హర్షవిహార్’ అంటారు. ఈ హర్షవిహార్ మీద మాజిస్ట్రేటుగారి ఉత్తర్వులతో దాడి చేస్తే ఆరువేల కిలోల రసగుల్లాలు- తెల్లగా తళతళలా మెరిసే రసమధురిమలు లభించాయి. చూస్తే ఓ.కె. తింటే మాత్రం ఫినిష్ బాపతులవి! విషతుల్యాలవి!
ఈ దొంగ మిఠాయిలలో నాలుగువేల కిలోల తీపి వుండల్ని నాశనం చేయనున్నారు పోలీసులు. కొన్నింటిని ప్రయోగశాలలో పరీక్ష నిమిత్తం పంపించారు. తిరుపతి లడ్డూలకే దిక్కులేదు. కనకదుర్గమ్మ ప్రసాదం లడ్డూలకే రక్షణ కావాలీ అంటున్న దేశంలో ప్రయివేటు మిఠాయిలను తిన్నవాడికి ఆయుర్దాయం వుంటే తప్ప ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. ప్రత్యామ్నాయంగా గులాబ్‌జామ్‌లు తింటే బెటర్ అంటారా? ఓ.కె.

-వీరాజీ