Others

నాకు నచ్చిన పాట నీ చరణ కమలాల నీడయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణావతారం చిత్రంలో సినారె ప్రాసలు, శృంగార భావాలు, సుతిమెత్తని ఎత్తిపొడుపులు, సరస సంభాషణా చాతుర్యంతో మనోహరంగా సాగే పాట -నీ చరణ కమలాల నీడయే చాలు/ ఎందుకో ఈ స్వామి బృందావనాలు’. ఈ పాట నాకు చాలా ఇష్టం. చెంచులక్ష్మి నుంచి ఆనాటి వరకూ సినీపాటలు సీనియర్ సముద్రాల రాయడం పరిపాటి. కానీ, ఈ చిత్రానికి ఆయన పదునైన సంభాషణలు రాశారు. కానీ, పాటలు మాత్రం సినారే రాయడం గమనార్హం. మరో విశేషణ ఏమిటంటే ఒకే పాటలు ముగ్గురు -శ్రీకృష్ణుడు, రుక్మిణి సత్యభామలుగా ఎన్టీఆర్, దేవిక, కాంచనల పాత్రలు పాడి -త్రిగళగతంగా రసరమ్యంగా పాటను తీర్చిదిద్దారు. ఘంటసాల, సుశీల, లీల పోటీపడి మరీ పాడారు. నటీనటుల హావభావాలు, భక్తి ప్రాధాన్యతతోపాటు సరస శృంగారాల ప్రవృత్తి.. చిత్రమైన పదబంధాలతో పౌరాణిక చిత్రానికి అనుగుణంగా సాగుతుంది. బృందావనాలు, నందనవనాలు, మురళీ రాగాలు, తులసి దళాలు, చరణ కమలాలు, నయన కమలాలు, ప్రణయ వనాలు, పులకింతలు లాంటి పదాలు సాహిత్యపరంగా అపూర్వ ప్రయోగాలతో సాగుతాయి. సంగీతం టివి రాజు. ఆయన అందించిన బాణీ పహాడీ రాగంతో కొత్తపుంతలు తొక్కింది. ఈ పాటలో ప్రణయ జగత్తుకి ఊయల వేసి ప్రేక్షకుల్ని అలరించారు. మేటైన నటులు, గాయకత్రయం, మధుర సంగీతం వెరసి పాట అన్ని కోణాల్లో ఆకట్టుకుని సినిమా విజయానికి కారణమైంది. సాహితీ ప్రకాండుల మెప్పుపొందింది.
.................................................................
వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

* ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
* రచనల్లో కొత్తదనం ముఖ్యం
* అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
* కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
* తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
* కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
* ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
* రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
* ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-బి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి