Others

అందాల దంతసిరి ఇలా.. (అంధమె ఆనందం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పళ్లు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పాచి, మరకలు పోతాయి. అలా మరకలు పోయాక కూడా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో బ్లీచింగ్ లేక లేజర్‌తో పళ్లని తెల్లగా చేసే ప్రయత్నం చేస్తాం. వంశపారంపర్యత కారణంగా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో కూడా బ్లీచింగ్ లేక లేజర్ చికిత్స చేస్తారు. బాధితులు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే, ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే చికిత్సా విధానాలు. మనం తినే పదార్థాలవల్ల, తాగే నీటివల్ల, మన అలవాట్లవల్ల తిరిగి పళ్లు పసుపుపచ్చగా మారేందుకు అవకాశం ఉంది.

మనస్ఫూర్తిగా నవ్వడం అందరికీ వీలుకాదు. అలా నవ్వాలంటే తెల్లగా వరుసలో వుండే పళ్లు ఉండి ఉండాలి. అలా లేనివారు ఇలా నవ్వలేరు. కొంతమంది పంటి చికిత్స అయ్యక కూడా మనస్ఫూర్తిగా నవ్వలేరు. దానికి కారణం వారికి అలా నవ్వే అలవాటు లేకపోవడం. చిన్నప్పటినుంచి పసుపుపచ్చగా లేక ఎత్తుగా వున్న పళ్లతో నవ్వితే ఎవరైనా చూసి ఏమైనా అంటారన్న భయంతో నవ్వరు. నవ్వాల్సిన సందర్భాలలో కూడా పెద్దగా నవ్వకుండా వారిని వారే కట్టుదిట్టం చేసుకుంటారు. ఇలా చేసి చేసి కొన్ని ఏళ్లకి అది ఓ అలవాటుగా మారి మనస్ఫూర్తిగా నవ్వడం వారు మర్చిపోతారు. చికిత్స అయ్యాక కూడా నవ్వేందుకు కష్టపడతారు. కొంతకాలానికి తిరిగి నవ్వడం నేర్చుకుంటారు.

అసలు పళ్లు పసుపుపచ్చగా మారడానికి గల కారణాలేంటి?
పసుపుపచ్చగా మారడానికి చాలా కారణాలు ఉండొచ్చు.
- మనం తాగే కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, రెడ్‌వైన్, ఆలుగడ్డ- వీటిని ఎక్కువగా తీసుకునేవారిలో పళ్లు పసుపుపచ్చగా మారే అవకాశం ఉంది.
- పొగాకు, తంబాకు, పాన్, గుట్కా- ఇవి తీసుకునేవారిలో పళ్లపై గోధుమ రంగు మరకలు పడి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.
- ఎదుగుతున్న పిల్లలలో వారి పాల పళ్లు లేక శాశ్వత పళ్లు నిర్మాణమవుతున్న సమయంలో ‘డాక్సీసైక్లిన్’ లేక ‘టెట్రాసైక్లిన్’ అనే మందులు వాడడంవల్ల పళ్లు తయారవడమే పసుపుచ్చగా అవుతాయి.
- పళ్లు నిర్మాణం అవుతున్న వయసులో తాగే నీళ్లలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే వారిలో కూడా పళ్లు పసుపుపచ్చగా తయారవుయి.
వయసు ప్రభావం
చాలామందిలో వయసు పైబడే కొద్ది పంటి బయటి పొర అయిన ఎనామిల్ అరిగిపోవడంవల్ల పసుపుపచ్చగా ఉండే డెంటిన్ బయటకు కనిపించి పంటి రంగు మారుతుంది.
- నోటి పరిశుభ్రత సరిగా లేని వారిలో తిన్న ఆహారం ఉమ్ముతో కలిసి పళ్లమీద పండ్ల పాచిలా పేరుకుంటుంది. కొంతమందిలో ఈ పాచి పంటి నిండా చేరి పంటినే కప్పేస్తుంది. వీరిలో పళ్లు పసుపుపచ్చగా కనిపిస్తాయి.
వంశపారంపర్యత: కొందరిలో పుట్టుకతోటే పళ్లు పసుపుపచ్చగా ఉంటాయి. వారింటిలో పసుపుపచ్చ పళ్లు తరతరాలుగా ఆనవాయితీగా సాగుతుంటుంది.
పుక్కిలించే మందులు: క్లోర్ హెక్సిడిన్, సిటిల్ పెరిడీనియమ్ అనే కెమికల్స్ ఉండే పుక్కిలించే మందులు చాలా సంవత్సరాలు వాడడంవల్ల పళ్లు పసుపుపచ్చగా మారే ప్రమాదం ఉంది.
దీనికి చికిత్స
- కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగేవారు తగ్గించడం లేక పూర్తిగా మానివేయడం చెయ్యాలి.
- పొగాకు, తంబాకు, పాన్, గుట్కా తినేవారు ఆ అలవాట్లని పూర్తిగా మానివేయాలి. ఇవి నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం అని అందరూ గుర్తించాలి.
- పుక్కిలించే మందులు వాడడం మంచిదే కానీ వాటిని నీళ్లలో సగం సగం కింద కలుపుకొని పలుచబరచుకోవడం మంచిది.
- నోటి పరిశుభ్రత సరిగ్గా లేని వాటి దంత చికిత్స అయిన తరువాత సరిగ్గా పళ్ళు తోమడం, పుక్కిలించే మందులు వాడడం, ఏడాదికొకసారి దంత వైద్యుణ్ని సంప్రదించడం చెయ్యాలి.
పై వివరించబడిన సందర్భాలలో పళ్లు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పాచి, మరకలు పోతాయి. అలా మరకలు పోయాక కూడా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో బ్లీచింగ్ లేక లేజర్‌తో పళ్లని తెల్లగా చేసే ప్రయత్నం చేస్తాం. వంశపారంపర్యత కారణంగా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో కూడా బ్లీచింగ్ లేక లేజర్ చికిత్స చేస్తారు. బాధితులు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే, ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే చికిత్సా విధానాలు. మనం తినే పదార్థాలవల్ల, తాగే నీటివల్ల, మన అలవాట్లవల్ల తిరిగి పళ్లు పసుపుపచ్చగా మారేందుకు అవకాశం ఉంది. అందుకే బ్లీచింగ్ లేక లేజర్ చికిత్సా విధానాలు ప్రతి 9 నుండి 12 నెలలకొకసారి చేయించుకోవాల్సి వుంటుంది. బ్లీచింగ్ లేక లేజర్ విధానాలు అస్సలు నొప్పి లేని చికిత్సా విధానాలు.
బయటకు రావడమే పసుపుపచ్చగా వచ్చే పళ్లు వాటి నిర్మాణ దశలోనే (్ఫ్లరైడ్ లేక టెట్రాసైక్లిన్‌వల్ల) అలా తయారై ఉంటాయి. వీరిలో, వయసు పైబడినవారిలో ఎనామిల్ పొర పోవడంవల్ల పసుపుపచ్చగా మారిన పళ్లకి ఒకవైపే ఉండే తొడుగుల్ని (వినియర్స్) పెట్టే ప్రయత్నం చేస్తారు. నవ్వినపుడు కనిపించే పంటి భాగాన్ని ఈ తొడుగుల ద్వారా కప్పివేస్తారు. వేరే సమస్యలు తోడైన పళ్లకి క్యాపు తొడిగే ప్రయత్నం చేస్తారు.
ఓసారి పెళ్లిచూపులకి వెళుతున్న ఓ కుర్రాడు తన పళ్లకి అంటిన గుట్కా మరకల్ని తీసేయమని అడిగాడు. క్లీనింగ్ చేసాం. క్లీనింగ్ తరువాత పళ్లని చూసుకొని ‘అదేమిటి, పసుపుపచ్చగా ఉన్నాయి, తెల్లగా కాలేదు’ అని అడిగాడు. ‘క్లీనింగ్ చేస్తే మరకలు పోతాయి. పళ్లు తెల్లగా కావు. పళ్లు తెల్లగా కావాలంటే బ్లీచింగ్ చేయాలి’ అని చెప్పాను . ‘చెయ్యండి’ అని ఆ కుర్రాడు బ్లీచింగ్ చేయించుకున్నాడు. ఓ ఏడాది తర్వాత మళ్లీ వచ్చాడు. పళ్లనిండా గుట్కా మరకలు. ‘పెళ్లయిందా?’ అని అడిగా. ‘అయింది కానీ రెండు నెలలుగా కలిసిలేం. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది’ అని బాధపడ్డాడు. ‘‘ఏం చేసింది’’ అని నేనన్నదానికి ‘‘పెళ్లిచూపుల్లో చందమామ లాంటి ఆమె ముఖం చూసి మనసు పారేసుకున్నా. పెళ్లికి సరే అన్నా.
కానీ తర్వాత మెల్లగా ఆమె ముఖంపై తెల్లని ఛాయ తగ్గడం మొదలైంది. ఎందుకని ఆరా తీస్తే తనేదో లేజర్ చికిత్స చేయించుకోవడం వల్ల తెల్లపడిందని, ఆమె అసలు రంగు చామనఛాయ అని చెప్పింది. లేనివి చూపించి పెళ్లి చేసుకోవడం మోసం కాదా’’ అని అడిగాడు. ‘లేజర్’ చేయించుకొని తెల్లబడడం ఆమె చేసిన మోసం అయితే, మరి నువ్వు చేసిందేంటో. అందరూ అందంగా కనిపించాలనే అనుకుంటారు. అవగాహన ఉన్నవాడు వైద్యశాస్త్రాన్ని వాడుకుంటాడు. లేనివాడు వాడుకోడు. నువ్వు పళ్లని తెల్లబరచుకుంటే ఆమె తన ముఖాన్ని తెల్లబరచుకుంది. చెల్లుకి చెల్లు.
*

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

-డాక్టర్ రమేష్ శ్రీరంగం