Others

వీళ్లే.. అసలు శిల్పులు (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానుసారం పాత్రకు అనుగుణంగా మేకప్ వేయడం చిన్న విషయమెమీ కాదు. కనిపించని కష్టం ఎంత ఉందో, మేకప్‌మెన్ మెళకువలు కూడా ఇక్కడ చాలా ముఖ్యం. కొంతమంది హీరోలు మేకప్ కోసం నైపుణ్యం కలిగిన పర్సనల్ మేకప్‌మన్‌లను ఏర్పాటు చేసుకుంటారు కూడా. సినిమాల ప్రారంభ దశనుంచే మేకప్ రంగం చిత్ర నిర్మాణంలో ముఖ్య భాగమైంది. ఎన్టీఆర్ నటించిన ‘సొంత ఊరు’ చిత్రంలో ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తారు. 1956లో విడుదలైన ఆ చిత్రంలో కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ప్రజాదరణ పొందలేకపోయారు. ఇక కృష్ణుడి పాత్రలో అభిమానులను నిరుత్సాహపర్చకూడదని భావించారు. మాయాబజార్ చిత్రంలో విజయా సంస్థ నిర్మాతలు కృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్‌ని బుక్ చేసినప్పుడు, మొదట నో అన్నారట. చిత్ర దర్శకుడు కెవి రెడ్డి -ఆ పాత్ర నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎన్టీఆర్‌ని ఆ పాత్ర చేసేందుకు ఒప్పించారు. ఆ ఒక్క సినిమాతోనే కృష్ణుడి పాత్ర పోషణలో ఎన్టీఆర్‌కు సాటిలేరన్న ఖ్యాతి వచ్చేసింది. అలాగే భీష్మ గెటప్‌లో ముందు ఎన్టీఆర్‌ని ఎవరూ గుర్తించనే లేదట. ఈ గొప్పతనం అంతా మేకప్‌మెన్‌లదే. తరువాత నటీనటులు సొంత మేకప్‌మాన్‌లను ఏర్పాటు చేసుకోవటం మొదలైంది. ఎన్టీఆర్‌కు పీతాంబరం. కృష్ణంరాజుకు జయకృష్ణ, విజయశాంతికి ఏయమ్ రత్నం మేకప్‌మెన్‌లుగా చేశారు. ఆ తర్వాత కాలంలో వాళ్లే నిర్మాతలుగా మారి పలు విజయవంతమైన చిత్రాలూ నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చినప్పుడు తన పర్సనల్ మేకప్‌మాన్‌ను తన వెంట తెచ్చుకున్నారంటే -చిత్ర నిర్మాణంలో మేకప్ శాఖ ఎంత ముఖ్యమో అర్ధమవుతుంది.
ఈ ఫొటో చూడండి. కథానుసారంగా పాత్రకు ఒకరూపం ఇవ్వడాని ఎంత నిబద్ధతతో మేకప్‌మాన్ కష్టపడుతున్నాడో. జగమేమాయ చిత్రం ద్వారా తెలంగేట్రం చేసిన రాజబాబు -మురళీమోహన్‌గా పేరుమార్చుకొని పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తర్వాత జయభేరి సంస్థ ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలూ ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత ప్రజాభిమానంతో రాజమండ్రి నుంచి ఎంపీ అయ్యారు. హీరోగా మురళీమోహన్ మంచి ఫామ్‌లో ఉన్నపుడు -ఒక చిత్రం షూటింగ్‌లో తన పర్సనల్ మేకప్‌మాన్ ద్వారా ఫైనల్ టచప్ చేయించుకొంటున్నప్పటి చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717