AADIVAVRAM - Others

ఆ నలుగురూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ చలనచిత్రరంగం రూపురేఖలను తీర్చిదిద్దిన ఘనుడు దాదాసాహెబ్ ఫాల్కె. ఆయన రూపొందించి విడుదల చేసిన చిత్రం ‘రాజా హరిశ్చంద్ర. ఈ చిత్రం 1913లో విడుదలైంది. సరిగ్గా వందేళ్ల తరువాత దానికి గుర్తుగా 2013లో ఓ అవార్డును కేంద్రం ప్రకటించింది. అదే ‘సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటి’. ప్రతి ఏడాది నవంబర్ 20 నుంచి గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా’లో విజేతకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 2013లో తొలి అవార్డును అలనాటి బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌కు, 2014లో ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు, 2015లో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఈ పురస్కారాన్ని కేంద్రం అందజేసింది. ఈ ఏడాది ప్రఖ్యాత నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యానికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు ‘జీవనసాఫల్య అవార్డు’గా దీనిని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రశంసాపత్రం, రజత మయూరం, ధ్రువపత్రం, దుశ్శాలువ, పది లక్షల రూపాయల నగదుతో ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన ‘ఇఫి’ వేడుకలో ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకోబోతున్న బాలు... తొలి తెలుగు కళాకారుడు కావడం విశేషం.