Others

చెపితే తెలియదట..తెలిసినవాళ్లు చెప్పరట...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాకు ఆత్మసాక్షాత్కారం అయింది’, ‘నేను బ్రహ్మమును తెలిసికొన్నాను’ అని ఎవరైనా చెబితే అట్టి వ్యక్తి ఆత్మను ఇంకా తెలిసికోలేదనే అర్థం. ఎందుకంటే ఆత్మను తెలిసికొన్న నేను వేఱు అనీ, తెలియబడిన వస్తువుగా ఆత్మవేఱు అనీ ఏర్పడుతుంది. సర్వమూ ఏకమే అనే అనుభూతియే జ్ఞానం అయినందువలన, ఇంద్రియములకు, మనస్సుకు గోచరము కాని అఖండ స్వరూపముగా ఆత్మ అను భవగోచరమవుతుంది..’ తానుగా నునికియే తనె్నఱుంగుటర, తాను రెండెక్కడ తన్మయ నిష్ఠ’ అని ఉపదేశ సారములోను, ‘నన్ను నేనెఱుగుదును, నన్ను నేనెఱుగను’ అని చెప్పుట హాస్యాస్పదముగా ఉన్నది’ అని ఉన్నది- నలుబదిలోను భగవాన్ శ్రీరమణ మహర్షి చెప్పారు. ‘తెలిసిన వాళ్ళు చెప్పరు, చెప్పే వాళ్ళకు తెలియదు’’ అనే మాట అందుకే ఏర్పడింది. జ్ఞానులయిన వారు తాము జ్ఞానము పొందామని ఇతరులతో చెప్పేందుకు అవకాశమే లేదని అందుకే కేనోపనిషత్తులో చెప్పబడింది.
ఇక జ్ఞానులెవరో, కానిదెవరో తెలిసికోవటం ఎవరికయినా నిజంగా చాలా కష్టం. ఆకార విశేషములను బట్టి గాని, వేష భాషలను బట్టిగాని, వచోనైపుణ్యమును బట్టిగాని, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలమును బట్టిగాని, గ్రంథ రచనా సామర్థ్యమును బట్టిగాని, వారు పొందే లేక చేసే ప్రచారాలను బట్టి గాని, వారి చుట్టూ చేరిన జన సమూహములను బట్టిగాని ఒక వ్యక్తిని జ్ఞానిగా గుర్తించటం కుదరదు.
తాము చెప్పక, ఇతరులు గుర్తించుటకు వీలుకాక ఇక ఒక జ్ఞానిని జ్ఞానిగా గుర్తించటం ఎలా అనే ప్రశ్న ఉంది. నిజానికి ఒక జ్ఞానిని మరొక జ్ఞానియే గుర్తించగలడు. ఇది నిజమే అయినప్పటికీ, జ్ఞాని సన్నిధి యొక్క మాహాత్మ్యమును బట్టి లోకం జ్ఞానులయిన వారిని గుర్తించి, పూజిస్తుంది. జ్ఞాని యొక్క సాన్నిధ్యమాత్రం చేత పక్వచిత్తులయిన వారి హృదయములు, అయస్కాంతము చేత ఇనుప ముక్కలవలె, ఆకర్షింపబడి, స్పందించి, శాంత్యానందములతో ఉప్పొంగుతాయి. జ్ఞాని యొక్క వౌన సన్నిధిలో జిజ్ఞాసువులకు సకల సంశయ విచ్ఛేదం అవుతుంది. జ్ఞాని యొక్క వీక్షణ మాత్రం చేత ముముక్షువులయిన వారి వాక్కు మూగపోతుంది, మనస్సు నిశ్చలమవుతుంది, హృదయం నిర్మలమవుతుంది. జ్ఞాని యొక్క సన్నిధి పశుపక్ష్యాదులను, వృక్షాదులను సైతం పులకింపచేస్తుంది. జ్ఞాని సన్నిధి భగవత్సన్నిధియే అవుతుంది. ఆత్మానుభవమును పొందిన ఇట్టి జ్ఞానులు తమను ఆశ్రయించి, సేవించి, ప్రశ్నించే సాధకులకు తమ ఆత్మానుభవం ఆధారంగా జ్ఞానోపదేశం చేస్తారు. ‘‘అడుగనిదే ఆత్మానుభవమును గూర్చి చెప్పకూడదు’’, అనే నియమాన్ని పాటించే జ్ఞానులు అజ్ఞాతంగా, ఏకాంతంగా ఉండగోరతారు. ప్రచారం చేసే ఆలోచన వారికి ఉండదు. అసలు తాము గురువులు అనీ, తమను ఆశ్రయించిన వారు శిష్యులు అనీ వారు భావించరు. ఏకాత్మ జ్ఞాన స్వరూపులయిన ఇట్టి మహాత్ముల చరణ స్పర్శవల్ల వసుంధర పుణ్యవతి అవుతుంది. వీరు స్నానమాడిన నదులు పుణ్యతీర్థములవుతాయి. వీరు నివసించిన స్థలములు పుణ్యక్షేత్రములవుతాయి. వీరి నోటి నుండి వెలువడిన మాటలు వేద శాసన సమములవుతాయి.

- కలగా మార్కండేయశర్మ