Others

ఏదో మిస్సవుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు వస్తున్నాయి. వస్తూనే ఉన్నాయి. ఉంటాయి కూడా.. కాకపోతే -గతంతో పోల్చుకుంటే ఏదో మిస్సవుతుంది. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లోని నిపుణులంతా సినిమా హిట్టుకోసమే పనిచేస్తున్నా -ప్రేక్షకుడికి అందేసరికి ఏదో మిస్సవుతుంది. అన్ని
సినిమాలనూ స్వర్ణయుగపు కాలంనాటి సినిమాలతో పోల్చడం సరికాకున్నా -ఇప్పటి ఏ సినిమాలోనూ అప్పటి కథనంలోని అనుభూతికాని, కథలోని గొప్పతనంకాని, పాత్రల్లోని ఔన్నత్యంకాని అందటం లేదన్న అసంతృప్తి లేకపోలేదు. ప్రేక్షకుడికి అందాల్సిన అసలుదేదో.. సాంకేతిక పొరలకింద కప్పడిపోతోంది.

ఒకప్పుడు-
సినిమా చేద్దాం అనుకున్న నిర్మాత -మంచి రచయితను వెతుక్కునేవాడు. అభిరుచికి తగిన కథ రాయించుకొనేవాడు. ఉన్నతమైన కథకు ఏ దర్శకుడు న్యాయం చేయగలడో వెతుక్కునే వాడు. ఆ దర్శకుడితో కలిసి ప్రయాణ చేస్తూ -కథలోని పాత్రలకు ఏ నటీనటులు సరిపోతారో సరైన అవగాహనతో ఎన్నుకునేవారు. ఎంచుకున్న కథకు ప్రాణం పోయగల, నటీనటులను పాత్రల పరిధిమేరకు తీర్చిదిద్దగల సాంకేతిక నిపుణులను మాట్లాడుకునే వారు. ముందే బౌండ్ చేయించుకున్న డైలాగ్ స్క్రిప్టును, ఆర్ట్ డైరెక్టర్, మేకప్‌మెన్, కాస్ట్యూమర్, నటీనటులకు అందించేవారు. ఆర్ట్ డైరెక్టర్ -కథలోని పాత్రలకు చక్కని గెటప్‌లు నిర్ణయించి రేఖాచిత్రాలు గీసి ఇచ్చేవాడు. అప్పట్లో ప్రతి చిత్రానికీ -స్టోరీబోర్డు వేయించుకునేవారు. దర్శకుడు బాపు తన చిత్రాలకు తానే స్వయంగా స్టోరీబోర్డు వేసుకొని చిత్రీకరణ చేపట్టేవారు. కథలోని పాత్రలకు తగినట్టు నటీనటులకు ఎలా రూపాలంకరణ చేయాలో మేకప్‌మెన్ ముందే సిద్ధం చేసేవాడు. ఎలాంటి డ్రస్సులు కుట్టాలో కాస్ట్యూమర్ ముందే కుట్టి ఇచ్చేవాడు. నటీనటులు తమ డైలాగులతోపాటు, ఆ సన్నివేశంలో తన పాత్రకు అటూ ఇటూ పాత్రధారుల సంభాషణలు సైతం ఇళ్లవద్దే ప్రాక్టీస్ చేసుకుని, ఇంటిదగ్గరే మేకప్ వేసుకొని సరైన సమయానికి సెట్స్‌కి వచ్చేవారు.
దర్శకుడు చిత్రీకరణ ప్రారంభించగానే నటీనటులు అలవోకగా హావభావాలు పలికిస్తూ సంభాషణలు చెప్పేశారు. ఇంత కసరత్తు చేసి వచ్చిన తరువాత కూడా -ఏ చిన్నలోపం కనిపించకుండా దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉండేది. అదీ అప్పటి దర్శకుల గొప్పతనం. ఇలాంటి చక్కటి ప్లానింగ్‌తో సినిమాలు నిర్మితమయ్యేవి కనుకే -అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్‌కు తక్కువలోనే చిత్రం పూర్తయ్యేది. సినిమాలోని మాట పాట.. హావం భావం అంతా సహజత్వానికి దగ్గరగా ఉండి ప్రేక్షకుల మదిలో చిరస్థాయి ముద్రపడేది.
సినిమా నిర్మాణం మొదలయ్యే సమయానికే -సన్నివేశానికి తగినట్టు పాటలు రాయించేవారు. మంచి సంగీత దర్శకుడితో బాణీలు కట్టించేవారు. ఏదైనా పదం ఉచ్చారణకు ఇబ్బంది అనిపిస్తే -సంగీత దర్శకుని సూచన మేరకు పదాన్ని మార్పించేవాడు. పాడాల్సిన గాయకుల చేత ముందే సాధన సైతం చేయించేవారు. అందుకే అప్పటి గాయనీ గాయకులకు తాము పాడిన అన్ని పాఠలు కంఠతా వచ్చేవి. రికార్డింగ్ సమయంలో రాగయుక్తంగా, భావ యుక్తంగా ఒకే టేకులో పాడేసేవారు. అందుకే అప్పటి పాటలు ఇప్పటికీ మణిపూసల్లానే మనసుకు తోస్తాయి.
**
ఇప్పుడు-
సినిమా భావుకత్వం నుంచి సాంకేతికత్వం పంచకు చేరిపోయింది. టెక్నాలజీ సినిమాను ఎన్నో విధాల మార్చేసింది. అందుకే -టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నంత వేగంగానూ సహజత్వం కరిగిపోతుంది. ఈ పరిస్థితికి ఒకటే కారణం -హోంవర్క్ మానేయడం! రోజుల తరబడి ఎందుకు కష్టపడాలి? టెక్నిక్ తెలిసింది. అందుకు తగిన టెక్నాలజీ వచ్చేసింది. సినిమాను రోజులు, గంటల్లో చుట్టేసే నిర్లక్ష్యం పెరిగిపోయింది. హీరోయే కథ. అనుభవం, అవగాహన లేకున్నా -24 విభాగాలపైనా దర్శకుడిదే డామినేషన్. ప్రొడ్యూసర్‌ని మెప్పించటమే టార్గెట్. సింగిల్ లైన్‌తో షూటింగ్‌లకి వెళ్ళటం, సెట్లో ఏదితోస్తే అది తీసెయ్యటం, హీరో మెప్పుకోసం ఒకే షాట్‌ని పది పదిహేనుసార్లు షూట్ చేయటంతో సినిమా అయిపోతుంది. సన్నివేశం తీసే సమయానికి సంభాషణలపై నటుడికి పట్టురాదు కనుక -ముక్కలు ముక్కలుగా ప్రామ్టింగ్ ఇవ్వడం. అవన్నీ డబ్బింగ్‌లో సెట్ చేద్దాంలే అనేసుకోవడం. అందరూ డూ డూ బసవన్నలే.
అందుకే -సాంకేతిక పొరలకింద సహజత్వానికి దూరంగా వస్తున్న సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. అందుబాటులోకి వస్తున్న సాంకేతికత -అసలు సారాన్ని మరింత పెంచేదిగా ఉండాలిగానీ, అదే అసలు అనుకుంటే గుర్తుపట్టలేనంతగానే సినిమాలు తయారవుతాయి. ఏదో మిస్సయిన ఫీలింగ్ ఉంటుంది.

-ఆకుల రాఘవ