Others

ఎన్నాళ్లిలా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంకర్ అనసూయ కెరీర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వుంటుందని ఆశిస్తున్నవారికి నిరాశ ఎదురవుతోంది. ఏ కార్యక్రమకం చేసినా సరికొత్తగా ప్రెజెంట్ చేయగల అనసూయ, బిగ్ స్క్రీన్‌పై తన కెరీర్‌ను వెతుక్కునే ప్రయత్నంలో పడింది. నటనకు నటన, గ్లామర్‌ను ఒలికించగల నేర్పు- రెండూ ఆమెకు వున్నాయి. కానీ, సరైన సినిమాలే పడడంలేదు. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నాగార్జునతో ఆడిపాడింది. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. ఆ దెబ్బతో అనసూయకు మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఆ హిట్ క్రెడిట్ అంతా నాగార్జున ఖాతాలో పడిపోయింది. దీంతో అనసూయ మళ్లీ తన ప్రయత్నాలు మొదటినుంచీ మొదలుపెట్టాల్సి వచ్చింది. టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ, మెయిన్‌స్ట్రీమ్‌లోకి వచ్చి మంచి చిత్రాలను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్నాళ్లిలా చిన్న చిన్న కార్యక్రమాలతో సరిపుచ్చుకోవడం అని అనసూయ కూడా భావిస్తోంది. ఓ మంచి అవకాశం కోసం అనసూయ ఎదురుచూడటంలో తప్పులేదు.