Others

కుక్కమాంసం తినాలన్న ఆదేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియా ఉగ్రశాసన పాలకుడు ‘కిమ్ జాంగ్ ఉన్’- ఊబకాయం గుండె జబ్బు యింకా చక్కెర వ్యాధితో బాధపడుతున్నా- ద్రాక్ష సారాయం తాగి, జున్ను తినకుండా వుండలేడు. కుక్క మాంసం అంటే ఎనలేని ప్రీతి. అతణ్ని ఆరోగ్యంతో ఉంచడానికి 130 మంది వైద్యులు హమేషా సిద్ధంగా ఉంటారు. దేశంలో కుక్క మాంసం అందరూ తినాలి. అందులో గోమాంసంకన్నా, కోడి మాంసంకన్నా పోషక పదార్థాలు ఎక్కువ అంటూ జనాలకి ఆర్డర్ వేశాడు. పైగా కుక్కల్ని చావచంపి కాల్చుకుతినాలని ప్రత్యేక సూచనలు చేయడంతో- సరిహద్దులు దాటి కుక్కలు దక్షిణ కొరియాలోకి దొంగతనంగా పారిపోతున్నాయి. దక్షిణ కొరియా- ఉత్తరకొరియాకి పూర్తిగా వ్యతిరేకం గనుక- అక్కడ కుక్కలను చంపరాదనీ, భుజించరాదనీ ఆంక్షలు పెట్టుకుని, పెద్ద ఎత్తున కుక్క భక్షణ వ్యతిరేక ఉద్యమం సాగిస్తున్నారు.
కుక్క మాంసాన్ని ‘డాన్‌గోగీ’ అంటారు. ఉ.కొ. రాజధానిలో ప్రత్యేక రెస్టారెంట్‌లు తెరిచి ‘కుక్కపులుసు’ని ఔషధంలాంటిదని ప్రచారం చేసి అమ్ముతున్నారు. త్వరలో ‘కుక్కయుద్ధం’ రుూ రెండు దేశాలమధ్యా తలెత్తినా ఆశ్చర్యం లేదు!