Others

మర్కట మూకల ‘రాస్తారోకో’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా రోడ్లమీద వాహనాలకి- గేదెల మందలు, గొర్రెల మందలూ అడ్డంగా వచ్చి పడిపోతూంటాయి. కొన్ని చోట్ల బాతుల బారులు రోడ్డును క్రాస్ చేస్తూ ట్రాఫిక్‌ని నిలిపివేస్తాయి. కాని విమానం గాలిలోకి లేచే ముందు రయ్‌న పరుగులు తీసే ‘చప్టామార్గం’- రన్‌వే అంటారు. హఠాత్తుగా వానర మూక వచ్చి దానిమీద పడి రాస్తారోకో చెయ్యడం అహమ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగింది.
అహమ్మదాబాద్ నుంచి 189 మంది ప్రయాణీకులతో చెన్నై వెళ్ళే బోయింగ్ జెట్ విమానం నెంబర్ బి737-800, సరిగ్గా ఆరు గంటల నలభై నిమిషాలకి బయలుదేరింది. గానీ పైలట్‌కి ‘‘వోరి బాబూ! రన్‌వేమీద వానర మూక వచ్చి పడ్డదిరా!’’ అంటూ సమాచారం అందింది.
ఇంకా స్పీడందుకోలేదు విమానం. కాబట్టి పైలట్ దాన్ని ఆపగలిగాడు. లేదా, పెద్ద ప్రమాదం జరిగి వుండేది.
స్పెస్‌జెట్ కంపెనీ విమానాలకు మాత్రమే ఇటువంటి ఆటంకాలు వస్తాయేమిటోనంటూ చాలామంది విస్తుపోయారు. దీనికి ముందు జబల్‌పూర్‌లో స్పయిస్ జెట్ ఒకటి ‘లోడింగ్’ ప్రక్రియ పూర్తిచేస్తూండగా, వరాహముల దండు ఒకటి రన్‌మీదికి గురగురలు చేస్తూ దూసుకొచ్చింది. ఆ కంపెనీవారు రుూ చతుష్పాద జంతువులకేదేనా తశ్శాంతి కార్యక్రమం చేయాలేమోనంటూ, ‘బ్రతుకు జీవుడా’ అనుకున్న ప్రయాణీకులు వ్యాఖ్యానించారు.
ఈ నేలా, రుూ నింగీ మరి అన్ని జీవులదీ కదా? మనిషి ఒక్కడే డామినేట్ చేస్తానంటే ఎలా?