మెయిన్ ఫీచర్

కాలాగ్ని స్వరూపం కార్తికేయరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులువారు నాడు దేశంలో అనేక మతాలను సంస్కరించి, సమన్వయపరిచి షణ్మాతాలను స్థాపించి షణ్మతాచార్యునిగా ప్రసిద్ధి పొందారు. ఆ ఆరుమతాలు- సౌర, శాక్త, వైష్ణవ, గాణపత్య, శైవ, సుబ్రహ్మణ్య (కుమార) మతాలు. అన్నింటికీ కలిపి పంచదేవతారాధన ఏర్పాటుచేసి విధి విధానాలు విశదం చేశారు. కాని అందులో సుబ్రహ్మణ్యుని ప్రస్తావించలేదు. అయితే దీపారాధన ‘శివశక్త్యాత్మకుడైన అగ్నిగర్భు’ని ఆరాధించడమేనని తత్త్వజ్ఞులు చెబుతారు. ఏ పూజకైనా ముందుగా దీపారాధన చేస్తారు. అంటే ఆ విధంగా వైదిక మతంలో సుబ్రహ్మణ్య ఆరాధన చెప్పబడింది.
కుమారస్వామి తత్త్వం రెండు త్రికోణాల సంయోగం. ఊర్థ్వముఖంగా శివతత్త్వం, అధోముఖంగా శక్తితత్త్వం, వీటి సంగమంవల్ల షట్కోణాలు ఏర్పడతాయి. ఈ షట్కోణాలు కుమారస్వామికిగల ఆరు ముఖాలు. వీటినుండి ఉత్పన్నమయే శక్తి అనంతమైనది. దివ్యాతిదివ్యం. అమోఘమైన శక్తిసంపన్నుడు కనుక శక్త్ధిరుడు అన్న పేరుంది. కుమారస్వామికి పార్వతి ప్రసాదించిన శక్త్యాయుధం కారణంగా కూడా శక్త్ధిరుడయ్యాడు.
కుమారస్వామి కాల స్వరూపుడు. షణ్ముఖుడైన కుమారస్వామిని సంవత్సరాగ్ని స్వరూపంగా వేదాలు పేర్కొన్నాయి. షణ్ముఖుడైన కుమారస్వామిని సంవత్సరాగ్ని స్వరూపంగా వేదాలు పేర్కొన్నాయి. కాలాగ్ని స్వరూపుడైన తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరుముఖాలు ఆరు రుతువులు, పనె్నండు చేతులు పనె్నండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని స్వరూపం. ‘చిత్రాగ్ని’ అనే నెమలిని వాహనంగా చేసుకున్నాడు. అనేక వర్ణాలను వెదజల్లే కాంతిపుంజమే నెమలిగా చెప్పేయి.
కుమారస్వామి జననమే అపూర్వం. తారకాసుర సంహారం కోసం శివశక్తుల సంగమం అనివార్యమైంది. పరతత్వం- వ్యక్తావ్యక్త తత్త్వాలనుండి జగద్రూపం తీసుకునే పరిణామ క్రమంలో కుమార సంభవం జరిగింది. అమోఘమైన శివతేజాన్ని పృధ్వి, అగ్ని, జలం, నక్షత్ర శక్తి (షట్‌కృత్తికలు) ధరించి, చివరకు అలౌకిక మహాగ్ని శరవణం (రెల్లుతుప్ప)లో రూపుదిద్దుకుంది. శరవణ భద్రడయ్యాడు సుబ్రహ్మణ్యడు.
సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. సునిశితమైన మేధాశక్తికి ప్రతీక. శివపురాణం ‘ఇచ్ఛాజ్ఞాన క్రియారూప మహాశక్త్ధిరం భజే
శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకమ్’ అని పేర్కొంది. ఇచ్ఛాజ్ఞాన క్రియా శక్తులను సమన్వయపరచిన జ్ఞానశక్తి స్వరూపుడు.
సుబ్రహ్మణ్యునికి ఎన్నో నామాలున్నాయి. పార్వతీ పరమేశ్వరులు సంగమంవల్ల కుమారస్వామిగా, శరవణంలో జన్మించడం చేత శరవణ భవుడని, కృత్తికలచేత పెంచబడిన కారణంగా కార్తికేయుడని, శక్తిఆయుధాన్ని దండంగా కలిగి ఉండడం చేత శక్త్ధిరుడని, దండాయుధపాణియని, శివతేజం స్కన్నమై వచ్చి రూపొందినవాడు కనుక స్కందుడని, వల్లీ దేవసేనలను పెళ్లాడిన కారణంగా వల్లీ దేవసేనా సమేతుడని, ఉత్థితకుండలినీ శక్తికి ప్రతీకగా సర్పరూపుడని ఎన్నో పేర్లున్నాయి.
వాల్మీకి రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రామలక్ష్మణులను వెంటపెట్టుకుని వెళుతూ మార్గాయాసం లేకుండా కుమార సంభవం వృత్తాంతాన్ని చెప్పి ఈ కథకు ఫలితాన్ని కూడా చెప్పారు.
కుమార సంభవం భవ్య పుణ్యగాథ. ఈ కథ విన్నవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాదులతో ఇహలోకంలో జీవించి, పరమందు స్కంద సాలోక్యాన్ని పొందుతారన్నారు.

- ఎ.సీతారామారావు