Others

హీరో.. విలన్! ( శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణయుగం నిర్మాత, దర్శకులలో మాటకు కట్టుబడి క్రమశిక్షణతో చిత్ర నిర్మాణం గావించిన వారిలో రోహిణీ ఫిలింస్ హెచ్‌యం రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘నిర్దోషి’ చిత్రం నిర్మాణంలో ఉన్న సమయంలోనే -తర్వాతి చిత్రాన్ని అంతా కొత్త వాళ్లతో నిర్మించ తలపెట్టి కొత్త నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చారు. అనేకమంది ఫొటోలు వివరాలతో పంపారు. వచ్చినవాటిలో ఇంటర్వ్యూలు కాకుండా కేవలం ఫొటోలనుబట్టి కొందరిని నిర్ణయించారు. అలా ఎంపికైన వారిలో నెల్లూరుకు చెందిన కల్లయ్య ప్రథముడు. కండలు తిరిగిన శరీరాకృతిగల కల్లయ్యను హీరో పాత్రకు ఎంపికచేసి కథా చర్చలు మొదలెట్టారు. ఇక్కడే చిన్న సమస్య వచ్చింది. నిర్దోషి చిత్రం నిర్మాణంలో ఉన్నపుడు లక్ష్మీకాంతారావు అనే నటుడిని చిన్న వేషంతో పరిచయం చేస్తూ, తర్వాత చిత్రంలో ప్రధాన పాత్ర ఇస్తామని వాగ్దానం చేశారు హెచ్‌యం రెడ్డి. హీరో అవుదామని మద్రాస్ వచ్చి అవకాశం కొరకు ఎదురుచూస్తున్న ఆ యువ నటుడు, దర్శకుడి మాట మీద ఆశపెట్టుకొని ‘నా విషయం ఏం చేశారు. నాకు ఏ పాత్ర ఇస్తున్నారు’ అని అడగటంతో హెచ్‌యం రెడ్డి ఖంగుతిన్నారు. మాట తప్పటం మా వంశంలోనే లేదంటూ లక్ష్మీకాంతారావును హీరోగా నిశ్చయించుకున్నారు. అప్పటికి హీరో వేషానికి ఎంపిక చేసుకున్న కల్లయ్యను విలన్ పాత్రకు ఒప్పించి చిత్రం మొదలెట్టారు. ఆ చిత్రం పేరు ప్రతిజ్ఞ (1953). ఆ లక్ష్మీకాంతారావును కాంతారావుగా, కల్లయ్య ఇంటి పేరుతో రాజనాలగా చిత్రంలో పరిచయం చేశారు. తొలుత రాజనాల మాత్రం హీరో వేషమే కావాలని పట్టుపట్టినా, చివరకు హెచ్‌యం రెడ్డి మాటమీద గౌరవంతో ఒక కండిషన్‌తో విలన్ పాత్రకు ఒప్పుకున్నారు. అదేంటంటే -చిత్రం టైటిల్స్‌లో నా పేరే ముందు పడాలన్నది రాజనాల పట్టుదల. దానికి హెచ్‌యం రెడ్డి కూడా అంగీకరించారు. అందుకే ‘ప్రతిజ్ఞ’ చిత్రం టైటిల్స్‌ను గమనిస్తే, విలన్ రాజనాల పేరే ముందు మనకు కనిపిస్తుంది. దీనివల్ల కొంతకాలంపాటు పరిశ్రమలో చిన్న చమత్కారం కూడా నడిచింది. అదేంటంటే -కాంతారావు ఎక్కడైనా బయట కనిపిస్తే ‘ప్రతిజ్ఞ’ సినిమాలో హీరోగా చేసిన రాజనాల ఈయనే అనేవారట. రాజనాలకు, కాంతారావు తమ గురువు హెచ్‌యం రెడ్డిలాగా సెంటిమెంట్ మీద బాగా నమ్మకాలు ఏర్పడ్డాయి. ప్రతిజ్ఞ చిత్రంలో హీరో పాత్ర పేరు ప్రతాప్. అందుకే కాంతారావు తమ ప్రథమ పుత్రుడి పేరు ప్రతాప్ అని పెట్టుకొన్నారు. అలాగే కృష్ణాంజనేయ యుద్ధంలో ఆంజనేయ పాత్రలో మొదటిసారిగా నటించిన రాజనాల తమ కుమార్తెకు ‘పావని’ అని పేరు పెట్టారు. ఆ తరువాత హీరోగా, విలన్‌గా నువ్వా నేనా అనేరీతిలో నటన ప్రదర్శించి కాంతారావు, రాజనాల ఇద్దరూ బిజీ నటులయ్యారు.
రాజనాల పరిశ్రమకు రాకపూర్వం ఆర్ నాగేశ్వరరావు విలన్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి విలన్‌గా పేరు ప్రఖ్యాతులు పొందాడు ఆర్ నాగేశ్వరరావు. జల్సాలకు, ఆడంబరాలకు అలవాటుపడి అర్థాయుష్షుతో 59 ఏళ్లకే తనువు చాలించాడు. ఈ విలన్ పాత్రల స్వభావమేమిటోగాని రాజనాల కూడా భార్య మరణంతో పరిస్థితులు తారుమారై ఆర్థిక ఇబ్బందులతో చివరి రోజులు కనాకష్టంగా గడపాల్సి వచ్చింది. నేటికీ రాజనాల పెద్ద కుమార్తె నళిని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవితం గడుపుతోంది. ఈ విలన్ వేషాల విషయం అలావుంటే, ఒకనాటి విలన్ ఆర్ నాగేశ్వరరావు ఇంటి పేరు కూడా రాజనాల కావటమే మరొక విశేషం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717