Others

రోడ్లమీద టూరిస్టుల గానాబజానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్ల రద్దు ప్రభావం చూపని చోటంటూ రుూ పవిత్ర భారతభూమిలో ఎక్కడా లేదు. రాజస్థాన్‌లో ‘పుష్కర్’కి చాలామంది విదేశీయులు- ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలనుంచి కూడా ఎంతో సంబరంగా వచ్చారు. అక్కడే జరిగే ఒంటెల సంతలు, దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధాలు- కానీ పోయిన వారం రుూ పరదేశీయులు - ‘తంతే దమ్మిడీ లేదు’ అన్నట్లుగా ఖాళీ జేబులతో హతాశులై వుండిపోయారు. బ్యాంకులలో క్యాష్ లేదు. ఏ.టి.ఎమ్‌లలో నుంచి పైకం రాదు. ఈ దయనీయ స్థితిలో వాళ్ళకో అయిడియా వచ్చింది. ఇండియన్ రోడ్లమీద గారడీలు, సర్కస్ ఫీట్స్- అలాగే నాట్య గానాబజానాలు జరుగుతూనే వుంటాయి. ఈ రోజుల్లో కూడా ‘నాచ్ బేబీ! నాచ్.. పైసా మిలేగా’ అంటే, ‘‘గెంతులెయ్యి పిల్లా! కాసుల కానుకలు పడతాయ్’ అని అర్థం- ఈ పాట చాలా పాపులర్!
జర్మనీవాళ్లు, ఫ్రెంచి వాళ్లు- వాళ్లకేం తీసిపోని ఆస్ట్రేలియన్సు- రెండు బృందాలుగా విడిపోయి- వాళ్లకి వచ్చిన డ్యాన్సులు పాటలు మొదలుపెట్టారు. చిన్న చిన్న సర్కస్ ఫీట్సు ప్రదర్శించారు. రైలు బళ్లలో కూడా దొమ్మరి బాలలు యిటువంటి విన్యాసాలు గారడీలు చేయడం టూరిస్టులుగా వాళ్లు కూడా చూశారు. కానీ పాపం, దేశం కాని దేశంలో వాళ్లకీ ముష్టిగతి పడుతుందని అనుకోలేకపోయారు. రెండు అట్టలమీద- ‘‘అమ్మలారా! అయ్యలారా! మాకు నగదు సాయం చెయ్యండి’’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు రాసి, అక్కడ పాతిపెట్టిమరీ ... ప్రదర్శనలు చేశారు. టూరిస్టులకు బ్యాంకులలోగానీ, ఏటిఎమ్‌లలోగానీ పోయి, వారానికి ఐదువేల రూపాయల దాకా ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చునన్నది గవర్నమెంటు. గానీ, అవి ఏ మూలకి వస్తుంది వాళ్లకి? ఈ గానాబజానాలవల్ల 2600 రూపాయలు దొరికాయిట పాపం! చెమటోడ్చారు!

-వీరాజీ