Others

ఆహారానికి హెర్బల్ టచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం నిత్యం తీసుకునే ఆహారానికి హెర్బల్ టచ్ అందించినట్లయితే ఆహారం సహజ సిద్ధమైన, ఆహ్లాదకరమైన పరిమళాలు వెదజల్లడంతోపాటు, విలక్షణమైన రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టచ్‌ని ఆహారానికి ఎలా అందించవచ్చో పరిశీలిద్దాం.
కూర వండే సమయంలో కరివేపాకుతో పాటు, నాలుగు తులసి ఆకులు జోడించండి. తులసి ఆకు అందించే వాసున, రుచి ఇంటిల్లిపాదికీ తప్పకుండా నచ్చుతుంది. ఆకుకూర పప్పు వండిన తర్వాత తాలింపు వేసి స్టవ్‌మీద నుండి దింపిన తర్వాత నాలుగైదు తులసి ఆకులను వేసి కలపండి. ఈ పప్పు ఒక కొత్త రుచిని, సువాసనను మీ కుటుంబానికి పరిచయం చేస్తుంది. రోజూ కాకుండా వారానికి రెండుసార్లు సులభమైన ఈ ప్రయోగాన్ని చేయండి.
ఇడ్లీ, దోశె, పుల్కా మొదలైన టిఫిన్లలోకి కొందరు గృహిణులు పచ్చి కొత్తిమీరతో పచ్చడి చేస్తుంటారు. ఆకర్షణీమైన రంగులో ఉండి, వెంటనే తినాలనిపించే ఈ కొత్తిమీర పచ్చడిలో స్వల్పంగా తులసి ఆకు, నేల ఉసిరిక ఆకు, పుదీనా, మెంతి ఆకు జోడించి చూడండి.. ఆహ్లాదకరమైన రుచిని నాలుకకు అందించే ఈ పచ్చడి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
టీ తయారుచేసేటప్పుడు అందులో ఏలకుల పొడి, పుదీనా, అల్లంజోడించండి. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు టీలో దాల్చిన చెక్క పొడి, అశ్వగంధ చూర్ణం కొద్ది మోతాదులో వేయండి. వీటితో కూడిన తేనీరు మీకు నచ్చే అవకాశం ఉంది. తేనీరు తయారీలో పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడి చూడండి.
ఇంటి పెరట్లో లేదా బాల్కనీలోని కుండీల్లో తులసి, కలబంద, నేల ఉసిరిక, పుదీనా, మెంతి కూరలు పెంచుతూ, వాటిని ఉపయోగించుకోవాలి. ఇంట్లోని వృద్ధులు, పిల్లలు కూడా వీటిని ఇష్టంగా అప్పుడప్పుడు స్వల్ప మోతాదులో తినే విధంగా ప్రోత్సహించాలి.
కాలేయ ఆరోగ్యాన్ని సంరక్షించే అద్భుతమైన మొక్క నేల ఉసిరిక. పక్షం రోజులకు ఒకసారి నేల ఉసిరిక మొక్కను వ్రేళ్ళతో సహా తీసుకుని, కడిగి చేతితో మృదువుగా నలిపి, ఇష్టదైవాన్ని స్మరిస్తూ నమిలి రసం మింగండి. చక్కటి ఈ చిట్కాను ఇంటిల్లిపాదీ ఆచరించండి.
దురద స్వభావం ఉన్నవారు వేప, తులసి, నిమ్మ ఆకులు, కలబంద కలిపి రుబ్బి, ఈ హరిత మిశ్రమంతో శరీరమంతా మృదువుగా రుద్దుకుని స్నానం చేయండి. ఎంత చక్కటి ఫలితం లభిస్తుందో మీరే ఆశ్చర్యపోయి ఈ సులభమైన పద్ధతిని ప్రతిరోజూ పాటిస్తారు.
కొద్దిపాటి మెళకువలతో సులభమైన విధానాలను ఆచరిస్తూ ఆహారానికి శ్రేష్టమైన, సురక్షితమైన సరికొత్త రుచులు జోడిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమేనని మనకు బోధపడుతుంది. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన పెంపొందుతుంది.

- జి.అరుణ