Others

తెల్ల మచ్చలను తొలగించుకోండిలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు పొద్దునే్న మొదలుపెట్టిన ఆపరేషన్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఆ తర్వాత ఫోన్ చూసుకుంటే అందులో ఎనిమిది మిస్డ్‌కాల్స్ ఉన్నాయి. బెంగుళూరులో ఓ పరిశ్రమలో పెద్ద పని చేస్తున్న స్నేహితుడిది. తిరిగి ఫోన్ చేస్తే, ‘‘అతని నుదుటి పక్క భాగంలో మచ్చలు వచ్చాయని, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నందున ముఖ్యమైన మీటింగ్ ఉన్నా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా, ఏదైనా మందు చెప్పవా’’ అని అడిగేడు. ‘మచ్చలు నల్లగా ఉన్నాయా’ అని అడిగా. ‘నల్లగా గాదు తెల్లగా ఉన్నాయని’ అతను సమాధానమిచ్చాడు. ‘‘తెల్లగానా..’’ అన్న నా మాటకి, ‘‘ఏదైనా సీరియస్సా’’ అని భయపడుతూ అడిగాడు. ‘‘సీరియస్ కాదు, ఓ ఫొటో తీసి పంపు, ఏ మందు వాడాలో చెప్తా’’ అన్నా. ఏ మందు వాడాలో చెప్పాక తను, ‘‘రేపటికల్లా తగ్గిపోతుంది కదా’’ అన్నాడు. ‘‘వారం పది రోజులు పడుతుంది’’ అని చెప్పా. ‘‘అన్ని రోజులా’’ అంటూ అవాక్కయ్యాడు. ఆ మచ్చల కారణంగా వారం రోజులు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడని తెలుసుకుని, ముఖంపై ఓ మచ్చ ఒకళ్ల జీవితాన్ని వారి జీవనోపాధిని ఇంతలా ప్రభావితం చేస్తుందా అని ఆశ్చర్యపోయాను. అందానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది కాదా అన్నది చెప్పలేను. ఎందుకంటే అది ఒకరి వ్యక్తిత్వానికి సంబంధించినది. కానీ తెల్లమచ్చల నిర్మూలన ఎలా అన్నది తెలుసుకుందాం.
ముఖంపై వచ్చే తెల్ల మచ్చలు
ముఖంపై తెల్ల మచ్చలు చాలా కారణాలవల్ల వస్తాయి

టినియా వర్సికలర్ (నిఉ ఉ్గడన్ళ్జిజ్జ్గ)
ఇది ఒక ఫంగల్ ఇన్‌ఫెక్షన్. 15 నుంచి 30 సంవత్సరాల వాళ్ళలో అధికంగా కనిపిస్తుంది. కాకపోతే ఏ వయసులోనైనా ఇది రావచ్చు. ముఖం, వీపు, మెడపైన వచ్చే ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ మన చర్మ రంగుని ఉత్పత్తి చేసే కణాలతో జోక్యం చేసుకొని తెల్ల మచ్చలకి దారి తీస్తుంది. వేడి, చెమట, ఒంటిని అంటి ఉండేలా వేసుకునే బట్టలవల్ల ఇది కలగవచ్చు.
చికిత్స:్ఫంగస్‌ని చంపే క్రీములు, సబ్బులు, సెలీనియన్ షాంపులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చికిత్స పూర్తయ్యాక కూడా ఇవి తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇన్‌ఫెక్షన్ వున్నప్పుడు మనం వేసుకున్న బట్టలు, రాత్రి పడుకున్న దుప్పటి, దిండు గలేబులు తిరిగి వాడే ప్రయత్నం చేయకూడదు. అదేకాకుండా ప్రతి నాలుగు వారాలకో వారం, ప్రతి నాలుగు నెలలకో నెల ఇన్‌ఫెక్షన్ లేకపోయినా పైచెప్పబడిన మందులు వాడడంవల్ల ఇన్‌ఫెక్షన్ తిరిగివచ్చే సమస్య ఉండదు. ఇన్‌ఫెక్షన్ పోయాక కూడా తెల్లమచ్చలు తగ్గడానికి కొన్ని వారాలనుంచి, కొన్ని నెలల సమయం పడుతుంది.
ఇంట్లో పాటించాల్సిన చికిత్సా విధానాలు
మచ్చల్ని వారానికి కనీసం రెండుసార్లు తేనె, బియ్యం, పసుపు మరియు చందనంతో చేసిన పేస్టుతో రుద్ది కడుక్కోవాల్సి ఉంటుంది.
పిటిరియాసిస్ ఆల్‌బా (-జఆకూజ్ఘఒజఒ ఇ్ఘ)
ఇది 6 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల్లో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలీదు కానీ, పొడి చర్మం ఉన్న పిల్లలలో బుగ్గలపైన, మెడ, వీపు, చేతులపైన వస్తుంది.
చికిత్స:దానికి ఏ రకమైన చికిత్స చేయకపోయినా అవంతట అవే తగ్గిపోతాయి. తగ్గడానికి బానే సమయం పడుతుంది. అవసరం అనుకున్నవారిలో మాయిశ్చరైజర్ లేక స్టెరాయిడ్ క్రీములు వాడతారు.
హైపోమెలనోసిస్ (దిశ్రీఉ హకూ-్జఉజ్జోడనిడ)
సాధారణంగా 40 సంవత్సరాల వయసు పైబడిన వారి లో ఈ మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి అన్నదానికి సమాధానం లేదు.
చికిత్స:సాధారణంగా ఏ చికిత్సా అవసరం లేదు. కావాలనుకున్నవారిలో స్టెరాయిడ్ మరియు రెటినోయిడ్ క్రీములు ఇస్తారు.
బొల్లి
ఇది అందరికీ తెలిసిన, ఎంతో మందిని పట్టి పీడిస్తున్న జబ్బు. ఇది ఓ రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే రోగ నిరోధక పనిచేసే కణాలు మన శరీరంపైనే దాడి చేసి ఓ సమస్యగా మారతాయి. బొల్లిలో ఈ రోగ నిరోధక కణాలు చర్మ రంగు ఉత్పత్తి చేసే కణాలను నిర్మూలించడం మూలాన ఈ తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఎందుకు ఈ రోగ నిరోధక కణాలు అలా ప్రవర్తిస్తాయి అన్నది ఇంకా తెలీని విషయం. ఈ బొల్లి ఎవరిలోనైనా, ఎప్పుడైనా రావచ్చు.
చికిత్స: బొల్లికి చికిత్స చేయడం అంత సులువైన పనికాదు. ఫలితాలు అందరిలో అంత ఆసక్తికరంగా ఉండవు. మొదట ఆ తెల్లమచ్చలు బొల్లేనని నిర్థారించుకోవాలి. చిన్ని మచ్చ్భాగాన్ని కోసి పరీక్షకి పంపితే (బయాప్సి) ఆ భాగంలో రంగు ఉత్పత్తి చేసే కణాలు అసలు లేకపోతే దానిని బొల్లి అని నిర్థారిస్తారు.
బొల్లికి వివిధ రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి. చిన్న మచ్చలను కోసి కుట్లు వేసేందుకు అవకాశం ఉంది. పెద్ద మచ్చలకు చర్మం గ్రాఫ్టింగ్, ఫొటోథెరపీ, డీ పిగ్మెంటేషన్ లాంటివి చెయ్యచ్చు. కొంతమందిలో స్టెరాయిడ్ మరియు ఓక్సొరెలన్ క్రీములు ఇవ్వడం జరుగుతుంది.
ఇంట్లో పాటించాల్సిన సూచనలు
అల్లంతో చేసిన రసం తాగడం రక్త సరఫరాని పెంచుతుంది.
వేప విత్తనాల నూనె బొల్లి మచ్చలపై రాసుకుంటే ఫలితాలు కొంతమందిలో బావుంటాయి.
ఆడవారు మేకప్ ద్వారా బొల్లి మచ్చల్ని కప్పుకోవచ్చు.
మగవారు గడ్డం, మీసం, జుత్తు ఉన్న ప్రదేశాల్లో బొల్లి వస్తే వాటిని పెంచి మచ్చల్ని కప్పుకునే ప్రయత్నం చెయ్యాలి.
కొన్ని శరీర ప్రాంతాలలో దుస్తుల ద్వారా కూడా బొల్లి మచ్చల్ని కప్పుకోవచ్చు.
గర్భం దాల్చినపుడు మరియు టానింగ్‌వల్ల కలిగే తెల్ల మచ్చలు అవంతటవే తగ్గిపోయేందుకు అవకాశాలు ఎక్కువ.
పెళ్లి తర్వాత పెదాలపైన తెల్ల మచ్చలు వస్తే అది బొల్లేమో అనుకొని భర్త, ఇంకా అత్తగారు ఆ పిల్లకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆ మచ్చల్ని కోసి పరీక్షకి పంపితే ఆ బొల్లి కాదని తెలిసింది. అప్పుడుగాని వాళ్ళు ఆమెని స్వీకరించలేదు. ఇది మనం నిర్మించుకున్న నేటి సమాజం. ‘‘వృత్తిలో నీతి, మానవత్వంపై ప్రీతి లేని సమాజం ఎప్పటికీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండలేదు’’.

-ఢా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్
సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

-ఢా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్