AADIVAVRAM - Others

ఉద్యోగుల అలవాట్లు - అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతకు జీవితం ఒక సవాల్. నిత్యం చదువుతో సమరం. తమ లక్ష్యాలను అడ్డంకొట్టే తల్లిదండ్రుల ఆంక్షలు. అయినా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నిర్దేశించుకుని లక్ష్యాలు ఏర్పరచుకుని కృషిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
మెదడులో ఆలోచన మొలకెత్తితే అది ఒక చర్యగా బహిర్గతమవుతుంది. చివరకు ఆ చర్య ఒక అలవాటుగా తయారవుతుంది. ఈ అలవాట్లు మనిషి వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా తయారవుతాయి. ఈ వ్యక్తిత్వం ఫలితంగా మన భవిష్యత్ ఊపిరి పోసుకుంటుంది.
తేడా అలవాట్లు.....................
కొంతమంది ఉదయం వాకింగ్ చేసి వ్యాయామం చేస్తారు. ఆ తరువాత ఆ రోజులో చేయాల్సిన పనులను ఎలా పూర్తి చేయాలో ప్రణాళికలు వేసుకుంటారు. ఇతరులను గౌరవించడం వారి జీవితంలో ఒక భాగం.. ఇవన్నీ మంచి అలవాట్లు.
కొంతమంది జీవితాన్ని నెగెటివ్‌గా తీసుకుంటారు. తమను తక్కువగా భావించుకుని ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఇతరులలో తప్పులను వెతుకుతూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు.
మరి కొంతమంది జీవితాన్ని కాలక్షేపంగా తీసుకుని మద్యపానం, ధూమపానం చేస్తూ, జూదాన్ని ఆశ్రయిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఇవి చెడు అలవాట్లు మాత్రమే కాదు ప్రమాదకరమైనవి కూడా.
అలవాటు చేసుకోవాలి......................
ప్రకృతి సూత్రాలను పాటిస్తే విజయం వరిస్తుంది. ఉల్లంఘిస్తే పరాజయం ఎదురవుతుంది. విజయ సాధనకు మనిషి అలవాటు చేసుకోవలసిన విషయాలు తెలుసుకుందాం.
నిజాయితీగా ఉండడం, సేవ చేయడం, పనిని ప్రేమించడం, కష్టపడి పని చేయడం, ఇతరులను గౌరవించడం, నమ్మకంగా ఉండడం, సమైక్యతా భావం కల్గి ఉండడం వంటి అలవాట్లు చేసుకోవాలి.
విజయానికి అడ్డదార్లు ఉండవు. అడ్డదారి ప్రమాదం. నియమాలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు.
అగచాట్లు....................
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవాళ్లకి తమాషా తమాషా హితబోధలు చేస్తూ ఉంటారు కొంతమంది సహోద్యోగులు. వీరిలో కొంతమంది వారు చేస్తున్న ఉద్యోగాన్ని నీచంగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉద్యోగం.. గొప్ప విషయం ఏమీ కాదు? ఇక్కడ ప్రమోషన్ రాదు, నైపుణ్యం అవసరం లేదు. పని చేయక్కర్లేదు. చివరకు మనిషికి ఉండే ప్రతిభ మసిబారిపోతుంది.. ఇలా మొదలుపెడతారు కొత్త ఉద్యోగితో.
ఇటువంటి వారు ప్రతిచోటా ఉంటారు. వీరి నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఇటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించగల్గాలి.
కొంతమందికి నెగెటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వారిని ఎవరైనా ఏదైనా సంప్రదిస్తే వెంటనే వారు ‘కష్టం.. ఇది జరగదు - మనం చేయలేము’ అంటారు. ఇటువంటి ఉద్యోగులతో పని చేయడం ఇతర ఉద్యోగులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
దీనికి పరిష్కార మార్గంగా వారు చెప్పే దుమారం వార్తలు, గాసిప్స్ వినాలి. కాకపోతే వాటికి తలూపకుండా అతనిలోని మంచి లక్షణాలు ప్రస్తావించి మెచ్చుకోవాలి. అప్పుడు అతడి దృష్టి మరలుతుంది. వారి దృష్టి పని మీద కేంద్రీకృతమవుతుంది. పనికిమాలిన కబుర్లపై దృష్టి నిలపక ఉద్యోగంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు.
నిర్లక్ష్యం........................
కొంతమంది ఉద్యోగులు ఏ పని చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తాము చేయాల్సిన పని ఇతర ఉద్యోగులపై గెంటివేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అనవసరంగా ఇతరులోత బాతాఖానీలో ఉంటారు. సమయపాలన వీరికి చేతకాదు.
ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి కారణం వారికి ఉద్యోగంలో అంకిత భావం లేకపోవడం. వీరిని విమర్శించినా, మందలించినా రెచ్చిపోతారు. వీరికి కొంచెం మార్గదర్శకత చేకూర్చగల్గితే పని బ్రహ్మాండంగా చేసుకుపోతారు.
మరి కొంతమంది ఉద్యోగులు ఏమి మాట్లాడినా పెదవి విప్పరు. వీరిలో జఢత్వ వైఖరి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయానికీ వీరిలో స్పందన ఉండదు. కదలిక ఉండదు.
వీరివల్ల సహోద్యోగులు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీరితో విభేదించడం కన్నా తరచు ఇతర ఉద్యోగులు వీరిని పలకరిస్తూ ఉండాలి. ‘మీ ఒంట్లో బాగా లేదనుకుంటాను’ అంటూ ఏదో మాట కలపాలి. జవాబు చెబుతారు. ఇటువంటి వారిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు గాని ఆఫీసులో చైతన్యం దెబ్బతినకుండా అప్పుడప్పుడు వీరిని కదలిస్తూ ఉండాలి.
అహంభావులు......................
ఈ తరహా ఉద్యోగులను ఏ మాత్రం విమర్శించినా సహించరు. వారికి చెప్పిన పని వారి స్థాయికి తగదని భావిస్తే ఇక ఆ పని చేయరు. ఇతర ఉద్యోగులకు చనువు ఇవ్వరు. ఎవరికీ సహాయం చేయరు. నలుగురితో కలిసి పని చేయరు. తాము ప్రత్యేకం అనుకుంటారు.
ఇటువంటి వారిని నలుగురితో కలిసి పని చేయమని ప్రోత్సహిస్తే వీరు సర్దుకుంటారు. వారికి వారే అహం తగ్గించుకుని టీమ్ వర్క్‌లో చేరేటట్లు ఉత్సాహపరచాలి.
కొంతమంది ఉద్యోగులు ఏ మాత్రం శుభ్రత పాటించరు. వీరి దగ్గరకు వెళితే భరించలేం. సరైన దుస్తులు ధరించరు. కాగితాలపై వీరు చేయి వేసినా అవన్ని మరకలై పోతాయి.
కంపెనీ యాజమాన్యం ఉద్యోగులంతా పరిశుభ్రంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేయాలి. శుభ్రత పాటించని ఉద్యోగికి అతని లోటు అతను నొచ్చుకోకుండా చెప్పవచ్చు.
బాధ్యత లేనివారు.........
బాధ్యత లేకుండా ప్రవర్తించే ఉద్యోగులు ప్రతి ఆఫీసులో తప్పనిసరిగా కొంతమంది ఉంటారు. తమ తప్పిదాలను ఇతరుల మీదకు గెంటేస్తూ ఉంటారు. ఇలాంటి వారితో పని చేయడం కష్టంగా ఉంటుంది. అజాగ్రత్తగా వున్న వారి మీదకు సులువుగా నేరాలు మోపుతారు. అందుకే ఇటువంటి వారికి ఏ పని అప్పగించినా రాతపూర్వకంగా అప్పగించాలి. అప్పుడు బాధ్యత స్వీకరిస్తారు. ఇలాంటి వారి చేత పని చేయించే ప్రయత్నం వల్ల తమ శక్తి వృథా అవుతుందని కొంతమంది బాస్‌ల అభిప్రాయం. ప్రైవేటు కంపెనీలయితే ఇటువంటి వారిని ఉద్యోగం నుండి తొలగించి వేస్తారు.

-సి.వి.సర్వేశ్వరశర్మ